E-Paper
Advertisement

రూ.25వేలకే రోబోట్ వాక్యూమ్ క్లీనర్..ఆపర్ ముగిసేలోపే కొనేయండి

రూ.25వేలకే రోబోట్ వాక్యూమ్ క్లీనర్..ఆపర్ ముగిసేలోపే కొనేయండి
Advertisement

ILIFE T20s Pro robot vacuum cleaner: రోజూ చీపురు పట్టుకుని ఇల్లంతా క్లీన్ చేయడం, ఆ తర్వాత మాప్ పెట్టడం అంటే ఎవరికైనా కాస్త బద్ధకంగానే ఉంటుంది. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ లేదా బ్యాచిలర్స్ కు ఇది రోజువారీ పెద్ద టాస్క్. ఈ టెన్షన్ అంతా పోగొట్టడానికి టెక్నాలజీ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అందులో భాగంగానే మనుషుల ప్రమేయం లేకుండా ఇల్లును ఆటో మేటిక్‌గా క్లీన్ చేసే రోబోట్ వాక్యూమ్ క్లీనర్లు ఇప్పుడు ప్రతి ఇంటా ముఖ్యమైన గాడ్జెట్‌గా మారిపోయాయి. మార్కెట్లో ఎన్నో బ్రాండ్లు ఉన్నప్పటికీ, బడ్జెట్ ధరలో అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తున్న ILIFE T20s Pro ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలిచింది. తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ మోడల్స్ ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

ఆకట్టుకునే డిజైన్ :

ఈ డివైజ్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, ప్రీమియమ్ లుక్‌లో ఉంటుంది. దీంతో పాటు వచ్చే ‘సెల్ఫ్-జంపింగ్ డాక్’దీనికి మెయిన్ హైలైట్. సాధారణ రోబోట్ వాక్యూమ్‌లలో ప్రతి రోజూ మనం డస్ట్ బిన్ ఖాళీ చేయాల్సి వస్తుంది. కానీ ఇందులో ఆ అవసరమే లేదు. రోబోట్ తన క్లీనింగ్ పూర్తి కాగానే ఆటోమేటిక్‌గా ఆ స్ట్ బ్యాగ్‌ వద్దకు వెళ్లి, దానిలో ఉన్న చెత్తను ఆ స్టేషన్‌లోని పెద్ద డస్ట్ బ్యాగ్‌లోకి ఖాళీ చేసుకుంటుంది. ఇందులోని 3.5 లీటర్ల డస్ట్ బ్యాగ్ సుమారు రెండు నెలల పాటు ఎలాంటి చేతి పని లేకుండా చెత్తను స్టోర్ చేస్తుంది.

6500Pa పవర్‌ఫుల్ సక్షన్:

Advertisement

ఇంటి మూలల్లో ఉండే దుమ్ము, ధూళి, జుట్టు, లేదా పిల్లలు కింద పడే సిన చిరు తిళ్ల అవశేషాలను పూర్తిగా పీల్చుకోవడానికి ఇందులో ..6500Pa పవర్ ఫుల్ సక్షన్ పవర్ ఇచ్చారు. ఇది టైల్స్, వుడెన్ ఫ్లోరింగ్, కార్పెట్లపై అద్భుతంగా పని చేస్తుంది. ముఖ్యంగా కార్పెట్లను గుర్తించినప్పుడు ఆటో మేటిక్‌గా సక్షన్ పవర్‌ను పెంచుకునే స్మార్ట్ టెక్నాలజీ ఇందులో ఉంది. దీని వల్ల కార్పెట్లలో లోపలికి ఇంకిపోయిన దుమ్ము కూడా పూర్తిగా క్లీన్ అవుతుంది.

అడ్వాన్స్‌డ్ LDS నావిగేషన్, మ్యాపింగ్:

పాత రోబోట్లలా ఇది వస్తువులకు, గోడలకు తగులుతూ తిరగదు. లేటెస్ట్ నావిగేషన్ సిస్టమ్ సహాయంతో ఇది మీ ఇల్లు మొత్తాన్ని నిమిషాల్లో స్కాన్ చేసి పర్ఫెక్ట్ డిజిటల్ మ్యాప్‌ను తయారు చేసుకుంటుంది. చీకటి పడిన తర్వాత కూడా ఇది ఏ వస్తువుకు తగలకుండా తన రూట్‌ను తానే కరెక్ట్ చేసుకుని తిరుగుతుంది. మొబైల్ యాప్ ద్వారా మనం ‘నో-గో జోన్స్’సెట్ చేసుకోవచ్చు. అంటే రోబోట్ ఆ ప్రదేశానికి వెళ్లకుండా కంట్రోల్ కూడా చేయెచ్చు.

వాక్యూమింగ్, మాపింగ్ (2-in-1 క్లీనింగ్):

Advertisement

దుమ్మును పీల్చడమే కాకుండా.. నేల తడి తుడిచే ఫీచర్ కూడా ఇందులో ఉంది. ‘Y-షేప్’ ఇంటెలిజెంట్ మాపింగ్ విధానం ద్వారా నేలపై ఉన్న మొండి మరకలను కూడా చాలా ఈజీగా తొలగిస్తుంది. ఇందులో ఉన్న 200ml వాటర్ ట్యాంక్ నీటిని సమానంగా విడుదల చేస్తుంది. అలాగే 5200mAh పెద్ద బ్యాటరీ కారణంగా ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. సుమారు 260 నిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా పని చేస్తుంది. బ్యాటరీ తక్కువైనప్పుడు అదే స్వయంగా ఛార్జింగ్ డాక్ దగ్గరకు వెళ్తుంది.

Also Read: 56% డిస్కౌంట్‌తో ఏసర్ ఆస్పైర్ ల్యాప్‌టాప్..ఫీచర్లు చూస్తే ఫిదా అయిపోతారు!

స్మార్ట్ యాప్,వాయిస్ కంట్రోల్:

ఈ రోబోట్ క్లీనర్‌ను ఆపరేట్ చేయడం చాలా ఈజీ. స్మార్ట్‌ ఫోన్‌లోని ILIFE యాప్ ద్వారా ఆఫీసులో ఉండి కూడా మీ ఇంటి క్లీనింగ్ స్టేటస్‌ను చెక్ చేయెచ్చు. అంతే కాదు, అలెక్సా లేదా గూగుల్ అసిస్టెంట్ సాయంతో వాయిస్ కమాండ్స్ ఇచ్చి కూడా దీన్ని ఆపరేట్ చేయెచ్చు. మల్టీ-ఫ్లోర్ మ్యాపింగ్ సపోర్ట్ ఉండటం వల్ల డ్యూప్లెక్స్ ఇళ్లకు ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

మార్కెట్లో లభించే ఖరీదైన రోబోట్ వాక్యూమ్స్‌తో పోలిస్తే.. కేవలం రూ.24,890 ధరలో ఇన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు అందించడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇంటి పనులను ఈజీ చేసుకుంటూ, మీ విలువైన టైం ఆదా చేసుకోవడానికి ఈ మోడల్ ఒక అద్భుతమైన ఛాయిస్. మీరు కూడా మీ ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా, మెరిసి పోవాలని కోరుకుంటే.. ఈ స్మార్ట్ గాడ్జెట్‌ను మీ ఇంట్లో భాగంగా చేసుకోండి!

Related News

ఇదేం విడ్డూరం యాపిల్ మామా.. వాడిన కొన్ని గంటల్లోనే iPhone Duo స్క్రీన్ ఢమాల్!

Airtel బంపరాఫర్.. రూ. 200 కే 30GB డేటా, ఫ్రీ యూట్యూబ్ ప్రీమియం.. 20పైగా ఓటీటీలు!

క్యాబ్ బుక్ చేసేటప్పుడు లొకేషన్ తప్పుగా చూపిస్తోందా? ఈ ఒక్క సెట్టింగ్ మార్చితే సరి!

56% డిస్కౌంట్‌తో ఏసర్ ఆస్పైర్ ల్యాప్‌టాప్..ఫీచర్లు చూస్తే ఫిదా అయిపోతారు!

ఇండియాలోనే డిజైన్, ఇండియాలోనే తయారీ.. 2028 నాటికి రాబోతున్న మన సొంత ఫోన్లు!

తగ్గేదే లే అంటున్న boAt కొత్త ఇయర్‌బడ్స్..రూ.1299కే కిరాక్ ఫీచర్లు!

ట్రెండింగ్ డిజైన్‌తో వస్తున్న OnePlus Buds Clip.. ఫీచర్లు చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే!

Big Stories

Advertisement
×