E-Paper
Advertisement

భారీ బ్యాటరీ, అదిరిపోయే కెమెరాతో Oppo F33 సిరీస్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

భారీ బ్యాటరీ, అదిరిపోయే కెమెరాతో Oppo F33 సిరీస్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
Advertisement

Oppo F33 Series: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో తమ పాపులర్ F సిరీస్‌లో భాగంగా Oppo F33 5G అలాగే Oppo F33 Pro 5G అనే రెండు కొత్త ఫోన్లను ఇండియాలో లాంచ్ చేసింది. గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఊరిస్తున్న ఈ ఫోన్లు ఎట్టకేలకు మనముందుకు వచ్చేశాయి. ముఖ్యంగా రోజంతా ఫోన్ వాడేవారికి.. ఫొటోల పిచ్చి ఉన్నవారికి ఈ సిరీస్ బాగా నచ్చుతుందంటున్నారు టెక్ నిపుణులు.

ధరలు ఎలా ఉన్నాయంటే..

ముందుగా అందరూ చూసేది ధర గురించే కదా. ఒప్పో F33 5G బేస్ మోడల్ (6GB/128GB) రూ.31,999కి లభిస్తోంది. అలాగే కొంచెం ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటే 8GB/128GB వేరియంట్ రూ.34,999కి, టాప్ ఎండ్ 8GB/256GB మోడల్‌ను రూ.39,999కి సొంతం చేసుకోవచ్చు. ఇక Pro మోడల్ విషయానికి వస్తే.. 8GB/128GB ధర రూ.37,999గా ఉంది. దీనిలోనే 256GB కావాలంటే రూ.40,999 పెట్టి కొనాల్సిందే. పర్ల్ వైట్, ఫారెస్ట్ గ్రీన్ వంటి కంటికి ఇంపుగా ఉండే కలర్స్‌లో ఇవి లభిస్తున్నాయి. ఇప్పుడే వీటిని ప్రీ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు.

Advertisement

Also Read: భారీ బ్యాటరీ, ఐఫోన్ లాంటి డిజైన్.. సామాన్యుల కోసం టెక్నో పవర్‌ఫుల్ 5G మొబైల్!

Pro మోడల్ రేంజే వేరు..

Oppo F33 Pro 5Gలో డిస్‌ప్లే అదిరిపోయింది. 6.57 అంగుళాల అమోలెడ్ స్క్రీన్ వల్ల మనం చూసే సినిమాలు గానీ, వీడియోలు గానీ చాలా రిచ్‌గా కనిపిస్తాయి. ఇక ఫోన్ స్పీడ్ కోసం దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మ్యాక్స్ ప్రాసెసర్‌ను వాడారు. దీంతో ఫోన్ హ్యాంగ్ అవ్వడం లాంటి సమస్యలు ఉండవు. అన్నింటికంటే హైలైట్ ఏంటంటే.. ఈ ఫోన్‌లో ఏకంగా 7,000mAh బ్యాటరీ ఇచ్చారు. దీనికి తోడు 80W సూపర్ ఊక్ ఛార్జింగ్ వల్ల స్నానం చేసి వచ్చేలోపే ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇక వర్షంలో తడిచినా, దుమ్ములో పడినా ఏమీ కాకుండా దీనికి ఐపీ69-కే రేటింగ్ కూడా ఇచ్చారు.

భారీ బ్యాటరీ సామర్థ్యం..

Advertisement

తక్కువ ధరలో మంచి ఫోన్ కావాలనుకుంటే.. ఈ Oppo F33 5Gని ఓసారి పరిశీలించవచ్చు. ఇందులోనూ 6.5 అంగుళాల స్క్రీన్ ఉంది. అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీంతో స్క్రీన్‌ని ఎంత స్పీడ్‌గా స్క్రోల్ చేసినా చాలా స్మూత్‌గా ఉంటుంది. ఒక ఫొటోల కోసం 50MP కెమెరా, సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉండటం విశేషం. Pro ఫోన్‌లో ఉన్నట్టే దీనిలోనూ 7,000mAh బ్యాటరీ ఉండటం యూజర్లకు పెద్ద ప్లస్ పాయింట్.

Also Read: సామాన్యుల బడ్జెట్‌లోకి దిగొచ్చిన శాంసంగ్ ప్రీమియం ఫోన్లు.. ఆఫర్లు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×