Hyderabad city: హైదరాబాద్ సిటీలో బస్సుల్లో ప్రయాణించే వారికి శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. నగరవాసుల ప్రయాణ ఖర్చులను తగ్గించడానికి సౌకర్యవంతమైన ప్రజా రవాణాను అందించేందుకు కొత్తగా వీక్లీ బస్ పాస్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ.600 చెల్లించి వరుసగా ఏడు రోజులపాటు గ్రేటర్ హైదరాబాద్ సిటీలో అపరిమితంగా ప్రయాణించవచ్చు.
హైదరాబాద్ సిటీకి ప్రతీ రోజూ లక్షలాది మంది వస్తుంటారు. అందులో ఉద్యోగులు, వ్యాపారాలు, ఇతర పనుల కోసం రాకపోకలు సాగిస్తుంటారు. ఒక్కోసారి పనులు జరగకపోవడంతో వారం రోజులపాటు ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు నగరానికి వచ్చినవారు నాలుగైదు రోజులు ఉంటే సిటీ మొత్తం తిరగాలని భావిస్తుంటారు. అలాంటివారికి కొత్త పథకం తీసుకొచ్చింది టీజీఆర్టీసీ. నగరంలో కొద్దిరోజుల ఉండే పర్యాటకులు ప్రతిసారి టికెట్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు.
పైగా డైలీగా పాస్ తీసుకునే దాని కంటే చాలా తక్కువ కూడా. దీనివల్ల ప్రయాణ ఖర్చులు, సమయం కూడా వెచ్చించాల్సి వస్తుంది. ఇబ్బందులను తగ్గించేందుకు వీక్లీ బస్సు పాస్ తీసుకొచ్చింది టీజీఎస్ ఆర్టీసీ. బస్సు పాస్ తీసుకున్న వారు వారం రోజులు అంటే ఏడు రోజుల వ్యవధిలో ప్రతిసారి టికెట్ కొనాల్సిన అవసరం ఉండదు. అర్హత కలిగిన అన్ని సిటీ బస్సులు, మెట్రో, ఏసీ బస్సుల్లో కూడా ప్రయాణించవచ్చు. ప్రయాణికులకు అందుబాటులో నెలవారీ, రోజువారీ బస్ పాస్ ఉన్నాయి. ఈసారి వారం బస్సు పాస్ పద్దతి తీసుకొచ్చింది. వారం రోజుల పాటు హైదరాబాద్ సిటీలో ఉండేవారికి అనుకూలంగా ఉండనుంది. మరి ఇంతకీ బస్సు పాస్ ఎక్కడ అందుబాటులో ఉంటుంది? అన్న అసలు ప్రశ్న.
రూ.600 వీక్లీ బస్సు పాస్‌లు నగరంలోని సిటీ బస్ పాస్ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి ఈ విషయాన్ని టీజీఎస్ ఆర్టీసీ స్వయంగా వెల్లడించింది. ఆసక్తి గల ప్రయాణికులు సమీపంలోని పాస్ కౌంటర్‌కు వెళ్లి వాటిని కొనుగోలు చేయవచ్చు. నగరానికి వచ్చే ప్రజలకు అందుబాటు ధరల్లో మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడమే దీని వెనుక ఉద్దేశమని చెప్పారు టీజీఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి. కొత్త వీక్లీ పాస్ ద్వారా ప్రయాణికులు ఏసీ బస్సులతోపాటు అన్ని రకాల సిటీ బస్సుల్లో అపరిమితంగా ప్రయాణించవచ్చు. పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్ సర్వీసులకు ఈ పాస్ వర్తించదు.
ALSO READ: ‘ధైర్యముంటే కొండగల్ రా.. సీఎం పవర్ ఏంటో చూపిస్తా’! జగదీష్ రెడ్డికి వేముల వీరేశం సవాల్