E-Paper
Advertisement

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!
Advertisement

Huawei Tri Fold Phone: ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రై-ఫోల్డ్ (మూడు మడతలు కలిగిన) స్మార్ట్‌ఫోన్‌గా ‘హువావే మేట్ ఎక్స్ టీ అల్టిమేట్ డిజైన్’ గతంలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా హువావే సంస్థ తమ సెకండ్ జనరేషన్ Tri-Fold ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. దీనికి Huawei Mate XT 2 అని పేరు పెట్టే అవకాశం ఉంది.

ఈ ఫోన్ గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. తాజాగా లీకైన ఒక పేటెంట్ డిజైన్ ఈ హ్యాండ్ సెట్ విశేషాలను బయటపెట్టింది. గత మోడల్‌తో పోలిస్తే.. దీనిలో డిజైన్ పరంగా భారీ మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మడత పెట్టే విధానంలో మార్పు:

Advertisement

ప్రముఖ టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పేటెంట్ వివరాల ప్రకారం.. ఈ కొత్త ఫోన్ లోపలికి మడిచేలా (ఇన్‌వర్డ్-ఫోల్డింగ్) సరికొత్త డిజైన్‌ను కలిగి ఉండనుంది. పాత మోడల్ బయటకు మడిచేలా ఉంటే.. ఈ కొత్త ఫోన్ మాత్రం శాంసంగ్ గెలాక్సీ జెడ్ ట్రై-ఫోల్డ్ తరహాలో ఉంటుంది. దీనిలో ముందుగా ఎడమ వైపు ప్యానెల్, ఆ తర్వాత కుడి వైపు ప్యానెల్ లోపలికి మడతపడేలా వినూత్నమైన మెకానిజంను ఉపయోగించినట్లు తెలుస్తోంది.

Also Read: వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

ప్రత్యేకమైన కవర్ డిస్‌ప్లే:

Advertisement

పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో మరో పెద్ద మార్పు ఏమిటంటే.. పెద్ద ఫోల్డబుల్ స్క్రీన్‌తో పాటు బయట వైపు ఒక ప్రత్యేకమైన కవర్ డిస్‌ప్లేను కూడా అందించబోతున్నారు. దీంతో ఫోన్ పూర్తిగా మడిచి ఉన్నప్పుడు కూడా సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా వాడుకోవడానికి వీలవుతుంది. ఇక ఫోన్ వెనుక భాగంలో సరికొత్త సర్క్యులర్ (గుండ్రటి) కెమెరా మాడ్యూల్‌ను అమర్చినట్లు పేటెంట్ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది.

శక్తివంతమైన ఫీచర్లు:

ఈ ఏడాది అక్టోబరులో లాంచ్ అయ్యే అవకాశం ఉన్న ఈ Huawei Mate XT 2 ఫోన్‌లో కిరిన్ 9050 ప్రో చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. అలాగే బ్యాటరీ పరంగా కూడా అప్‌గ్రేడ్ చేస్తూ.. ఏకంగా 6,000mAh సామర్థ్యం గల బ్యాటరీని ఇచ్చే ఛాన్స్ ఉంది. పాత మోడల్ 10.2 ఇంచుల స్క్రీన్, 5,600mah బ్యాటరీ, 50MP కెమెరాతో చైనాలో సుమారు రూ.2,35,900 ధరతో విడుదలైంది. కొత్త ఫోన్ అంతకంటే మెరుగైన ఫీచర్లు, కొత్త లుక్‌తో రానుండటంతో టెక్ ప్రియుల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది.

Also Read: బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×