E-Paper
Advertisement

Google Bill Student: కాలేజీ విద్యార్థికి షాకిచ్చిన గూగుల్.. చిన్న అసైన్‌మెంట్‌కి రూ.1 లక్ష బిల్లు

Google Bill Student: కాలేజీ విద్యార్థికి షాకిచ్చిన గూగుల్.. చిన్న అసైన్‌మెంట్‌కి రూ.1 లక్ష బిల్లు
Advertisement

Google Cloud Bill Student| ఒక విద్యార్థికి తన కాలేజీ ప్రాజెక్ట్ పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. గిరీష్ నాయక్‌ అనే కాలేజీ స్టూడెంట్‌కు గూగుల్ క్లౌడ్ దాదాపు రూ.1 లక్ష బిల్ చార్జ్ చేసింది. ఇప్పుడు చాలా మంది విద్యార్థులు ప్రాజెక్టుల కోసం క్లౌడ్ సర్వీసెస్ ఉపయోగిస్తున్నారు. ఈ ఘటన వైరల్ కావడంతో విద్యార్థు ఆందోళన చెందుతున్నారు.

ఇంత పెద్ద మొత్తంలో బిల్ ఎలా వచ్చింది?

గిరీష్ నాయక్ అనే విద్యార్థి రెడ్డిట్‌లో తన అనుభవాన్ని షేర్ చేశాడు. రెడ్డిట్ యూజర్ నేమ్ ConceptPretty7717 షేర్ చేసిన ఈ పోస్ట్‌లో వివరిస్తూ.. కాలేజీలో గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ అకౌంట్ తప్పనిసరిగా ఉపయోగించాలని నియమం ఉంది. ఆ అకౌంట్ కు బిల్లింగ్ మెథడ్ యాడ్ చేయాలని కాలేజీ సూచించింది. విద్యార్థులు ల్యాబ్ టాస్క్‌లు మాత్రమే పూర్తి చేశారు. అయినా గూగుల్ నుంచి భారీ బిల్ వచ్చింది.

రూ.98,940.76 బిల్ రావడంతో  ఆందోళనలో విద్యార్థి

Advertisement

గూగుల్ నుంచి గిరీష్‌కు డిమాండ్ ఈమెయిల్స్ వచ్చాయి. రూ.98,940.76 చెల్లించమని ఆ ఈమెయిల్స్ ద్వారా గూగుల్ డిమాండ్ చేసింది. అమెరికాకు చెందిన కలెక్షన్ ఏజెన్సీ కూడా గతంలోని పాస్ట్ డ్యూ నోటీసులు పంపింది. అవి చూసి విద్యార్థి తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.

సాయం చేయని కాలేజీ 

గిరీష్ కాలేజీ యజమాన్యాన్ని సంప్రదించాడు. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చివరకు రెడ్డిట్‌లో తనకు సాయం చేయాలని యూజర్లను కోరాడు. developersIndia సబ్‌రెడ్డిట్‌లో పూర్తి వివరాలు పోస్ట్ చేశాడు. బిల్ నిజమేనా? బిల్లింగ్ లో ఏమైనా తప్పు జరిగిందా? ఎలా పరిష్కరించాలో అడిగాడు.

రెడ్డిట్ కమ్యూనిటీ సలహాలు

Advertisement

చాలా మంది గూగుల్ సపోర్ట్‌ను సంప్రదించి మర్యాదగా ఆ బిల్లుని మాఫీ చేయించమని సలహా ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నవారు తమ అనుభవాలు షేర్ చేశారు. క్లౌడ్ కంపెనీలు విద్యార్థులకు లక్షల రూపాయల బిల్లు మాఫీ చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పారారు.

బిల్ రావడానికి కారణం?

చాలా మంది రెడ్డిట్‌లో ఇంత పెద్ద మొత్తం బిల్లు రావడానికి ఒకే కారణం చెప్పారు. క్లౌడ్ సేవలు ఉపయోగించేటప్పుడు ఒక సర్వీస్ ఆఫ్ చేయడం మర్చిపోయి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయి ఛార్జీలు పెరిగాయేమో అని అనుమానించారు. కొత్త యూజర్లు ఇలాంటి తప్పిదాలు చేయడం సాధారణమే అని చెప్పారు.

జాగ్రత్తలు

అందుకే క్లౌడ్ సర్వీస్ వినియోగించే సమయంలో స్పెండింగ్ లిమిట్ పెట్టుకోవాలి. యూసేజ్‌ను ఎప్పటికప్పుడు చూసుకోవాలి. పని అయిపోతే సర్వీస్ ఆఫ్ చేయాలి. బడ్జెట్ అలర్ట్స్ ఆన్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఇక భారీ బిల్లు రాదు.

ఈ ఘటనతో క్లౌడ్ ఛార్జీలు, గూగుల్ బిల్లింగ్ గురించి విద్యార్థులకు అవగాహన లేకపోవడం తెలుస్తోంది. కాలేజీలు మరింత మంచి గైడెన్స్ ఇవ్వాలి. సర్వీస్ టర్మ్స్ స్పష్టంగా చెప్పాలి.

హెచ్చరిక

గిరీష్ కథ ఇతరులకు పాఠం. క్లౌడ్ రిసోర్సెస్ ఉచితం కావు. అజాగ్రత్త క్లౌడ్ సర్వీస్‌ని వినియోగిస్తే.. భారీ బిల్లుకు దారి తీస్తుంది. అందుకే అవగాహనతో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

Also Read: ఆస్పత్రిలో రూ.1.6 కోటి బిల్లు చూసి షాకైన యువకుడు.. అసలు బిల్లు రూ.29 లక్షలే.. మోసం ఎలా కనిపెట్టాడంటే

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×