DSC Sports: DSC నియామక ప్రక్రియలో జూడో సర్టిఫికెట్లపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని DSP శాప్ ఎండీ భరణి వివరణ ఇచ్చారు. 2025 ఆగస్టు 8–14 వరకు గ్రీవెన్స్‌కు అవకాశం ఇచ్చామని, అప్పుడూ జూడోపై ఆరోపణలు లేవని అన్నారు. ఫలితాల తర్వాత ఇచ్చిన గ్రీవెన్స్ సమయంలోనూ జూడోపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని అన్నారు. DSCకి ఏడాది తర్వాత దాఖలైన PILతో జూడో వివాదం తెరపైకి వచ్చిందని, PIL నంబర్ 170.. 2026 జూలై 23న దాఖలైందని అన్నారు. PILలో 2018 నుంచి జరిగిన పలు నియామకాలు, అడ్మిషన్ ప్రక్రియల ప్రస్తావన ఉందన్నారు.
జూడో సర్టిఫికెట్లపై SAP ఎలాంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని అన్నారు. సంబంధిత అసోసియేషన్, నేషనల్ ఫెడరేషన్ నుంచే సర్టిఫికెట్లను తీసుకున్నామని, DOPT మార్గదర్శకాల ప్రకారమే స్పోర్ట్స్ కోటా ఎంపిక ప్రక్రియ జరిగిందని అన్నారు. అర్హత సర్టిఫికెట్లు జారీ చేసే అధికారులను DOPT స్పష్టంగా నిర్దేశించింది. DOPT సూచించిన అధికారులే జారీ చేసిన సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకున్నామని ఎండీ భరణి క్లారిటీ ఇచ్చారు. యామక ప్రక్రియలో ఎలాంటి డివియేషన్, జోక్యం జరగలేదు. జూడో అసోసియేషన్ ఇచ్చిన సర్టిఫికెట్లపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ నివేదికలు సమర్పిస్తామన్నారు.
భర్తాభార్యలు కావడం వల్ల నియామకానికి అనర్హులవుతారా? అని శాప్ ఎండీ భరణి అన్నారు. మెరిట్ ఆధారంగానే కరిష్మా, ఇమామ్ హుసేన్ ఎంపిక జరిగిందని, ఇద్దరికీ సీనియర్ ఇంటర్-డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ సర్టిఫికెట్లు ఉన్నాయని తెలిపారు. 2014లో విద్యాసంస్థలో చదువుతుంటేనే టోర్నమెంట్ ఆడాలన్న నిబంధన లేదని, విద్యతో సంబంధం లేకుండా స్పోర్ట్స్ మెరిట్ ఉంటే పోటీల్లో పాల్గొనవచ్చు అని అన్నారు. కర్ణాటకలో చదువుతున్నా ఇమామ్ హుసేన్ ఏపీ వ్యక్తి.. ఏపీలో ఆడేందుకు అర్హత ఉందన్నారు. జిల్లాల వారీగా ఆడే నిబంధనలు ప్రతి ఫెడరేషన్‌లో ఒకేలా ఉండవని, జూడో వ్యవహారంపై మరోసారి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేస్తున్నామని, హైకోర్టు ఇచ్చే తుది ఆదేశాలను పూర్తిగా పాటిస్తామని ఎండీ భరణి క్లారిటీ ఇచ్చారు.
Also read: తెలంగాణ పోలీసులకు బిగ్ షాక్.. అసెంబ్లీ గొడవపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ!