E-Paper
Advertisement

Poco X8 Pro Series: భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో Poco కొత్త ఫోన్లు.. ఫీచర్లు మామూలుగా లేవుగా!

Poco X8 Pro Series: భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో Poco కొత్త ఫోన్లు.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
Advertisement

Poco X8 Pro Series: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోకో బ్రాండ్‌కు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే ఫీచర్లతో తక్కువ ధరలో పవర్‌ఫుల్ ఫోన్లను తీసుకురావడంలో ఈ కంపెనీ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు అదే ఒరవడిని కొనసాగిస్తూ.. మార్చి 17న భారత మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోకి Poco X8 Pro, Poco X8 Pro Max అనే రెండు పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే వీటికి సంబంధించిన టీజర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆకట్టుకునేలా డిస్‌ప్లే..

Poco X8 Pro సిరీస్ ఫోన్లు చూడటానికి చాలా ప్రీమియంగా ఉండబోతున్నాయి. మెటల్ ఫ్రేమ్‌తో వస్తున్న ఈ ఫోన్లలో X8 ప్రో మోడల్ వైట్ కలర్‌లో, X8 ప్రో మాక్స్ మోడల్ బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉండనున్నాయి. డిస్‌ప్లే పరంగా చూసుకుంటే.. X8 ప్రో మోడల్ 6.59 అంగుళాల 1.5K అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. అదే సమయంలో ప్రో మాక్స్ వెర్షన్ మరింత పెద్దదిగా 6.83 అంగుళాల స్క్రీన్‌తో వస్తోంది. ఈ రెండింటిలోనూ 120Hz రీఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్, వీడియోలు చూసేటప్పుడు యూజర్లకు మెరుగైన అనుభూతి కలుగుతుంది.

Advertisement

Also Read: ప్రపంచవ్యాప్తంగా ప్రతి 4 ఐఫోన్లలో ఒకటి ‘మేడ్ ఇన్ ఇండియా’.. మార్కెట్లో 25% వాటా మనదే!

50 మెగాపిక్సల్ కెమెరా..

పర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకుండా పోకో ఈసారి మీడియాటెక్ చిప్‌సెట్లను ఎంచుకుంది. ప్రో మోడల్‌లో డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌ను, ప్రో మాక్స్ మోడల్‌లో మరింత శక్తివంతమైన డైమెన్సిటీ 9500s చిప్‌సెట్‌ను వాడుతున్నారు. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఈ రెండు ఫోన్లలోనూ వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండటం వల్ల ఫొటోలు చాలా స్పష్టంగా వస్తాయి. ఇకపోతే సెల్ఫీల కోసం 20MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు.

ఛార్జింగ్ టెన్షన్ ఉండదు..

Advertisement

ఈ సిరీస్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం. Poco X8 Pro Max ఏకంగా 9000mAh భారీ బ్యాటరీతో రాబోతోంది. సాధారణంగా ఫోన్లలో ఉండే బ్యాటరీల కంటే ఇది చాలా పెద్దది. ఇక Pro మోడల్‌లో గ్లోబల్ వేరియంట్ కోసం 6500mAh బ్యాటరీని, ఇండియన్ వేరియంట్ కోసం 7560mAh బ్యాటరీని కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ భారీ బ్యాటరీలను వేగంగా ఛార్జ్ చేయడానికి 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. వీటికి తోడుగా ధూళి, నీటి నుండి రక్షణ కోసం IP68, IP69K రేటింగ్స్ కూడా ఉన్నాయి.

Also Read: ఐఫోన్ 18 ప్రో వచ్చేస్తోంది మావా.. ఏఐ ఫీచర్లు, ధర, లాంచ్ డేట్ వివరాలు ఇవిగో!

Related News

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

Big Stories

Advertisement
×