E-Paper
Advertisement

Summer 2026 Guide Car: సమ్మర్ లో మీ కారు కూల్ గా ఉండాలంటే, ఈ స్మార్ట్ ట్రిక్స్ ఫాలో అయిపోండి!

Summer 2026 Guide Car: సమ్మర్ లో మీ కారు కూల్ గా ఉండాలంటే, ఈ స్మార్ట్ ట్రిక్స్ ఫాలో అయిపోండి!
Advertisement

ఫిబ్రవరి పూర్తి కాకముందే ఇండియాలో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్క్ చేసిన కార్లు కాసేపట్లోనే హీటెక్కిపోతున్నాయి. అయితే, ఈ సమస్య నుంచి తప్పించుకుని, ఈ వేసవి కాలంలో మీ కారును చల్లగా ఉంచడానికి కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇంతకీ అవేంటంటే..

⦿ సరైన సన్‌షేడ్స్ ఉపయోగించండి

కారును కూల్ గా ఉంచడంలో సన్‌ షేడ్స్ ఉపయోగపడుతాయి. ముఖ్యంగా విండ్‌ షీల్డ్స్ కోసం హై క్వాలిటీ రిఫ్లెక్షన్,  సైడ్ విండోల కోసం మాగ్నెటిక్ షేడ్స్ ఉపయోగించడం మంచిది. అవి సన్ లైట్ ను అడ్డుకుని క్యాబిన్ ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.  డాష్‌ బోర్డ్‌ ను UV నష్టం నుంచి కాపాడుతాయి. అయితే, ఈ సన్ షేడ్స్ ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా ఉండాలి.

⦿ రివర్స్ పార్క్ చేయండి

Advertisement

బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేస్తే, వెనుక విండో మీ విండ్‌షీల్డ్‌కు బదులుగా కారును రివర్స్ చేయండి. ఎందుకంటే డాష్‌బోర్డ్ సూర్యరశ్మిని ఎక్కువగా తీసుకుంటుంది. చాలా ఎలక్ట్రానిక్స్ పరికరాలు అక్కడే ఉంటాయి. రివర్స్ చేయడం వల్ల కంట్రోల్స్ మీద వేడి పడదు.

⦿ కాటన్ బెడ్‌షీట్లు ఉపయోగించండి

మీ కారు సన్ ప్రొటెక్టర్లను మరచిపోతే లోపల విండ్‌షీల్డ్‌ పై తెల్లటి కాటన్ బెడ్‌ షీట్ వేయండి. ఫాబ్రిక్ సూర్యరశ్మిని రిఫ్లెక్ట్ చేస్తుంది. క్యాబిన్ వేడిని తగ్గిస్తుంది.

⦿ కారులోకి వెళ్లడానికి ముందే వేడిని తొలగించండి

Advertisement

ఇంజిన్‌ను ప్రారంభించడానికి ముందు కిటికీలు ఓపెన్ చేసిపెట్టాలి. ఆ తర్వాత డ్రైవర్ డోర్ ను 5, 6 సార్లు తెరిచి మూసివేయండి. ఇది వేడి గాలిని బయటకు వెళ్లేలా చేస్తుంది. క్యాబిన్ కూల్ అవుతుంది.

⦿ కప్ హోల్డర్‌లో ఫ్రోజెన్ బాటిల్‌ ఉంచండి

వాటర్ బాటిల్‌ను ఫ్రీజ్ చేయాలి. వాటిని గుడ్డలో చుట్టాలి. కారును స్టార్ట్ చేసిన తర్వాత A/C వెంట్ ముందు ఉంచాలి. ఇది త్వరగా క్యాబిన్ చల్లగా అయ్యేలా చేస్తుంది.

⦿ గాలి ప్రవాహం కొనసాగేలా చూడండి  

ఎండలో పార్క్ చేసే సమయంలో గాలి ప్రవాహానికి అనుకూలంగా ఉంచితే, కారు హీట్ కాకుండా చల్లిగా ఉంటుంది. క్రాస్ ఎయిర్‌ ఫ్లో కారణంగా వేడి అనేది లోపల ఉండిపోదు.

⦿ క్లాత్ డాష్, సీట్ కవర్లు

లెదర్ లేదంటే ముదురు ప్లాస్టిక్ కవర్లను కార్లలో ఉపయోగించకూడదు. కుట్టిన క్లాత్ డాష్‌ బోర్డ్ మ్యాట్లు, లేత రంగు సీట్ కవర్లను ఉపయోగించాలి. ఇవి వేడిని కూల్ చేయడంలో ఉపయోగపడుతాయి.

⦿ వైపర్ బ్లేడ్‌లను ఎత్తాలి  

ఎండలో, వైపర్ బ్లేడ్‌ లు కరిగిపోతాయి. వార్ప్ అవుతాయి. విండ్‌ షీల్డ్‌ కు అంటుకుంటాయి. అందుకే, ఎండలో పార్క్ చేసే సమయంలో వైపర్ బ్లేడ్ లను ఎత్తి ఉంచాలి.

⦿ టైర్లను నైట్రోజన్ తో నింపాలి  

తీవ్రమైన వేడిలో సాధారణ గాలి త్వరగా ప్రెషర్ కలిగిస్తుంది. టైర్ పేలే ప్రమాదాన్ని పెంచుతుంది. నైట్రోజన్ నెమ్మదిగా విస్తరిస్తుంది. లాంగ్ డ్రైవ్‌ సమయంలో మెరుగైన స్థిరత్వాన్ని అందిస్తుంది. నెక్ట్స్ టైమ్ ఫ్యూయెల్ నింపే సమయంలో నైట్రోజన్ కోసం అడగండి.

⦿ టైమ్ టు టైమ సర్వీసింగ్ చేసుకోండి

సాధారణంగా 8000 కి.మీకి ఓసారి సర్వీసింగ్ చేయించుకోవాలి. కానీ, అధిక వేడిలో కారు ఇంజన్లు వేగంగా అరిగిపోతాయి. అందుకే కారును, దాదాపు 7700 కి.మీ వరకు సర్వీసింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది.

Read Also: సమ్మర్ లో బైక్ రైడింగ్.. ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×