E-Paper
Advertisement

అబ్బాయిల్ని అర్థం చేసుకోవాలంటే ఈ మూవీని మిస్ అవ్వకూడదు… కొత్త మలయాళం సినిమా గురూ

అబ్బాయిల్ని అర్థం చేసుకోవాలంటే ఈ మూవీని మిస్ అవ్వకూడదు… కొత్త మలయాళం సినిమా గురూ
Advertisement

Malayalam Movie OTT: మనిషి జీవితం చిన్నప్పటి నుంచి ముసలితనం వరకు ఎన్నో మార్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. చిన్నప్పుడు ప్రపంచం మొత్తం మన చుట్టూనే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. సరదాగా, హాయిగా సాగిపోతుంది. యుక్తవయసులో కలలు, ప్రేమ, స్నేహాలు ప్రపంచంలా కనిపిస్తాయి. కుటుంబ బాధ్యతలు మీద పడిన తర్వాత మాత్రం ఆలోచనలు మారిపోతాయి. ఒకప్పుడు చిన్న విషయంగా అనిపించిన సంఘటనే, కొన్నేళ్ల తర్వాత జీవితంలో పెద్ద పాఠంగా మిగిలిపోవచ్చు. ఇలా వయసుతో పాటు మనిషిలో వచ్చే మార్పులను, జీవితంలోని అనుభవాలను తెరపై చూపించే మలయాళ సినిమానే ‘ఆరు ఆనంగళ్’ (Aaru Aanugal). టైటిల్ చూస్తే ఆరుగురు మగాళ్లకు సంబంధించిన ఆరు వేర్వేరు కథలేమో అనిపిస్తుంది. కానీ ఈ ఇందులోని అసలు కాన్సెప్ట్‌ ఒక వ్యక్తి బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు సాగించే జీవిత ప్రయాణం. మరి ఇంతకీ ఈ మలయాళం సినిమా స్ట్రీమింగ్ ఎక్కడ అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఒక వ్యక్తి జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే అతడు ప్రస్తుతం ఎలా ఉన్నాడో చూస్తే సరిపోదు. అతని బాల్యంలో ఎదురైన అనుభవాలు, యుక్తవయసులో ఏర్పడిన అభిప్రాయాలు, కుటుంబ బాధ్యతలు తీసుకున్న తర్వాత వచ్చిన మార్పులు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక దశలో తీసుకున్న నిర్ణయం మరో దశలో వేరే పరిణామానికి దారి తీయొచ్చు. ప్రేమలో ఉన్నప్పుడు ఒకలా ఆలోచించిన వ్యక్తి, కుటుంబాన్ని చూసుకోవాల్సి వచ్చినప్పుడు మరోలా మారవచ్చు. చిన్నప్పుడు సాధారణంగా కనిపించిన సంఘటన కూడా పెద్దయ్యాక అతని జీవితాన్ని ఎఫెక్ట్ చేయవచ్చు.

Advertisement

‘ఆరు ఆనంగళ్’లో ఇలాంటి మార్పులే ప్రధాన అంశంగా ఉంటాయి. వయసుతో పాటు మనిషి ఆలోచనలు ఎలా మారుతాయి, అతని చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధాలు ఎలా టర్న్ తీసుకుంటాయి ? పరిస్థితులు అతని వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుతాయి ? అనే విషయాలను కథలో చూపిస్తారు. మనిషి జీవితంలో సంతోషకరమైన క్షణాలు మాత్రమే కాదు, కొన్ని అనుభవాలు బాధను మిగిల్చినా, అవే భవిష్యత్తులో అతడికి పాఠాలుగా మారుతాయి. కొన్ని బంధాలు కాలంతో బలపడితే, మరికొన్ని దూరమవుతాయి. ఈ సినిమాను చూస్తే జీవితం అంతా కళ్ళ ముందు జీవితం అంతా కదలాడుతుంది.

ఓటీటీలో తెలుగులో ఉందా ?

‘ఆరు ఆనంగళ్’ అక్టోబర్ 23 నుంచి మనోరమ మాక్స్ (Manorama MAX)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది మలయాళ సినిమా. తెలుగు డబ్బింగ్ ఆడియో అందుబాటులో లేదు. కాబట్టి తెలుగులో చూడాలంటే కష్టమే. దర్శకుడు సాంబ్రాజ్ రూపొందించిన ఈ చిత్రంలో శివమురళి బాలసుబ్రమణ్యన్, దీప, జిని ఎలక్కాట్ నటించారు. జీవితంలోని వివిధ దశలను చూపించే కథ కావడంతో, ఇందులోని సంఘటనలను కేవలం ఒక వ్యక్తి అనుభవాలుగా కాకుండా మన చుట్టూ కనిపించే జీవితాలతో పోల్చుకోవచ్చు. ఓ అబ్బాయి లైఫ్ సైకిల్ ను, ఆయా సమయాల్లో వాళ్ళలో కనిపించే మార్పులను, మెచ్యూరిటీని తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమాను డోంట్ మిస్.

Advertisement

Read Also: 36 ఏళ్ల బ్యాచిలర్‌ కు చెప్పుకోలేని కష్టాలు… పెళ్లయినా శోభనం మాత్రం జరగదు… మలయాళ టైమ్‌ లూప్‌ కామెడీ తెలుగులో

Related News

గాయపడిన అమ్మాయిని కాపాడి దేశాన్ని కుదిపేసే కుట్రలో బలయ్యే పోలీస్… తెలుగులోనూ స్ట్రీమింగ్‌

కూతురు ప్రేమలో పడితే తండ్రికి టెన్షన్‌… ఆమె లవ్‌ లైఫ్‌ పాడు చేయడానికి సీక్రెట్‌ ప్లాన్లు… భలే కామెడీ భయ్యా

పారిపోయిన హీరోపై హత్యా నేరం… చనిపోయాడనుకున్న వాడు తిరిగొస్తే… శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే రివేంజ్

జైల్లో ఉన్నా దొంగతనాలు ఆగవు… లూపిన్‌ కొత్త గేమ్‌ చూస్తే మైండ్‌ బ్లాక్‌

ఇప్పటికే 6 సీజన్లు… 30కి పైగా ఎపిసోడ్లు… ఓటీటీని ఊపేస్తున్న హనుమాన్ కొత్త సీజన్ వచ్చేసిందోచ్

అత్త చనిపోయాక వెన్నులో వణుకు పుట్టించే సీన్స్… ఓటీటీని షేక్ చేసిన సిరీస్ సీజన్ 2 స్ట్రీమింగ్ షురూ

పోలీసులు జైల్లోనే కొట్టి చంపేస్తే… సీజన్‌ 2తో వచ్చేసిన క్రేజీ క్రైమ్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×