E-Paper
Advertisement

హువావే వాచ్ ఫిట్ 5 లీక్.. వామ్మో ఇన్ని ఫీచర్లా? ధర తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు!

హువావే వాచ్ ఫిట్ 5 లీక్.. వామ్మో ఇన్ని ఫీచర్లా? ధర తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు!
Advertisement

Huawei Smartwatches: ప్రముఖ టెక్ దిగ్గజం హువావే నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్‌లు త్వరలోనే మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. Huawei Watch Fit 5, Watch Fit 5 Pro పేరుతో రాబోతున్న ఈ వాచ్‌లకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించకముందే వీటి ఫీచర్లు, ధరలు బయటకు రావడంతో టెక్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. పాత మోడళ్లతో పోలిస్తే ఈసారి లుక్, బిల్డ్ క్వాలిటీ విషయంలో హువావే గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ధర వివరాలు ఇలా..

తాజా లీక్స్ ప్రకారం.. హువావే వాచ్ ఫిట్ 5 ధర సుమారు రూ. 21,800 ఉండొచ్చు. ఇక ప్రీమియం ఫీచర్లు ఉండే ప్రో వెర్షన్ ధర రూ.32,700 వరకు ఉండచ్చని అంచనా. రంగుల విషయానికొస్తే.. బేసిక్ మోడల్ బ్లాక్, వైట్, సిల్వర్/గ్రీన్, పర్పుల్ షేడ్స్‌లో దొరుకుతుంది. ప్రో వెర్షన్ మాత్రం స్టైలిష్‌గా ఉండే బ్లాక్, వైట్, ఆరెంజ్ రంగుల్లో వస్తోంది. హువావే సిగ్నేచర్ స్టైల్ అయిన రెక్టాంగిల్ షేప్‌లోనే ఇవి కూడా ఉండబోతున్నాయి.

Advertisement

Also Read: భారీ బ్యాటరీ, అదిరిపోయే కెమెరాతో Oppo F33 సిరీస్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

టైటానియం ఫినిషింగ్..

ఈసారి వాచ్‌లు చూడటానికే కాదు.. వాడటానికి కూడా చాలా బలంగా ఉండేలా డిజైన్ చేశారు. వాచ్ ఫిట్ 5 అల్యూమినియం బాడీతో వస్తుంటే.. ప్రో మోడల్‌లో టైటానియం ఫినిషింగ్ ఇచ్చారట. దీనివల్ల వాచ్ మరింత గట్టిగా ఉండటమే కాకుండా చేతికి పెట్టుకుంటే మంచి రాయల్ లుక్ ఇస్తుంది. డిస్‌ప్లే పగిలిపోకుండా ప్రో వెర్షన్‌లో సాఫైర్ క్రిస్టల్ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఈ వాచ్‌లకు డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఇక ప్రో మోడల్ అయితే నీళ్లలో ఏకంగా 40 మీటర్ల లోతు వరకు తట్టుకోగలదు. దీంతో ఈత కొట్టేటప్పుడు గానీ, డైవింగ్ చేసేటప్పుడు గానీ ఎలాంటి భయం అక్కర్లేదన్నమాట.

10 రోజుల బ్యాటరీ బ్యాకప్..

Advertisement

ఇకపోతే డిస్‌ప్లే విషయానికొస్తే.. ఈ రెండింటిలోనూ మంచి క్వాలిటీ స్క్రీన్స్ ఇచ్చారు. వాచ్ ఫిట్ 5లో 1.82 అంగుళాల అమోలెడ్ స్క్రీన్ ఉంటే.. ప్రో మోడల్‌లో 1.92 అంగుళాల స్క్రీన్ ఉంది. ఎండలో చూసినా అక్షరాలు స్పష్టంగా కనిపించేలా హై బ్రైట్‌నెస్ ఫీచర్ ఉంది. ఇక దీనిలో జీపీఎస్, బ్లూటూత్ 6.0, హార్ట్ రేట్ మానిటర్, బాడీ టెంపరేచర్ చూసే సెన్సార్లు అన్నీ ఉన్నాయి. ఎక్కువగా హెల్త్ కేర్ తీసుకునేవారి కోసం ప్రో మోడల్‌లో ECG సదుపాయం కూడా ఇచ్చారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 10 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Also Read: భారీ బ్యాటరీ, ఐఫోన్ లాంటి డిజైన్.. సామాన్యుల కోసం టెక్నో పవర్‌ఫుల్ 5G మొబైల్!

Related News

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. బెస్ట్ టీవీ దొరకదు బాస్!

రూ. 20 వేల బడ్జెట్‌లో బెస్ట్ వాషింగ్ మెషీన్! మీ ఇంటికి పర్ఫెక్ట్

రూ. 16,499 కే సామ్‌సంగ్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ! ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

జేబులో పట్టే సైజులో పవర్ బ్యాంక్.. ధర కూడా చాలా తక్కువ తెలుసా ?

ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్

ఫోటో, వీడియో ఎడిటింగ్ సరికొత్తగా! మీ బడ్జెట్‌లో టాప్ 5 డిస్‌ప్లే మానిటర్స్

Big Stories

Advertisement
×