E-Paper
Advertisement

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!
Advertisement

Electricity Bill Saving Tips: సాధారణంగా ఇంట్లో కరెంట్ బిల్లు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం ఏసీ, ఫ్రిజ్ అతిగా వాడటమే. ముఖ్యంగా ఎండాకాలంలో వీటి వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో నెల చివర్లో వచ్చే కరెంటు బిల్లు చూసి గుండె ఆగినంత పనవుతుంది. అయితే కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా ఏసీ, ఫ్రిజ్‌లు వాడుతూనే కరెంట్ బిల్లును సగానికి తగ్గించుకునే అవకాశం ఉంది. అదెలాగంటే..

చాలామంది ఏసీ వేయగానే గది త్వరగా చల్లబడాలని 18 లేదా 20 డిగ్రీల వద్ద పెడతారు. కానీ దీనివల్ల కంప్రెసర్‌పై ఎక్కువ భారం పడి విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఏసీని ఎప్పుడూ 24 నుంచి 26 డిగ్రీల మధ్య నడపడం మంచిది. ఈ ఉష్ణోగ్రత వద్ద శరీరం సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా.. కరెంట్ బిల్లు గణనీయంగా తగ్గుతుంది. అలాగే ఏసీతో పాటు సీలింగ్ ఫ్యాన్ తక్కువ వేగంతో వేస్తే చల్లని గాలి గది అంతటా వేగంగా విస్తరిస్తుంది.

Advertisement

Also Read: ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫ్రిజ్ కరెంట్ ఎక్కువగా తీసుకోకుండా ఉండాలంటే దానిని గోడకు చాలా దగ్గరగా పెట్టకూడదు. కనీసం ఆరు అంగుళాల ఖాళీ ఉంచడం వల్ల వెనక ఉండే వేడి సులభంగా బయటకుపోతుంది. అలాగే వేడి వేడి పదార్థాలను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. వాటిని బయట చల్లార్చిన తర్వాతే లోపల ఉంచాలి. ఫ్రిజ్ డోర్ రబ్బర్ పట్టీ సరిగ్గా ఉందో లేదో తరచూ చూసుకోవాలి. లోపలి చల్లదనం బయటకు పోతే కంప్రెసర్ ఎక్కువసేపు పనిచేసి కరెంట్ బిల్లు పెరుగుతుంది.

Advertisement

రాత్రి వేళల్లో ఏసీని నిరంతరం నడపాల్సిన అవసరం లేదు. ఏసీలోని టైమర్ ఆప్షన్ ఉపయోగించి రెండు లేదా మూడు గంటల తర్వాత ఆటోమేటిక్‌గా బంద్ అయ్యేలా సెట్ చేయవచ్చు. అలాగే ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఫిల్టర్లలో దుమ్ము చేరితే చల్లదనం తగ్గడమే కాకుండా కరెంట్ ఎక్కువ కాలుతుంది. ఏడాదికి ఒకసారి నిపుణులతో సర్వీసింగ్ చేయించడం వల్ల పరికరాలు ఎక్కువ కాలం మన్నికగా ఉండటంతో పాటు విద్యుత్ ఆదా అవుతుంది.

పది ఏళ్ల నాటి పాత ఏసీలు, ఫ్రిజ్‌లు విపరీతంగా విద్యుత్‌ను వినియోగిస్తాయి. కాబట్టి.. వీలైతే ఐదు స్టార్ రేటింగ్ ఉన్న ఇన్వర్టర్ మోడల్ పరికరాలను వాడటం మంచిది. ఇన్వర్టర్ టెక్నాలజీ గది ఉష్ణోగ్రతకు అనుగుణంగా కంప్రెసర్ వేగాన్ని మారుస్తుంది. దీనివల్ల సాధారణ పరికరాల కంటే చాలా తక్కువ కరెంట్ కాలుతుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ప్రతీ నెలా కరెంట్ బిల్లు భారం నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.

Also Read: ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

Tags

Related News

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×