E-Paper
Advertisement

LPG Cylinder Booking: అర్రెర్రెరే.. చాట్ జీపీటీని దాటేసిన ఎల్పీజీ బుకింగ్ యాప్, దేశంలో ఏ జరుగుతోంది..?

LPG Cylinder Booking: అర్రెర్రెరే.. చాట్ జీపీటీని దాటేసిన ఎల్పీజీ బుకింగ్ యాప్, దేశంలో ఏ జరుగుతోంది..?

ఇప్పుడు దేశంలో ఏడ చూసిన ఒక్కటే ముచ్చట వంట గ్యాస్ కొరత.. నిజంగా దేశంలో వంట గ్యాస్ కొరత ఉందో..? లేదో..? తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వేరే లెవల్‌లో న్యూస్ వైరల్ అవుతోంది. ఎక్కడ చూసిన వంట గ్యాస్ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. వంట గ్యాస్ బుక్ చేసే నంబర్లు క్రాష్ అయ్యాయని.. ఇక దేశంలో వంట గ్యాస్ దొరకడం కష్టమే అని జనాలు ఎక్కువగా చర్చిస్తున్నారు. అయితే వంట గ్యాస్ కొరత వల్ల ఎల్పీసీ గ్యాస్ బుకింగ్ యాప్ ల సంఖ్య లక్షల్లో పెరుగుతోంది. వరల్డ్ ఫేమస్ యాప్ లను సైతం దాటేసి టాప్ లో నిలుస్తున్నాయి.

ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంటర్నేషనల్ వైడ్ వంట గ్యాస్ సరఫరాలో తలెత్తిన అడ్డంకుల కారణంగా దేశ ప్రజల్లో ఆందోళనలను పెంచాయి. ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ల బుకింగ్ కోసం ఉపయోగించే ‘ఇండియన్ ఆయిల్ వన్’ యాప్ డౌన్ లోడ్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. గత కొన్ని రోజులుగా గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు యాపిల్ యాప్ స్టోర్‌లోనూ ఇది అగ్రస్థానానికి చేరుకుందంటే జనాలు ఏ రేంజ్ ఎల్పీజీ గ్యాస్ బుకింగ్ యాప్ లను డౌన్లోడ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చివరకు వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన ఏఐ యాప్ ‘చాట్ జీపీటీ’ని కూడా వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. మార్చి 15 ఆదివారం ఉదయం నాటికి కూడా ఈ యాప్ టాప్ పొజిషన్‌లోకి వచ్చింది.

ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ మార్గంలో ఏర్పడిన ప్రతిష్టంబన వల్ల భారత్‌ దేశానికి చమురు, గ్యాస్ దిగుమతులకు కొంత సమస్య తలెత్తుతోంది. ఈ కారణంగానే ప్రజల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరాపై భయాలు మొదలయ్యాయి. గత వారం రోజులుగా దేశంలోని ప్రధాన నగరాల్లో ఎల్పీజీ పంపిణీ కేంద్రాల వద్ద భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా మనం వీడియోలు చూస్తున్నాం. వంటగ్యాస్ సరఫరా తగ్గడం వల్ల ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావంతో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు తమ మెనూలను కుదించుకున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా మూసివేతకు గురయ్యాయి. మరోవైపు గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా, నిల్వలు పెరగడం కూడా కలకలం రేపుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రజలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ వంట పరికరాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

పెట్రోలియం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. గతంలో రోజుకు సగటున 55.7 లక్షల ఎల్పీజీ బుకింగ్‌లు జరిగేవి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మార్చి 12 నాటికి ఈ సంఖ్య ఏకంగా 35 శాతం పెరిగి 75.7 లక్షలకు చేరింది. అంటే ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో బుకింగ్‌లు నమోదయ్యాయి. ఈ భయంకరమైన బుకింగ్ ల కారణంగా కొన్ని ఆన్‌లైన్ వ్యవస్థలు మొరాయిస్తున్నాయి. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో సాధారణం కంటే 40 శాతం అధికంగా బుకింగ్‌లు రావడంతో స్థానిక సర్వర్లు క్రాష్ అయ్యాయి. న్యూ ఆర్డర్లు తీసుకోవడం సిబ్బందికి ఇబ్బందిగా మారింది.

సెన్సార్ టవర్ డేటా ప్రకారం.. ‘ఇండియన్ ఆయిల్ వన్’ యాప్ గత 30 రోజుల్లోనే 40 లక్షలకు పైగా డౌన్‌లోడ్‌లను నమోదు చేసుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ విడుదల చేసిన ఇతర యాప్‌లతో పోలిస్తే ఇది అత్యధికం. ఈ యాప్ ద్వారా వినియోగదారులు ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. తమ సిలిండర్ ఎక్కడి వరకు వచ్చిందో కూడా ట్రాక్ చేయవచ్చు. కొత్త గ్యాస్ కనెక్షన్ పొందడం లేదంటే డిస్ట్రిబ్యూటర్‌ను మార్చుకోవడం వంటి పనులను కూడా సులభంగా పూర్తి చేయవచ్చు. గ్యాస్ సిలిండర్ల కోసం మాత్రమే కాకుండా దగ్గరలోని పెట్రోల్ బంకులను సెర్చ్ చేయడానికి కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది.

దేశవ్యాప్తంగా సుమారు 33.4 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా పైప్‌లైన్ ద్వారా గ్యాస్ పొందే పీఎన్‌జీ కనెక్షన్లు కేవలం 1.5 కోట్లు మాత్రమే ఉన్నాయి. సిలిండర్ల మీద ఆధారపడే జనాభా ఎక్కువగా ఉండటం వల్లే ప్రస్తుతం ఇంత పెద్ద సమస్య నెలకొంది. సరఫరా వ్యవస్థ పునరుద్ధరణపై స్పష్టత వచ్చే వరకు ఈ డిమాండ్ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

ALSO READ: LPG Saving Kitchen Tips: గ్యాస్ త్వరగా అయిపోతుందా? చాలా మంది కిచెన్‌లో చేసే 10 పొరపాట్లు ఇవే!

Related News

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

Big Stories

×