E-Paper
Advertisement

Confidential Gmail: చదవగానే డెలీట్ అయిపోయే రహస్య జిమెయిల్.. పాస్‌కోడ్‌తో సురక్షితంగా ఇలా పంపించండి

Confidential Gmail: చదవగానే డెలీట్ అయిపోయే రహస్య జిమెయిల్.. పాస్‌కోడ్‌తో సురక్షితంగా ఇలా పంపించండి
Advertisement

Confidential Gmail Passcode| ప్రపంచవ్యాప్తంగా అత్యధిక యూజర్లు ఉపయోగించే ఈమెయిల్ సర్వీస్ జిమెయిల్ (Gmail). జిమెయిల్ ఒక ఉచిత ఈమెయిల్ సర్వీస్. జిమెయిల్ అకౌంట్‌తో 15GB స్టోరేజ్ ఉచితంగా లభిస్తుంది. ఈ స్టోరేజ్ గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్ కోసం కూడా వినియోగించవచ్చు. చాలా మంది జిమెయిల్‌ని సాధారణ ఈమెయిల్స్ పంపడానికే వినియోగిస్తారు. అయితే యూజర్లు ఏదైనా రహస్య సమాచారం పంపించడానికి Gmailలో ప్రైవసీ, సెక్యూరిటీ కోసం చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. అందులో ఒకటి కాన్ఫిడెన్షియల్ మోడ్. ఈ ఫీచర్‌తో రహస్య సమాచారం ఉన్న ఈమెయిల్స్ సురక్షితంగా పంపవచ్చు.

Gmail కాన్ఫిడెన్షియల్ మోడ్

కాన్ఫిడెన్షియల్ మోడ్ రహస్య సమాచారం లీక్ కాకుండా భద్రపరచడానికి సహాయపడుతుంది. ఈ మోడ్‌లో పంపిన ఈమెయిల్‌ను రిసీవర్ ఫార్వర్డ్ చేయడం కుదరదు, కాపీ చేయలేరు, డౌన్‌లోడ్ చేయలేరు. ఈమెయిల్‌కు ఎక్స్‌పైరీ డేట్ సెట్ చేయవచ్చు. ఆ సమయం అయిపోయాక ఈమెయిల్ ఓపెన్ చేయలేరు. మరో ముఖ్య ఫీచర్ పాస్‌కోడ్ వెరిఫికేషన్. రిసీవర్ పాస్‌కోడ్ ఎంటర్ చేస్తేనే ఈమెయిల్ చూడగలరు. ఈ పాస్‌కోడ్ SMS ద్వారా రిసీవర్ మొబైల్ నంబర్‌కు వస్తుంది. దీంతో ఈమెయిల్ మరింత సురక్షితంగా ఉంటుంది.

కాన్ఫిడెన్షియల్ ఈమెయిల్ ఎలా పంపాలి?

Advertisement

జిమెయిల్ మొబైల్ యాప్‌లో సీక్రెట్ ఈమెయిల్ పంపడం చాలా సులభం. ముందుగా జిమెయిల్ యాప్ ఓపెన్ చేయండి. “Compose” బటన్‌పై ట్యాప్ చేసి కొత్త ఈమెయిల్ స్టార్ట్ చేయండి. రిసీవర్ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. సబ్జెక్ట్, మెసేజ్ రాయండి. టాప్ రైట్ కార్నర్‌లో మూడు డాట్స్ మెనూ ఉంటుంది. దానిపై ట్యాప్ చేయండి. మెనూలో “Confidential Mode” ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేసి ఆన్ చేయండి.

కాన్ఫిడెన్షియల్ మోడ్ సెట్టింగ్స్ ఎలా చేయాలి?

కాన్ఫిడెన్షియల్ మోడ్ ఓపెన్ చేశాక.. టాగిల్ స్విచ్ ఉంటుంది. దాన్ని ఆన్ చేయండి. ఇప్పుడు ఈమెయిల్ ఎక్స్‌పైరీ టైమ్ సెలెక్ట్ చేయండి. ఒక రోజు, ఒక వారం, ఒక నెల, మూడు నెలలు, 5 సంవత్సరాలు.. అనే ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఎక్స్‌పైరీ అయిపోయాక ఈమెయిల్ ఓపెన్ కాదు. తర్వాత పాస్‌కోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. “SMS passcode” ఎంచుకోండి. ఇది రిసీవర్ మొబైల్ నంబర్‌కు కోడ్ పంపుతుంది. ఆ తరువాత సెండ్ బటన్ ప్రెస్ చేయండి.

రిసీవర్ ఈమెయిల్ ఎలా ఓపెన్ చేస్తారు?

Advertisement

ఈమెయిల్ పంపాక రిసీవర్ సాధారణంగా ఈమెయిల్ చూస్తారు. కానీ ఓపెన్ చేయలేరు. మొదట SMS పాస్‌కోడ్ ఎంటర్ చేయాలి. సరైన కోడ్ ఎంటర్ చేస్తే ఈమెయిల్ కనిపిస్తుంది. ఈ ప్రక్రియ సెన్సిటివ్ సమాచారాన్ని రక్షిస్తుంది.

Also Read: ఏఐతో డబ్బు సంపాదించడం ఎలా? సింపుల్ టిప్స్ ఇవిగో

కీలక సెక్యూరిటీ సెట్టింగ్స్

కాన్ఫిడెన్షియల్ ఈమెయిల్స్‌లో చాలా ఆంక్షలు ఉంటాయి. రిసీవర్ ఈమెయిల్‌ను ఫార్వర్డ్ చేయడం కుదరదు. కాపీ చేయలేరు, డౌన్‌లోడ్ చేయలేరు. లోకల్‌గా సేవ్ చేయలేరు. ఈ సెట్టింగ్స్.. సెన్సిటివ్ సమాచారం దుర్వినియోగం కాకుండా చూస్తాయి.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×