E-Paper
Advertisement

CULT Teaser: విశ్వక్ సేన్ ‘కల్ట్’ టీజర్ వచ్చేసింది.. ఏంది భయ్యా ఆ నరుకుడు..

CULT Teaser: విశ్వక్ సేన్ ‘కల్ట్’ టీజర్ వచ్చేసింది.. ఏంది భయ్యా ఆ నరుకుడు..
Advertisement

CULT Teaser: టాలీవుడ్ ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తుంటారు. కేవలం నటుడిగానే కాకుండా, దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించే విశ్వక్, ఇప్పుడు ‘కల్ట్’ (#CULT) అనే సినిమాతో మరో సాహసోపేతమైన అడుగు వేశారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

Read also-Varalakshmi Sarathkumar: నాకు పునర్జన్మనిచ్చింది ఆయనే.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న వరలక్ష్మీ

మొదటి ‘స్లాషర్’ మూవీ..

Advertisement

ఈ సినిమాను చిత్ర యూనిట్ “India’s First Slasher” అని ప్రమోట్ చేస్తోంది. సాధారణంగా హారర్ సినిమాల్లో ఒక అపరిచితుడు లేదా సైకో కిల్లర్ వరుసగా హత్యలు చేస్తూ వెళ్లే కథాంశాలను ‘స్లాషర్’ జోనర్ అంటారు. తెలుగులో ఇలాంటి ప్యూర్ జోనర్ సినిమాలు రావడం చాలా అరుదు. టీజర్‌లో చూపించిన విజువల్స్, రక్తపాతం మరియు ఉత్కంఠ చూస్తుంటే విశ్వక్ ఏదో పెద్ద ప్రయోగమే చేస్తున్నట్లు అర్థమవుతోంది.

Read also-Mega 158: చిరంజీవి బాబీ సినిమాకు ముహూర్తం ఫిక్స్… రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే?

Advertisement

టీజర్ ప్రారంభం గోవా బ్యాక్‌డ్రాప్‌లో ఒక గ్రాండ్ పార్టీతో మొదలవుతుంది. “వన్స్ వి ఆర్ ఇన్సైడ్.. ఇట్స్ హెవెన్ గైస్.. నో లా, నో లిమిట్స్” అనే డైలాగ్ సినిమా మూడ్‌ను సెట్ చేస్తుంది. ఒక పార్టీకి వెళ్ళిన కొంతమంది యువకుల చుట్టూ కథ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ జరిగే ఒక వింత గేమ్, అందులో ఓడిపోయిన వారు ప్రాణాలు కోల్పోవడం వంటి అంశాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ‘రెడ్ బ్యాండ్’ టీజర్ కావడంతో ఇందులో హింస, అశ్లీలత, రక్తం ధారలుగా ప్రవహించే దృశ్యాలను ఏమాత్రం మొహమాటం లేకుండా చూపించారు. ఇది కచ్చితంగా యూత్, థ్రిల్లర్ ప్రియులను టార్గెట్ చేస్తూ తీసిన సినిమా అని స్పష్టమవుతోంది.

సాంకేతిక విలువలు..

‘KGF’, ‘సలార్’ వంటి చిత్రాలకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన రవి బస్రూర్, ఈ టీజర్‌ను తన మ్యూజిక్‌తో నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు. టీజర్‌లోని బిజియం చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. విశ్వక్ సేన్ క్లోజ్ ఫ్రెండ్, స్టార్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు మాటలు అందించడం విశేషం. విశ్వక్ సేన్ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహించడం ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ‘ఫలక్‌నుమా దాస్’ తర్వాత ఆయన పూర్తి స్థాయిలో మాస్ అండ్ రా ఎలిమెంట్స్‌తో వస్తున్న చిత్రమిది. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా, గాయత్రి భరద్వాజ్ కథానాయికగా నటిస్తోంది. మొత్తానికి ‘కల్ట్’ టీజర్ టాలీవుడ్‌లో ఒక కొత్త తరహా సినిమా రాబోతోందని చాటిచెబుతోంది. రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా, హాలీవుడ్ స్టైల్ స్లాషర్ థ్రిల్లర్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడంలో విశ్వక్ సేన్ ఎంతవరకు సఫలమవుతారో వేచి చూడాలి.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×