E-Paper
Advertisement

Viral News: నా భార్యకు నా కంటే కుక్కలే ఇష్టం.. విడాకుల కోసం కోర్టుకెక్కిన భర్త!

Viral News: నా భార్యకు నా కంటే కుక్కలే ఇష్టం.. విడాకుల కోసం కోర్టుకెక్కిన భర్త!
Advertisement

చాలా మంది కుక్కలను ఇష్టపడుతారు. మరికొంత మంది ఇంట్లో పెంచుకుంటారు. ఇంకొందరికి వీధి కుక్కల పట్ల ప్రేమ, జాలి చూపిస్తుంటారు. వాటికి తరచుగా ఫుడ్ వేస్తారు. అయితే, ఓ మహిళ తన భర్త కంటే ఎక్కువగా వీధి కుక్కలనే ఇష్టపడుతుందట. చివరికి పక్క మీద భర్తను కాకుండా, వాటినే పడుకోబెట్టుకుంటుందట. ఆమెతో తట్టుకోలేనని, తనకు విడాకులు ఇప్పించాలని భర్త కోర్టుకెక్కాడు. ఈ ఆసక్తికర ఘటన గుజరాత్ లో జరిగింది.

ఇంతకీ అసలు ఏమయ్యిందంటే?

అహ్మదాబాద్‌కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి భార్య నుంచి విడాకులు కోరుతూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్య తనకంటే వీధి కుక్కలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించాడు. చివరికి బెడ్ రూమ్ లో బెడ్ మీద కూడా కుక్కలనే పడుకోబెట్టుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను బెడ్ రూమ్ లోకే రానివ్వడం లేదన్నాడు. ఓ రోజు బెడ్ మీద పడుకునేందుకు వెళ్లగా దాని మీద స్థలం లేకపోవడంతో, వాటిని తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తుండగా, అవి  కరవరాని చోట కరవడంతో లైంగిక ఆరోగ్యం ప్రభావితం అయ్యిందన్నారు. 2006లో వివాహం చేసుకున్నప్పటి నుంచి తన భార్యకు ఉన్న కుక్కల పిచ్చితో బాధపడుతున్నట్లు సదరు వ్యక్తి కోర్టుకు విన్నవించాడు.

తన కంటే కుక్కలే ఇష్టం!

Advertisement

సదరు వ్యక్తి భార్య యానిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్. అతడు చెప్పిన ప్రకారం.. ఆమెకు శారీరక సాన్నిహిత్యంపై ఆసక్తి లేదు.  పెళ్లి తర్వాత తనకు ఈ విషయం తెలిసింది. తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యాడు. కుక్కల కారణంగా అతడి లైంగిక ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. వారు నివసించే ప్రాంతంలో వీధి కుక్కలను ఇంట్లో ఉంచకూడదని రూల్స్ ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా ఆమె వీధి కుక్కలను ఇంట్లోకి తీసుకొస్తుంది. సోషల్ మీడియాలో, ఆమె తనతో కాకుండా, వీధి కుక్కలను ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలను పోస్ట్ చేస్తుందంటూ సదరు వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కుక్కల విషయంలో తన భార్య తరచుగా పక్కింటి వారితో గొడవ పడుతుందని, చాలాసార్లు పోలీసు కేసులు కూడా ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ఆమె కారణం చుట్టుపక్కల వారితోనూ తనకు మనశ్శాంతి లేకుండా పోయిందన్నాడు. పొరుగువారి వెక్కిరింపులు, అవమానాలతో బతుకుతున్నట్లు చెప్పాడు. వారి ప్రాంతంలో వీధికుక్కల సమస్యలు తలెత్తినప్పుడల్లా.. ఆమె కేసులు వేసి, ఇతరులను అవమానిస్తుందని, తాను ఆమెకు మద్దతుగా వెళ్లకపోతే, ఇతరులతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకపై ఈ బాధలను తాను భరించలేనని కోర్టుకు చెప్పాడు.

కొనసాగుతున్న కేసు విచారణ

2017లో అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టులో అతడు విడాకుల పిటిషన్ వేశాడు. కానీ, అక్కడ ఆ కేసు కొట్టివేయబడింది. ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించాడు. విడాకులు ఇస్తే రూ. 15 లక్షలు ఇస్తానని ఆమెకు ఆఫర్ చేసినట్లు చెప్పాడు. కానీ, తను ఏకంగా రూ. 2 కోట్లు ఆడుగుతుందన్నాడు. మరోవైపు, తన భర్త చెప్పేవన్నీ అవాస్తవాలేనని భార్య చెప్పింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది.

Advertisement

Read Also: మంకీ క్యాప్స్ ఎందుకు? డైపర్లు ఉండగా.. చలికాలంలో క్రేజీ ఐడియా!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×