E-Paper
Advertisement

India vs North Korea Railways: నార్త్ కొరియాలో రైళ్ల స్పీడ్ మరీ అంత తక్కువా? వాటిలోనూ జనాలు వెళ్లరా?

India vs North Korea Railways: నార్త్ కొరియాలో రైళ్ల స్పీడ్ మరీ అంత తక్కువా? వాటిలోనూ జనాలు వెళ్లరా?
Advertisement

Indian Railways vs North Korea Trains: ఇండియన్ రైల్వే గత దశాబ్ద కాలంగా అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది. రైల్వే మౌలిక సదుపాయాలు, రైళ్ల వేగం, రైళ్లలో ప్రయాణీకులకు కల్పించే సౌకర్యాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. భారతీయ రైల్వే దేశ రవాణాకు జీవనాడిగా కొనసాగుతోంది. అదే సమయంలో ఉత్తర కొరియా రైళ్లు చాలా తక్కువగా ఉంటాయి. తక్కువ వేగంతో వెళ్తాయి. రైళ్లు ఆయుధాలతో లోడ్ చేయబడి ఉంటాయి. భారత్ ఆధునిక రైళ్లను నడుపుతుండగా, ఉత్తర కొరియా పాత, నెమ్మదిగా వెళ్లే రైలు సదాపాయాల మీద ఆధారపడుతుంది.

భారతీయ, ఉత్తర కొరియా రైళ్ల మధ్య కీలక తేడాలు

⦿ మౌలిక సదుపాయాలు, వేగం: ఉత్తర కొరియా రైళ్లకు సంబంధించి మౌలిక సదుపాయాలు పాతవి. చాలా రైళ్లు నెమ్మదిగా ప్రయాణిస్తాయి. గంటకు 20–60 కి.మీ మధ్య వేగంతో వెళ్తాయి. భారత్ లో నెమ్మదిగా, వేగంగా ప్రయాణించే రైళ్లు ఉన్నాయి. వందేభారత్ లాంటి రైళ్లు గంటకు 100–160 కి.మీ వేగంతో నడుస్తాయి.

Advertisement

⦿ భద్రత: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్  మూవింగ్ ఫోర్టెస్ అనే రైలును తన ప్రయాణాలకు ఉపయోగిస్తాడు. ఇది మిసైల్ దాడులను సైతం తట్టుకుంటుంది. ఈ రైలు ప్రత్యేక రక్షణతో నిర్మించబడింది. ఇందులో భద్రత, వైద్య సిబ్బంది వెళ్తారు. కమి భద్రత కోసం మూడు రైళ్లు ఉంటాయి. వాటిలో ఒకటి ముందుగా వెళ్తుంది. రెండో రైల్లో కిమ్ ఉంటాడు. మూడో రైల్లో భద్రతా అధికారులు ఉంటారు. భారతీయ ప్యాసింజర్ రైళ్లలో ప్రామాణిక భద్రతా చర్యలు ఉంటాయి. కానీ, ఈ విధంగా ఆయుధాలతో కూడిన రైళ్లు ఉండవు.

⦿ లగ్జరీ, సౌకర్యాలు: ఉత్తర కొరియా అధినేత రైలులో తెల్లటి లెదర్ కుర్చీలు, మీటింగ్ రూమ్స్, హైటెక్ కమ్యూనికేషన్, బెడ్‌ రూమ్‌ లతో కూడిన ప్రత్యేకమైన, విలాసవంతమైన క్యారేజీలు ఉన్నాయి. భారతీయ రైళ్లు ప్రాథమిక జనరల్ కంపార్ట్‌ మెంట్ల నుంచి హై క్లాస్ ఎయిర్ కండిషన్డ్ కోచ్ లున్నాయి. కొన్ని ప్రైవేట్ రైళ్లలో లగ్జరీ సదుపాయాలు ఉంటాయి.

Advertisement

⦿ ఉద్దేశ్యం, ఆపరేషన్స్: ఉత్తర కొరియా రైలు వ్యవస్థ పేరు కొరియన్ స్టేట్ రైల్వే. దీనిని ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇది ప్రధానంగా పాత రైల్వే విధానాన్ని అనుసరిస్తుంది. భారతీయ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌ వర్క్‌ లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. విస్తృత శ్రేణి సేవలతో ప్రతిరోజూ లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతుంది.

⦿ రైల్వే సామర్థ్యం: భారతీయ రైళ్లు రద్దీగా ఉంటాయి. మిలియన్ల కొద్ది ప్రయాణీకులు రోజువారీ ప్రయాణాలు చేస్తారు. ఉత్తర కొరియా రైళ్లు చిన్నగా ఉంటాయి. ఉన్నత వర్గాలను,  సిబ్బందిని ఏకాంతంగా తీసుకెళ్లడానికి రూపొందించబడ్డాయి.

ఉత్తర కొరియా నాయకత్వం నెమ్మదిగా వెళ్లే, అత్యంత సురక్షితమైన, ప్రైవేట్ సాయుధ రైళ్లపై ఆధారపడుతుంది. భారతదేశం భారీ, ప్రజా ప్రయోజనకరమైన, పెరుగుతున్న ఆధునీకరణ చెందిన రైల్వే వ్యవస్థను మెయింటెయిన్ చేస్తుంది.

Read Also: ఇండియన్ రైల్వేపై LPG ఎఫెక్ట్, క్యాటరింగ్ సేవలు బంద్?

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×