E-Paper
Advertisement

రూ. 2,000లకే ఎయిర్ ప్యూరిఫైయర్.. ఐఐటీ బాంబే రీసెర్చర్ అద్భుత ఆవిష్కరణ!

రూ. 2,000లకే ఎయిర్ ప్యూరిఫైయర్.. ఐఐటీ బాంబే రీసెర్చర్ అద్భుత ఆవిష్కరణ!
Advertisement

Natural Air Purifier: ఐఐటీ బాంబేకు చెందిన పిహెచ్‌డీ పరిశోధకుడు రోహన్ కుమార్ చౌకైన ఎయిర్ ప్యూరిఫైయర్‌ను రూపొందిస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన పీచు పదార్థాలు, మొక్కలు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులను (మైక్రోబ్స్) కలిపి ఈ సాధనాన్ని తయారుచేస్తున్నారు. ‘ఎన్విరోఫోర్జ్ ఎయిర్ ప్యూరిఫైయర్’ (Enviroforge Air Purifier) అని పిలిచే ఈ పరికరం ప్రారంభ ధర రూ. 2,000 మాత్రమే కావడం విశేషం. ఇంట్లో చేసిన ప్రాథమిక పరీక్షల్లో ఇది 80 నుంచి 85 శాతం వరకు గాలి కాలుష్యాన్ని తగ్గించినట్లు రోహన్ వెల్లడించారు.

ఆవిష్కరణ వెనుక ఉన్న స్ఫూర్తి

27 ఏళ్ల రోహన్ కుమార్ స్వస్థలం బీహార్. చదువు, ఉద్యోగ రీత్యా ఆయన ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి విభిన్న రాష్ట్రాల్లో నివసించారు. ఆయా ప్రాంతాల్లోని గాలి నాణ్యతలో ఉన్న వ్యత్యాసాలను గమనించిన రోహన్, అందరికీ శుభ్రమైన గాలి అందుబాటులో లేదనే విషయాన్ని గ్రహించారు. మొదట్లో మురుగునీటి శుద్ధి ప్రక్రియపై పరిశోధనలు చేసిన ఆయన.. ఆ సాంకేతిక సూత్రాలనే గాలి శుద్ధీకరణకు కూడా వర్తింపజేయవచ్చని భావించారు. 2024 ప్రారంభంలో ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌పై ప్రయోగాలు మొదలుపెట్టి దాదాపు 9 నుంచి 10 నమూనాలు (ప్రోటోటైప్స్) సిద్ధం చేశారు. గతేడాది డిసెంబర్ నాటికి తుది రూపాన్ని ఖరారు చేశారు. ప్రస్తుతం ఐఐటీ బాంబేలో సివిల్ ఇంజనీరింగ్‌లో పిహెచ్‌డీ చేస్తూనే ఆయన ఈ ప్రాజెక్టుపై రోహన్ పనిచేస్తున్నారు.

సహజ సిద్ధమైన పదార్థాలతో..

Advertisement

ఈ ప్యూరిఫైయర్‌లో వెదురు, కొబ్బరి, అరటి, జనపనార పీచులతో పాటు మస్లిన్, కాటన్, సిల్క్, మైక్రో-నానో-ఫైబ్రిలేటెడ్ సెల్యులోజ్‌లను ఉపయోగించారు. వీటితో పాటు యాక్టివేటెడ్ కార్బన్, బయోచార్, జియోలైట్ వంటి పీల్చుకునే గుణం ఉన్న పదార్థాలు, హెల్తీ బ్యాక్టీరియా, ఇండోర్ మొక్కలను ఇందులో అమర్చారు. ఇవన్నీ కలిసి గాలిలోని కాలుష్య కారకాలను సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లు రోహన్ తెలిపారు.

ఇది ఎలా పనిచేస్తుంది?

రోహన్ తయారు చేసిన ఈ ప్యూరిఫైయర్, ప్రకృతి, సైన్స్ ఆధారంగా పనిచేయనుంది. గాలి ఈ పరికరం పీచు పొరల గుండా వెళ్ళినప్పుడు దుమ్ము, PM2.5, PM10 వంటి సూక్ష్మ ధూళి కణాలు అందులో చిక్కుకుపోతాయి. ఆ తర్వాత వాయురూపంలో ఉన్న కాలుష్య కారకాలను సహజ శోషకాలు (adsorbents) గ్రహిస్తాయి. మంచి బ్యాక్టీరియా రసాయన కాలుష్యాలను విచ్ఛిన్నం చేస్తే.. మొక్కలు గాలిని స్వచ్ఛంగా మారుస్తాయి. ఇలా ప్రకృతి, సైన్స్ కలిసి ఈ పరికరంలో పనిచేస్తాయని రోహన్ వివరించారు. పరీక్షల్లో భాగంగా 800 క్యూబిక్ ఫీట్ల మూసివున్న గదిలో ఈ ప్యూరిఫైయర్‌ను ఉంచగా కేవలం 20 నిమిషాల్లోనే కాలుష్యం 80-85 శాతం తగ్గింది. అయితే ఈ ఫలితాలను ఇంకా బయటి లాబొరేటరీలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

Advertisement

Also Read: కత్తి అక్కర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు.. ఫ్రీజర్ మంచును ఈజీగా క్లీన్ చేసే సింపుల్ టిప్స్!

ఇంతకీ లాంచింగ్ ఎప్పుడంటే?

ఈ ప్యూరిఫైయర్ బేసిక్ మోడల్ ధరను రూ. 2,000గా నిర్ణయించారు. మిడ్ రేంజ్ మోడల్స్ రూ. 5,000 నుంచి రూ. 6,000 వరకు.. ప్రీమియం వెర్షన్ సుమారు రూ. 10,000 ధరకు అందుబాటులోకి రానున్నాయి. రోహన్ కుమార్ తన సహచరులు విపుల్, దేబాశిష్, అభినవ్‌లతో కలిసి ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. ఐఐఎం ముంబై (IIM Mumbai) లో ఇంక్యూబేట్ అయిన ఈ ఎన్విరోఫోర్జ్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.

Also Read: చాణక్య నీతి.. ఈ 7 చెడు అలవాట్లు ఉంటే జీవితంలో విజయం ఎప్పటికీ సాధించలేరు

Tags

Related News

రూ.9,990కే..మైక్రోవేవ్ ఓవెన్!బేకింగ్,గ్రిల్లింగ్,ఎయిర్ ఫ్రైయింగ్ అన్నీ ఒకే చోట

తక్కువ నెట్‌తో హై-క్లారిటీ వీడియోస్.. యూట్యూబ్ తీసుకొస్తున్న కొత్త టెక్నాలజీ ఇదే!

ఒప్పో నుంచి మరో మాస్టర్‌పీస్.. Find X10 సిరీస్ ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి!

అదుర్స్ అనిపించే సౌండ్..డాల్బీ ఆడియోతో అరిపించే మోడల్

సైబర్ మోసంలో డబ్బులు పోయాయా? తిరిగి పొందేందుకు మీకున్న హక్కులివే!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..టాప్ 5 వీడియో ఎడిటింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే

కత్తి అక్కర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు.. ఫ్రీజర్ మంచును ఈజీగా క్లీన్ చేసే సింపుల్ టిప్స్!

Big Stories

Advertisement
×