Podarillu Today Episode March 14th : నిన్నటి ఎపిసోడ్ లో.. మా బావ అంటే నాకు చాలా ఇష్టం కానీ మా బావ నన్ను ఎంత కంట్రోల్ లో పెట్టాలో అంత కంట్రోల్లో పెట్టారు అని గొప్పగా చెప్తుంది. ఇక పోలీసులు పురుషోత్తం ని తీసుకొని అక్కడికి వెళ్తారు. నీ వయసెంత నువ్వు ఇప్పటికి సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నావు. వారిని కూతుర్ని ఏం చేశారని నువ్వు ఇలా పెట్టావు కొంచమైన బుద్ధి లేదా అని ఎస్ఐ పురుషోత్తం ని తిడతాడు.. ఆ నలుగురిని రిలీజ్ చేసిన ఎస్ఐ ఈ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు..
ఈ అమ్మాయి వల్లే మీరు బయటకు వచ్చారు అని అంటాడు. అందరూ కలిసి మహాలక్ష్మికి థాంక్స్ చెప్తారు. ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు. పోలీసులు నువ్వు తప్పుడు కేసు పెట్టా కాబట్టి నీకు చుక్కలు చూపిస్తామని వార్నింగ్ ఇస్తారు. ఇక ఒక గంట తర్వాత పోలీసులు పురుషోత్తం ని రిలీజ్ చేస్తారు. పురుషోత్తం తాయారు అలాగే రమణయ్య ముగ్గురు కూడా గాయత్రిని బాధ పెట్టేలా మాట్లాడతారు.. ఇక తాయారు మాత్రం గాయత్రిని దారుణంగా కొట్టేస్తుంది. మొత్తానికి గాయత్రి పెళ్లి చూపులు సక్సెస్ అవుతాయి. దాంతో తాయారు చాలా సంతోషంగా ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. చక్రిమహా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంట్లోకి గాయత్రీ వస్తుంది. నువ్వు ఒకసారి వచ్చినందుకే మమ్మల్ని పోలీసులు తీసుకెళ్లారు. ఈసారి గనుక వస్తే మమ్మల్ని చంపేసిన చంపేస్తారు. మీ వాళ్ళు వద్దన్నా సరే నువ్వు ఎందుకు ఇక్కడికి వస్తున్నావు అని చక్రి అంటాడు. ఆ తర్వాత మహా కూడా మాధవ్ ని అడగగానే ఎందుకు ఈసారి ఎక్కడ తీసుకొని వెళ్లి పెడదామని అనుకుంటున్నావు అని సీరియస్ గా అరుస్తుంది. అసలు బావని ఇలా తీసుకెళ్తారని అసలు ఊహించలేదు. చాలా బాధగా ఉంది అందుకే బావకి క్షమించమని అడగడానికి వచ్చాను అని గాయత్రి అంటుంది. నువ్వు ఇలా వచ్చావని తెలిస్తే మీ అమ్మ మరోసారి మళ్లీ గొడవ చేస్తుంది ఎందుకు ఇక్కడికి రావడం వెళ్ళిపో అని మహాలక్ష్మి అంటుంది.
బావ అంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను ఇలా రావాలి అని అనుకున్నాను అంతే..తప్ప మిమ్మల్ని ఇలా పోలీసులు తీసుకెళ్లాలని నేను ఏ రోజు అనుకోలేదు అని గాయత్రి చెప్తుంది. కానీ నీకు మాధవ్ గారు అంటే అంత ఇష్టమైతే పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చెయ్.. అంతేకానీ ఇలా నీకు నువ్వే కుంగిపోవాలని అనుకోవద్దని మహాలక్ష్మి ఎంత చెప్తున్నా సరే గాయత్రి మాత్రం వినదు. అయితే ఇకపోతే నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని పెళ్లి చూపులకు ఎందుకు కూర్చున్నావు అని మహాలక్ష్మి గాయత్రి ని అడుగుతుంది.. మా అమ్మ చచ్చిపోతాను అని బెదిరిస్తే కూర్చున్నాను అని గాయత్రి అంటుంది. నువ్వు ధైర్యం చేసి పెళ్లి చేసుకుంటావా లేదా అన్నది నీ ఇష్టం అని మహాలక్ష్మి అంటుంది.
అప్పుడే అక్కడికి వచ్చిన నారాయణ మళ్లీ ఎందుకు వచ్చావు అని అంటాడు. నువ్వు బాధపడాలని నేను అనుకోవడం లేదు నీ వల్ల నా కొడుకుని పోలీసులు తీసుకొని వెళ్లారు అదే నాకు బాధగా ఉంది.. వాడంటే నీకు ఇష్టమైతే నువ్వు ఒక అడుగు ధైర్యంగా ముందుకు వెయ్యు నీకు మేమందరం తోడున్నాం నా కోడలు కూడా నీకు సపోర్ట్ గా ఉంటుంది అని అంటాడు.. నువ్వు ఏది ధైర్యంగా చెయ్యకపోతే కచ్చితంగా మీ అమ్మ నీకు ఎవరో ఒకరి నుంచి పెళ్లి చేస్తుంది. మాధవ అంటే నీకు ఇష్టమైతే ఆ ధైర్యాన్ని నీ గుండెల్లోంచి బయటికి తీసుకురా.. వెనక గుమ్మం నుంచి కాకుండా ముందు గుమ్మం నుంచి ధైర్యంగా వెళ్ళు అని నారాయణ అంటాడు..
Also Read :రామరాజు ఇంట్లో హోలీ వేడుకలు.. అడ్డంగా దొరికిన విశ్వక్..శ్రీవల్లి ప్లాన్ గ్రాండ్ సక్సెస్…
ఇక తర్వాత గాయత్రి మాత్రం నారాయణ ఎంత చెప్పినా వినకుండా వెనక గుమ్మం నుంచే వెళ్ళిపోతుంది. నీ గుమ్మం ఇకమీదట మూసుకుపోతుంది అని నాయన చెప్తున్న సరే గాయత్రి మాత్రం నేర్చుకుంటూ అలానే వెళ్ళిపోతుంది.. గాయత్రి వెళ్లగానే మహాలక్ష్మి ఎందుకు ఈమె ఇలా చేస్తుంది మనసులో అంత ప్రేమను పెట్టుకొని ఎందుకు భయపడుతుంది అని చక్రీతో అంటుంది.. ఇక మహాలక్ష్మికి ఫోన్ రావడంతో నేను అర్జెంటుగా మా ఫ్రెండ్ ని కలవాలి బయటకు వెళ్తున్నాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మహా ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవాలి అని చక్రి కూడా ఆమెను ఫాలో అవుతూ వెళ్ళిపోతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…