E-Paper
Advertisement

Incognito Mode: ఇన్‌కాగ్నిటో మోడ్‌ చాలా సేఫ్, ఎవరూ కనిపెట్టలేరని అనుకుంటున్నారా? వాస్తవం ఇదీ!

Incognito Mode: ఇన్‌కాగ్నిటో మోడ్‌ చాలా సేఫ్, ఎవరూ కనిపెట్టలేరని అనుకుంటున్నారా? వాస్తవం ఇదీ!
Advertisement

Incognito Mode: ఇంటర్నెట్ మన రోజువారీ జీవితంలో కీలక భాగంగా మారింది. వార్తలు, బ్యాంకింగ్, వినోదం వంటి ఎన్నో పనులు ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. బ్రౌజ్ చేసే ప్రతిసారి మన వెనుక ఒక డిజిటల్ గుర్తు మిగులుతుందనే విషయం చాలామందికి తెలియదు. ఇంకాగ్నిటో మోడ్ ఆన్ చేస్తే పూర్తిగా కనిపించమనే నమ్మకం ఉన్నా, అది కేవలం అపోహ మాత్రమే. ఇది మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో బ్రౌజింగ్ హిస్టరీ సేవ్ కాకుండా చేసే చిన్న ఫీచర్ మాత్రమే. దాని వెనుక ఉన్న నిజం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకాగ్నిటో మోడ్ అంటే అసలు ఏమిటి

Advertisement

ఇంకాగ్నిటో మోడ్ ఓపెన్ చేసినప్పుడు మీ బ్రౌజర్ ఒక పని మాత్రమే చేస్తుంది. మీరు ఓపెన్ చేసిన వెబ్‌సైట్లు, సెర్చ్ చేసిన విషయాలు, లాగిన్ డేటా లాంటి వాటిని మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో సేవ్ చేయదు. బ్రౌజర్ క్లోజ్ చేసిన వెంటనే ఆ సమాచారం అక్కడితో ముగుస్తుంది. అంతే తప్ప ఇంకాగ్నిటో మోడ్ ఇంటర్నెట్‌కు మీరు కనిపించకుండా చేసే టెక్నాలజీ కాదు.

ఇంకాగ్నిటో మోడ్ ఏమి చేయదు

Advertisement

చాలా మంది అనుకుంటారు ఇంకాగ్నిటో మోడ్‌లో బ్రౌజ్ చేస్తే ఎవరికీ మనం కనిపించమని. ఇది పూర్తిగా తప్పు. మీరు ఓపెన్ చేసిన ప్రతి వెబ్‌సైట్‌కు మీ కనెక్షన్ నేరుగా వెళ్తుంది. ఆ వెబ్‌సైట్‌కు మీరు ఎవరో, ఎక్కడినుంచి వచ్చారో, ఎంతసేపు ఉన్నారో అన్న వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంకాగ్నిటో మోడ్ ఈ సమాచారాన్ని ఏ మాత్రం దాచదు.

మీ ఇంటర్నెట్ ప్రొవైడర్ ఏమి చూస్తాడు

మీరు ఉపయోగిస్తున్న ఇంటర్నెట్ కనెక్షన్ ఎవరిదైనా కావచ్చు. అది Jio అయినా, Airtel అయినా, ఇంకేదైనా నెట్‌వర్క్ అయినా సరే. మీరు ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేశారో, ఏ టైమ్‌లో ఓపెన్ చేశారో, ఎంతసేపు యాక్టివ్‌గా ఉన్నారో అన్న వివరాలు వాళ్లకు తెలుస్తాయి. ఇంకాగ్నిటో మోడ్ దీనిని ఆపలేదు. ఎందుకంటే మీ డేటా వాళ్ల నెట్‌వర్క్ గుండా వెళ్లాల్సిందే.

వెబ్‌సైట్లు మీ గురించి ఏమి తెలుసుకుంటాయి

మీరు ఓపెన్ చేసిన ప్రతి వెబ్‌సైట్ మీ ఐపీ అడ్రస్‌ని చూసే ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ ద్వారా మీ లొకేషన్ అంచనా వేయగలరు. మీరు ఏ డివైస్ వాడుతున్నారో, ఏ బ్రౌజర్ వాడుతున్నారో కూడా తెలుస్తుంది. ఇంకాగ్నిటో మోడ్‌లో ఉన్నా కూడా ఈ సమాచారం వెబ్‌సైట్‌కు చేరుతుంది. కాబట్టి వెబ్‌సైట్ స్థాయిలో మీరు అసలు కనిపించకుండా ఉండే అవకాశం లేదు.

Also Read: OnePlus New Smartphone: 9,000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. చార్జింగ్ టెన్షన్‌కు ఇక చెక్

వైఫై రౌటర్ అడ్మిన్ ఏమి చూడగలడు

మీరు ఇంట్లో ఉన్న వైఫై లేదా ఆఫీస్ వైఫై వాడుతున్నప్పుడు ఇంకొక నిజం గుర్తు పెట్టుకోవాలి. ఆ వైఫైకి ఎవరు అడ్మిన్‌గా ఉన్నారో వాళ్లకు మీరు ఏ వెబ్‌సైట్లు యాక్సెస్ చేశారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంకాగ్నిటో మోడ్ ఇక్కడ కూడా పనికిరాదు. ఎందుకంటే వైఫై రౌటర్ లెవెల్‌లో ట్రాఫిక్ మొత్తం రికార్డ్ అవుతుంది.

గూగుల్ పాత్ర ఏమిటి

మీరు గూగుల్ సెర్చ్ వాడితే ఇంకాగ్నిటో మోడ్‌లో ఉన్నా కూడా కొన్ని విషయాలు ట్రాక్ అవుతాయి. ముఖ్యంగా మీరు గూగుల్ అకౌంట్‌లో లాగిన్ అయ్యి ఉంటే మీ యాక్టివిటీకి ఇంకాగ్నిటో మోడ్ పెద్దగా అడ్డుకాదు. Googleకి మీరు ఏ టైమ్‌లో సెర్చ్ చేశారో, ఏ డివైస్ నుంచి వచ్చారో అన్న వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఇంకాగ్నిటో మోడ్ అసలు ఎందుకు ఉపయోగపడుతుంది

ఇంకాగ్నిటో మోడ్ ఉపయోగం పూర్తిగా లొకల్ లెవెల్ వరకే పరిమితం. మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను ఇంకొకరు ఉపయోగించినప్పుడు మీరు చూసిన సైట్లు వాళ్లకు కనిపించకుండా ఉండాలంటే ఇది ఉపయోగపడుతుంది. ఆటో లాగిన్ కాకుండా ఉండాలంటే, సెర్చ్ హిస్టరీ సేవ్ కాకుండా ఉండాలంటే ఇది సరిపోతుంది. అంతే తప్ప ఆన్‌లైన్ ప్రపంచంలో మీరు అదృశ్యమవ్వడానికి ఇది సరైన మార్గం కాదు.

ఇంటర్నెట్‌లో నిజంగా కనిపించకుండా ఉండాలంటే

ఇంటర్నెట్‌లో పూర్తిగా కనిపించకుండా ఉండటం చాలా కష్టం. సాధారణ ఇంకాగ్నిటో మోడ్‌తో అది అసలు సాధ్యం కాదు. భద్రతా స్థాయి ఎక్కువగా కావాలంటే ప్రత్యేక టెక్నాలజీలు అవసరం. అయినా కూడా పూర్తి గోప్యత అనే విషయం ఇంటర్నెట్‌లో చాలా వరకు భ్రమే అని చెప్పాలి. కాబట్టి ఇంకాగ్నిటో మోడ్‌ని ఇన్విజిబుల్ మోడ్‌లా భావించడం మానేసి, అది నిజంగా ఏం చేస్తుందో అర్థం చేసుకోవడమే మంచిది.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×