E-Paper
Advertisement

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా
Advertisement

Political Drama OTT : ఓ చిన్నారి చేతిలో కేక్… దాని వెనుక ఓ నియంత పాలన, యుద్ధం, ఆంక్షలు, భయం దాగి ఉంటే ? స్కూల్‌ లో ఇచ్చిన ఓ పనిని పూర్తి చేయడానికి బయలుదేరిన తొమ్మిదేళ్ల పాప, ఆ ప్రయాణంలో తన దేశం ఎదుర్కొంటున్న అసలు పరిస్థితులను చూస్తే ? కేక్ కోసం కావాల్సిన పిండి, చక్కెర, గుడ్లు దొరకడమే ఓ పెద్ద సాహసంగా మారితే ? 1990ల ఇరాక్‌ లో చిన్నారి కోణంలో నియంతృత్వ పాలనను, సామాన్యుల కష్టాలను చూపించిన ‘The President’s Cake’ ఇప్పుడు Netflixలోకి వచ్చింది. హసన్ హాది తెరకెక్కించిన ఈ చిత్రం 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో Caméra d’Or గెలుచుకోవడంతో పాటు, Directors’ Fortnight Audience Award కూడా అందుకుంది. ఇరాక్ తరఫున ఆస్కార్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ విభాగానికి అధికారికంగా ఎంపికై, షార్ట్‌లిస్ట్ వరకు వెళ్లింది. మరి ఆ కేక్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి ? లామియా ప్రయాణం ఎలాంటి భయంకరమైన నిజాలను బయట పెడుతుంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

1990ల ఇరాక్‌ లో యుద్ధం, ఆర్థిక ఆంక్షలు, ఆహార కొరతల మధ్య ప్రజలు బతకడానికి పోరాడుతుంటారు. ఇదే సమయంలో అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పుట్టినరోజు వేడుకల కోసం దేశంలోని స్కూళ్లన్నీ కేక్ తయారు చేయాలని ఆదేశిస్తాయి. క్లాస్‌ లో ఆ బాధ్యత ఎవరి మీద పడుతుందో అని భయపడుతున్న తొమ్మిదేళ్ల లామియా చివరకు ఎంపికవుతుంది. ఇక తప్పించుకునే మార్గం లేకపోవడంతో కేక్ కోసం కావాల్సిన పదార్థాలను వెతుక్కుంటూ లామియా తన స్నేహితుడు హసన్‌ తో కలిసి బయలుదేరుతుంది.

Advertisement

కానీ ఆ చిన్న ప్రయాణం ఆమె ఊహించినంత సులభంగా ఉండదు. కొరతతో ఖాళీగా ఉన్న దుకాణాలు, భయంతో జీవిస్తున్న ప్రజలు, అధికార వ్యవస్థ ప్రభావం ఆమెకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి. కేక్ తయారు చేయడమే లక్ష్యంగా మొదలైన ఈ ప్రయాణం క్రమంగా బతుకుదెరువు కోసం చేసే పోరాటంగా మారుతుంది. లామియా ఎదుర్కొనే ప్రతి చిన్న సమస్య వెనుక అప్పటి ఇరాక్‌ లోని పెద్ద రాజకీయ వాస్తవం కనిపిస్తుంది. చిన్నారి అమాయకత్వంతో చెప్పే కథలో నవ్వు, బాధ కూడా ఉంటుంది. చివరికి లామియా కేక్ తయారు చేయగలదా ? దాని కోసం ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి ? అనేదే సినిమాలో చూడాల్సిన అసలు పాయింట్.

Also Read : వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

తెలుగులో అందుబాటులో ఉందా?

Advertisement

హసన్ హాది రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బనీన్ అహ్మద్ నయ్యెఫ్, సజాద్ మొహమ్మద్ ఖాసెమ్, వహీద్ థాబెట్ ఖ్రేబాట్, రహీమ్ అల్‌హజ్ తదితరులు నటించారు. సినిమా నిడివి సుమారు 102 నిమిషాలు. అరబిక్ ఒరిజినల్‌ గా రూపొందిన ఈ చిత్రం Netflixలో సెప్టెంబర్ 3 నుంచి అందుబాటులోకి వచ్చింది. అరబిక్ భాషతో పాటు హిందీ ఆడియో కూడా అందుబాటులో ఉంది. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో లేదు. పొలిటికల్ డ్రామా, డార్క్ హ్యూమర్, బాల్యం, యుద్ధ ప్రభావం వంటి అంశాలతో కట్టిపడేస్తున్న ఈ సినిమాను డోంట్ మిస్.

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×