E-Paper
Advertisement

అమెరికన్లు బట్టలు బయట ఎందుకు ఆరేయరు? కారణాలు తెలిస్తే పక్కా ఆశ్చర్యపోతారు!

అమెరికన్లు బట్టలు బయట ఎందుకు ఆరేయరు? కారణాలు తెలిస్తే పక్కా ఆశ్చర్యపోతారు!
Advertisement

Drying Clothes: ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉతికిన దుస్తులను బయట ఆరేయటం సర్వసాధారణం. భారత్‌తో సహా అనేక ఆసియా, ఐరోపా దేశాల్లో ఇది రోజూ జరిగే పనే. అయితే ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైన అమెరికాలో (USA) మాత్రం బట్టలు బయట ఆరేయడం అనేది దాదాపు కనిపించదు. అలా చేస్తే కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరిమానాలు కూడా పడతాయి. దీని వెనుక కేవలం సాంకేతిక కారణాలు మాత్రమే కాకుండా బలమైన సామాజిక, సాంస్కృతిక, చట్టపరమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.

హోమ్ ఓనర్స్ అసోసియేషన్స్ ఆంక్షలు

అమెరికాలో ఎక్కువ శాతం ఇళ్లు, కమ్యూనిటీలు.. ‘హోమ్ ఓనర్స్ అసోసియేషన్స్’ (HOA) నిబంధనల కింద నడుస్తాయి. కాలనీ అందాన్ని, గ్రాండ్ లుక్‌ను కాపాడే పేరుతో ఈ అసోసియేషన్లు ఇంటి బయట బట్టలు ఆరేయడాన్ని నిషేధించాయి. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే నోటీసులు జారీ చేయడం, భారీగా జరిమానాలు విధించడం వంటివి చేస్తుంటాయి.

పేదరికం ముద్ర.. పరువు సమస్య

Advertisement

అమెరికా సమాజంలో ఒక విచిత్రమైన భావన నాటుకుపోయింది. 1950, 1960ల కాలంలో డ్రైయర్లు (బట్టలు ఆరబెట్టే మిషన్లు) అందుబాటులోకి వచ్చాయి. ఆ కాలంలో ఇంట్లో డ్రైయర్ ఉండటాన్ని ఆడంబరంగా, ఆధునిక జీవనశైలికి గుర్తింపుగా భావించేవారు. ఫలితంగా బయట తాడు కట్టి బట్టలు ఆరేస్తే ‘ఇంట్లో డ్రైయర్ కొనుక్కునేంత స్తోమత లేదు’ అని పొరుగువారు భావిస్తారనే భావన మొదలైంది. కాలక్రమేణా ఇది బట్టలు ఆరేయడంపై ఒక సామాజిక ముద్రగా మారిcది.

ప్రాపర్టీ వ్యాల్యూ పడిపోతుందనే భయం

బయట రంగు రంగుల బట్టలు ఎండలో ఆరేయడం వల్ల కాలనీ అందం దెబ్బతింటుందని కొందరు అమెరికన్లు భావిస్తారు. దీనివల్ల తమ ఇళ్ల మార్కెట్ విలువ (Property Value) తగ్గిపోతుందనే ఆందోళన వారిలో ఉంటుంది. ఇల్లు అమ్మకానికి పెట్టినప్పుడు ఇటువంటి దృశ్యాలు కొనుగోలుదారులను వెనక్కి తగ్గేలా చేస్తాయని అక్కడి ఇంటి ఓనర్ల నమ్మకం.

ఎలక్ట్రిక్ డ్రైయర్లు వాడకం.. చౌకైన విద్యుత్

Advertisement

అమెరికాలో ప్రతి ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో వాషింగ్ మిషన్‌తో పాటు ‘ఎలక్ట్రిక్ లేదా గ్యాస్ డ్రైయర్’ ఉండడం సర్వసాధారణం. వాషింగ్ మిషన్ నుండి తీసిన వెంటనే డ్రైయర్‌లో వేస్తే కేవలం 30-40 నిమిషాల్లో దుస్తులు పూర్తిగా ఆరిపోతాయి. ఇతర ఐరోపా దేశాలతో పోలిస్తే అమెరికాలో విద్యుత్ ఛార్జీలు తక్కువగా ఉండటంతో ప్రజలు డ్రైయర్ల వాడకానికే మొగ్గు చూపుతున్నారు.

ప్రతీకూల వాతావరణం

అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో సగానికి పైగా రోజులు విపరీతమైన మంచు, చలి, వర్షం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బయట బట్టలు ఆరడం దాదాపు అసాధ్యం. దీనికి తోడు ఆ కాలాల్లో గాలిలో ‘పోలెన్’ (పుప్పొడి) అధికంగా ఉండటం వల్ల అది దుస్తులకు పట్టుకుని తీవ్రమైన అలర్జీలకు దారితీసే ప్రమాదం ఉందని అక్కడి వారు భావిస్తుంటారు.

Also Read: ఏసీ కొనడానికి ఇదే రైట్ టైమ్.. చలికాలంలో కొంటే ఎన్ని లాభాలో తెలుసా?

‘రైట్ టు డ్రై’ ఉద్యమం

అయితే, ఎలక్ట్రిక్ డ్రైయర్ల వల్ల విపరీతమైన కరెంట్ వాడకం, తద్వారా పర్యావరణ దెబ్బతింటుందని గ్రహించి ఇప్పుడు అమెరికాలో కొందరు మార్పు దిశగా ఆలోచిస్తున్నారు. సహజ సిద్ధంగా ఎండలో బట్టలు ఆరబెట్టుకోవడం వల్ల విద్యుత్ ఆదా అవ్వడమే కాక, పర్యావరణానికి మేలు జరుగుతుందని వాదిస్తున్నారు. ఫ్లోరిడా, కాలిఫోర్నియా వంటి కొన్ని రాష్ట్రాల్లో ‘Right to Dry’ చట్టాలను తీసుకువచ్చారు. ఈ చట్టాల ప్రకారం హెచ్ఓఏ నిబంధనలు ఉన్నప్పటికీ ఇంటి ఆవరణలో బట్టలు ఆరేయడాన్ని నిషేధించలేరు.

Also Read: జియో vs ఎయిర్‌టెల్.. రూ.500 లోపు ప్లాన్లలో ఏది బెటర్? పూర్తి వివరాలు!

Tags

Related News

చాణక్య నీతి.. ఈ 7 చెడు అలవాట్లు ఉంటే జీవితంలో విజయం ఎప్పటికీ సాధించలేరు

పైకి ఆరోగ్యంగా ఉన్నట్లున్నా.. మీ ఎముకలను లోలోపలే తినేస్తున్న చెడు అలవాట్లు ఇవే!

టమాటాలను ఉప్పునీటితో కడితే పురుగుమందులు పోతాయా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

రాత్రి బెడ్‌పై పడుకున్నాక పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయా? ఓవర్‌థింకింగ్ తగ్గించడానికి టిప్స్

పాలు, పెరుగు ద్వారా రేబిస్ వస్తుందా? వైరస్ వ్యాప్తి గురించి ఈ విషయాలు తెలుసుకోండి

రోజూ జిమ్‌కు వెళుతున్నారా? ఈ ఫుడ్స్ తప్పనిసరిగా తీసుకోవాలి

ఇదేంట్రా బాబు.. పశువులకు సోకే ఈ వైరస్ ఇప్పుడు మనుషులకు వస్తోందా?

Big Stories

Advertisement
×