Samsung 6.5 kg Semi Automatic Washing Machine: ప్రస్తుత కాలంలో రకరకాల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్లు మార్కెట్లోకి వస్తున్నప్పటికీ, శామ్‌సంగ్ అందిస్తున్న నమ్మకం, నాణ్యత వేరుగా ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, బ్యాచిలర్స్ లేదా ఇద్దరు ముగ్గురు సభ్యులు ఉండే చిన్న కుటుంబాల కోసం శామ్‌సంగ్ తీసుకొచ్చిన సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఈ కోవలోనే వస్తున్న ఈ మోడల్ నేడు విపరీతమైన ఆదరణ పొందుతోంది. కేవలం రూ. 10,690 బడ్జెట్‌లో లభిస్తున్న ఈ మెషీన్, బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది. అంతే కాకండా ఎక్కువ కాలం పాడవకుండా కూడా ఉంటుంది. దీని ధర పూర్తి ఫీచర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వాషింగ్ మెషీన్ మెయిన్ హైలైట్ దీని 5-స్టార్ ఎనర్జీ రేటింగ్. దీనివల్ల కరెంట్ బిల్లు గురించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ కరెంట్ తో ఇది పని చేస్తుంది. అలాగే ఇందులో 6.5 కేజీల లోడ్ కెపాసిటీని అందించారు. రోజువారీ బట్టలు, ఆఫీస్ వేర్స్ ,కాటన్ బట్టలను ఉతుక్కోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మిడిల్ క్లాస్ చిన్న ఫ్యామిలీలకు ఈ కెపాసిటీ చాలా బాగా సరిపోతుంది. అంతే కాకుండా బడ్జెట్ ఎక్కువగా పెట్టలేని వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
సాధారణ సెమీ-ఆటోమేటిక్ మెషీన్లలో బట్టలు ఆరడానికి చాలా సమయం పడుతుంది. కానీ శామ్‌సంగ్ ఇందులో ‘ఎయిర్ టర్బో డ్రైయింగ్ సిస్టమ్’ టెక్నాలజీని వాడారు. ఇది స్పిన్ టబ్ వేగంగా తిరిగేలా చేసి, బట్టల్లోని తేమను , నీటిని చాలా వేగంగా బయటకు లాగేస్తుంది. దీని వల్ల బట్టలు త్వరగా ఆరిపోతాయి, ముఖ్యంగా వర్షాకాలంలో ఇది ఎంతగానో సహాయ పడుతుంది. తక్కువ సమయంలో బట్టలు ఉతకాలనుకునే వారికి ఈ మోడల్ చాలా బాగా ఉపయోగ పడుతుంది.
Also Read: రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు
డిజైన్ పరంగా కూడా ఈ వాషింగ్ మెషీన్.. చాలా అద్భుతంగా ఉంది. బ్లూ , గ్రే కలర్ కాంబినేషన్ దీనికి మోడర్న్ లుక్‌ను ఇస్తుంది. నాణ్యమైన ప్లాస్టిక్ బాడీతో తయారవడం వల్ల తుప్పు పట్టే సమస్య అస్సలు ఉండదు. చాలా ఏళ్ల పాటు ఇది పాడవకుండా ఉంటుంది. క్యాస్టర్ వీల్స్ సపోర్ట్ దీనికి ఉండటం వల్ల దీన్ని ఇంట్లో ఒక చోటు నుంచి మరో చోటుకి ఈజీగా జరుపుకోవచ్చు. స్థలం తక్కువగా ఉన్న దీనికి సరిపోతుంది.
మీ బడ్జెట్ రూ. 12,000 లోపు ఉండి, కరెంట్ ఆదా చేస్తూ బట్టలను శుభ్రంగా ఉతికే నమ్మకమైన మెషీన్ కావాలనుకుంటే.. ఈ మోడల్ మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీ ఇంటికి ఫర్ఫెక్ట్ సెట్ అయ్యే ఈ మోడల్ ను వెంటనే ఆర్డర్ చేసేయండి.