SI Priyanka: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఎస్‌ఐ ప్రియాంకపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వైసీపీ పార్టీకి చెందిన మాజీ మంత్రి విడదల రజినిపై పోలీస్ అధికారి దురుసు ప్రవర్తనపై విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. మాజీ మంత్రి రజినిని ఇంటి వద్ద ఎస్‌ఐ కిందకు తోసేశారంటూ మీడియాలో కథనాలు వెవువడ్డాయి.
దీంతో ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, కాలపరిమితితో విచారణ చేపట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేసారు. దీంతో పాటుగా ఎస్‌ఐ ప్రియాంకను ఎన్నికల విధులతో పాటు సాధారణ విధుల నుంచి తక్షణమే తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా కథనాలు, వీడియో ఫుటేజీ పరిశీలించి బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి రజినీతో సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు నమోదు చేయాలని పల్నాడు ఎస్పీకి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం నేడు అక్టోబర్ 24 సాయంత్రం 7 గంటల్లోగా రిలీవింగ్ నివేదిక సమర్పించాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. నవంబర్ 5లోగా క్రమశిక్షణా చర్యల నివేదిక అందించాలని అధికారుల స్పష్టం చేశారు. పోలీసు అధికారుల వ్యవహారశైలిపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ సంఘటనపై సీరియస్ అయింది.
Alsi Read: తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్?