E-Paper
Advertisement

పాత ట్యాబ్‌ను కిచెన్ డిస్‌ప్లేగా ఇలా మార్చుకుంటే.. వంట చేయడం మరింత ఈజీ అవుతుంది!

పాత ట్యాబ్‌ను కిచెన్ డిస్‌ప్లేగా ఇలా మార్చుకుంటే.. వంట చేయడం మరింత ఈజీ అవుతుంది!
Advertisement

Smart Kitchen Tips: కిచెన్‌లో కొత్త కొత్త వంటలు ట్రై చేసేటప్పుడు ఫోన్‌లో రెసిపీలు చూడటం, మధ్యమధ్యలో సరుకుల లిస్ట్ రాసుకోవడం కాస్త కష్టమైన పనే. ముఖ్యంగా చేతికి పిండి, నూనె అంటినప్పుడు పదే పదే ఫోన్ ముట్టుకుంటే స్క్రీన్ పాడవుతుందనే భయం ఉంటుంది. దీనికి బదులుగా ఇంట్లో ఎక్కడో మూలన పడేసిన పాత ఆండ్రాయిడ్ ట్యాబ్ లేదా ఐప్యాడ్‌ను ఒక డెడికేటెడ్ కిచెన్ డిస్‌ప్లేగా మార్చుకుంటే? వంట పని చాలా ఈజీ అయిపోతుంది కదా.

కావాల్సిన యాప్స్, వెబ్‌సైట్లు ఇవే..

ముందుగా మీ పాత ట్యాబ్‌లో వంటకు ఉపయోగపడే యాప్‌లు సిద్ధం చేసుకోండి. యూట్యూబ్‌తో పాటు మీకు నచ్చిన రెసిపీ యాప్‌లను ఇన్స్టాల్ చేయండి. కొలతల కన్వర్షన్ కోసం KitchenConvert వెబ్‌సైట్ బాగా పనిచేస్తుంది. ఒకేసారి వేర్వేరు వంటల టైమింగ్స్ చూసుకోవడానికి MultiTimer యాప్, సరుకుల లిస్ట్ రాసుకోవడానికి ఆండ్రాయిడ్‌లో Write Now, ఐప్యాడ్‌లో Apple Notes మంచి ఆప్షన్లు. ఇక వంట చేస్తూ బోర్ కొట్టకుండా పాటలు వినడానికి Spotify యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే సరి.

Advertisement

Also Read: ఇంత తక్కువ ధరకి ఇలాంటి ల్యాప్‌టాప్స్ వస్తున్నాయా? ట్రెండింగ్‌లో ఉన్న 5 మోడల్స్‌ ఇవే!

హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ చాలా సింపుల్..

యాప్‌లన్నీ వేసుకున్నాక.. వాటిని పదే పదే వెతుక్కోకుండా హోమ్ స్క్రీన్ మీద Widgets రూపంలో సెట్ చేసుకోండి. తరచూ చూసే రెసిపీ వెబ్‌సైట్లను యాప్‌లాగా మార్చుకోవడం చాలా తేలిక. ఆండ్రాయిడ్‌లో అయితే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి, పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి Install and create shortcut ఎంచుకోండి. ఐప్యాడ్‌లో అయితే సఫారీ బ్రౌజర్‌లో షేర్ ఐకాన్ నొక్కి Add to Home Screen క్లిక్ చేస్తే చాలు. స్క్రీన్ మీద ఒక్క క్లిక్‌తో ఓపెన్ అయిపోతాయి.

గోడకు అతికిస్తే ఇంకా సేఫ్..

Advertisement

ఈ కిచెన్ డిస్‌ప్లేను కిచెన్ గోడకు హ్యాంగ్ చేయడం లేదా వాల్ మౌంట్ చేయడం చాలా మంచిది. దీంతో వంట చేసేటప్పుడు నీళ్లు, నూనె చుక్కలు పడకుండా ట్యాబ్ సురక్షితంగా ఉంటుంది. దీనికోసం ఆన్‌లైన్‌లో దొరికే బడ్జెట్ టాబ్లెట్ వాల్ మౌంట్‌లను ఉపయోగించవచ్చు. అయితే మీరు ట్యాబ్ పెట్టే చోట వైఫై సిగ్నల్ సరిగ్గా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మర్చిపోకండి.

ఛార్జింగ్, కేర్ టిప్స్..

ట్యాబ్ ఎప్పుడూ రెడీగా ఉండాలి కాబట్టి.. ఛార్జింగ్ పాయింట్ దగ్గరగా ఉండేలా చూసుకోండి. బోర్డు కాస్త దూరంగా ఉంటే పొడవైన ఛార్జింగ్ కేబుల్స్ వాడటం బెటర్. అలాగే డిస్‌ప్లే ఎప్పుడూ ఆన్‌లో ఉంచకుండా.. అవసరమైనప్పుడే వాడుకుంటే బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. ఇలా పాత ట్యాబ్‌ను మళ్లీ వాడటం వల్ల డబ్బులు ఆదా అవ్వడమే కాకుండా.. కిచెన్‌కి ఒక మోడర్న్ లుక్ వస్తుంది.

Also Read: ఫాస్ట్ ఛార్జర్ పేరుతో ఈ తప్పు చేస్తున్నారా? ఫోన్‌కే కాదు.. మీకూ ప్రమాదమే!

Tags

Related News

ట్రెండింగ్‌లో బెస్ట్ స్లిమ్ పవర్ బ్యాంక్.. అసలు ధర తెలిస్తే షాక్ అవుతారు!

జియో 10వ వార్షికోత్సవ కానుక.. ఆ పాపులర్ ప్లాన్‌పై 120GB డేటా, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!

ఈ స్మార్ట్ టీవీ ఉంటే.. థియేటర్ ఎందుకు చెప్పండి!

ఫాస్ట్ ఛార్జర్ పేరుతో ఈ తప్పు చేస్తున్నారా? ఫోన్‌కే కాదు.. మీకూ ప్రమాదమే!

నాయిస్ ఐకాన్ 2 ఎలైట్ ఎడిషన్.. స్మార్ట్‌వాచ్ వచ్చేసిందోచ్!

ఇంత తక్కువ ధరకి ఇలాంటి ల్యాప్‌టాప్స్ వస్తున్నాయా? ట్రెండింగ్‌లో ఉన్న 5 మోడల్స్‌ ఇవే!

రూ.600కే 48 గంటల బ్యాటరీ లైఫ్‌తో.. మ్యాజిక్‌జోన్ ఇయర్‌బడ్స్!

Big Stories

Advertisement
×