E-Paper
Advertisement

AC Temperature Tips: 18°C vs 24°C.. వేసవిలో ఏసీ టెంపరేచర్ ఎంత పెడితే మంచిది?

AC Temperature Tips: 18°C vs 24°C.. వేసవిలో ఏసీ టెంపరేచర్ ఎంత పెడితే మంచిది?
Advertisement

AC Temperature Tips: వేసవిలో ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో పెరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేడి, ఉక్కపోతను భరించలేక ప్రజలు పెద్ద ఎత్తున ఏసీలను వినియోగిస్తుంటారు. బయట నుంచి ఇంట్లోకి వచ్చిన మరుక్షణం ఏసీ టెంపరేచర్ ను గణనీయంగా తగ్గించేస్తుంటారు. అసలు సమ్మర్ లో ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలి? శీతాకాలంలో ఎంత మెయిన్ టెన్ చేయాలి? దాని వల్ల కలిగి ప్రయోజనాలు ఏంటీ? ఇప్పుడు చూద్దాం.

వేసవి కాలం (Summer)

సాధారణంగా వేసవిలో గదిని త్వరగా చల్లబరుచుకునేందుకు చాలా మంది 16°C లేదా 18°C వద్ద ఏసీ టెంపరేచర్ పెడుతుంటారు. ఇది సరైన పద్దతి కాదు. సమ్మర్ లో ఏసీకి అనువైన ఉష్ణోగ్రత అంటే 24ºC – 26ºC మధ్య దానిని ఉంచాలి. భారత ప్రభుత్వ విద్యుత్ సామర్థ్య బ్యూరో (BEE) ప్రకారం.. 24°C అనేది మానవ శరీరానికి అత్యంత సౌకర్యవంతమైన, ఆరోగ్యకరమైన ఉష్ణోగ్రత. అయితే ఏసీ టెంపరేచర్ ను 1°C పెంచినప్పుడల్లా దాదాపు 6% విద్యుత్ ఆదా అవుతుంది. అంటే 18°C లో ఉంచే కంటే 24°C లో ఉంచితే మీ కరెంట్ బిల్లు భారీగా తగ్గుతుంది. 24°C వద్ద ఏసీ టెంపరేచర్ సరిపోలేదని భావిస్తే.. ఫ్యాన్ వేసి తక్కువ స్పీడులో పెట్టండి. ఇది మీ గదిని త్వరగా చల్లబరిచి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

శీతాకాలం (Winter)

Advertisement

కొన్ని ఏసీలు శీతాకాలం వినియోగించేందుకు సైతం అనువైనవిగా ఉంటాయి. మీ ఏసీలో ‘హీటింగ్’ (Heating/Hot mode) ఫీచర్ ఉన్నట్లయితే, చలికాలంలో గదిని వెచ్చగా ఉంచుకోవడానికి దీనిని వాడవచ్చు. శీతాకాలంలో ఏసీకి అనువైన ఉష్ణోగ్రత 20ºC – 22ºC మధ్య ఉంటుంది. బయట చలి ఎక్కువగా ఉన్న సమయంలో గదిలోపల ఈ టెంపరేచర్ ను మెయిన్ టెన్ చేయడం ద్వారా శరీరాన్ని వెచ్చగా, హాయిగా ఉంచుకోవచ్చు. ఒకవేళ 22ºC కంటే ఎక్కువ పెంచితే గదిలోని గాలి మరీ పొడిగా అయిపోయి చర్మం, గొంతు సమస్యలు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది.

Also Read: Best Time to Buy AC: కొత్త ఏసీ ఎప్పుడు కొనాలి? ఉత్తమ సమయం ఏది? చౌకగా ఎలా పొందొచ్చు!

రాత్రి వేళల్లో (During Sleep)

Advertisement

మనిషి జీవితంలో రాత్రి అనేది చాలా ముఖ్యమైనది. పగలంతా శ్రమ చేసి.. రాత్రి సేద తీరుతుంటారు. అలాంటి సమయాల్లో ఏసీని మరి తక్కువ టెంపరేచర్ పెట్టడం లేదా మరి ఎక్కువగా ఉంచడం సరైనది కాదు. కాబట్టి రాత్రివేళల్లో 25°C లేదా 26°C మధ్య ఏసీని ఉంచడం ఉత్తమం. మీ ఏసీలో ‘Sleep Mode’ ఆప్షన్ ఉంటే దాన్ని ఆన్ చేయండి. ఇది ప్రతి గంటకు 1°C చొప్పున ఉష్ణోగ్రతను పెంచి.. మీరు తెల్లవారుజామున చలితో లేవకుండా హాయిగా నిద్రపోయేలా చేస్తుంది.

Also Read: 75 inch Tv Discount: 75 ఇంచ్ స్మార్ట్ టీవీలపై 67 శాతం వరకు తగ్గింపు.. సోనీ టీవీలపై 55 శాతం డిస్కౌంట్

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×