E-Paper
Advertisement

నగరంలో బాంబ్ డిఫ్యూజన్ హడావుడి… అదిరిపోయే హై-వోల్టేజ్ హీస్ట్ థ్రిల్లర్

నగరంలో బాంబ్ డిఫ్యూజన్ హడావుడి… అదిరిపోయే హై-వోల్టేజ్ హీస్ట్ థ్రిల్లర్
Advertisement

British Action Thriller: మహానగరంలో బాంబు బయట పడటంతో సిటీ మొత్తం ఖాళీ చేయాల్సి వస్తే ? పోలీసులు, మిలిటరీ ఆ బాంబును నిర్వీర్యం చేయడంలో బిజీగా ఉంటే… ఇదే అదనుగా ఓ దొంగల ముఠా భారీ బ్యాంక్ దోపిడీకి స్కెచ్ వేస్తే ? ఒకవైపు వేల మంది ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత… మరోవైపు కోట్ల రూపాయల కోసం జరిగే హై-వోల్టేజ్ హీస్ట్. ఈ రెండూ ఒకేసారి ఢీకొంటే ఎలా ఉంటుంది ? అదే ‘ఫ్యూజ్’ (Fuze – 2026) మూవీ స్టోరీ. మరి ఆ దొంగతనం ఎలా జరిగింది ? అనేది తెలుసుకోవాలంటే ముందుగా కథలోకి వెళ్దాం పదండి.

కథలోకి వెళ్తే…

లండన్ నగరంలో ఓ రోజు కథ అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. ఓ బిజీ కన్స్ట్రక్షన్ సైట్‌ లో తవ్వకాలు జరుగుతుండగా… రెండో ప్రపంచ యుద్ధం నాటి ఓ భారీ పేలని బాంబు బయట పడుతుంది. అది సాధారణ బాంబు కాదని, ప్రమాదం జరిగితే భారీ స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు గుర్తిస్తారు. దీంతో పోలీసులు, బ్రిటిష్ ఆర్మీ రంగంలోకి దిగుతారు. బాంబు చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయిస్తారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. క్రమంగా లండన్‌ లోని ఆ ప్రాంతం మొత్తం ఖాళీ అవుతుంది. నగరంలో ఒక్కసారిగా ఎమర్జెన్సీ వాతావరణం ఏర్పడుతుంది.

Advertisement

కానీ అధికారులు బాంబుతో పోరాడుతున్న సమయంలో… మరోవైపు ఓ అండర్‌గ్రౌండ్ క్రిమినల్ గ్యాంగ్ ఈ పరిస్థితిని తమకు దొరికిన అరుదైన అవకాశంగా చూస్తుంది. జనాలతో కిక్కిరిసిపోయే లండన్ ఒక్కసారిగా ఖాళీ కావడం… తమ జీవితంలోనే అతిపెద్ద బ్యాంక్ దోపిడీకి సరైన సమయమని భావిస్తారు. జార్జ్ కరాలిస్ నేతృత్వంలోని గ్యాంగ్ భారీ హీస్ట్‌ కు సిద్ధమవుతుంది. సాధారణ పరిస్థితుల్లో అసాధ్యమైన బ్యాంక్ దోపిడీని… ఈ ఎమర్జెన్సీ సమయంలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తారు. కానీ తమకు అనుకున్నంత సులభంగా పరిస్థితులు ఉండవు.

మరోవైపు బాంబును నిర్వీర్యం చేసే బాధ్యతలో మేజర్ విల్ ట్రాంటర్ (Aaron Taylor-Johnson) ఉంటాడు. ఒకవైపు ప్రాణాంతకమైన బాంబు… మరోవైపు నగరం మధ్యలో జరుగుతున్న భారీ దోపిడీ. ఈ రెండు ఆపరేషన్లు ఒకదానితో ఒకటి ముడిపడటంతో అసలు టెన్షన్ మొదలవుతుంది. అంతలోనే దొంగల ముఠాలోనే నమ్మకద్రోహాలు మొదలవుతాయి. ప్లాన్‌ లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. అసలు ఆ బాంబు అక్కడికి ఎలా వచ్చింది ? దాని వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా ? చివరికి బాంబ్ డిస్పోజల్ టీమ్ గెలుస్తుందా… లేక దొంగల ముఠా తమ భారీ హీస్ట్‌ను పూర్తి చేస్తుందా ? అనే ప్రశ్నలతో క్లైమాక్స్ ఉత్కంఠగా సాగుతుంది.

స్ట్రీమింగ్ ఎక్కడ ?

Advertisement

‘ఫ్యూజ్’ మూవీకి ‘హెల్ ఆర్ హై వాటర్’ ఫేమ్ డేవిడ్ మెకెంజీ (David Mackenzie) దర్శకత్వం వహించారు. ఆరోన్ టేలర్-జాన్సన్, థియో జేమ్స్, సామ్ వర్తింగ్టన్, గుగు మ్బాత-రా, సఫ్రాన్ హాకింగ్ కీలక పాత్రల్లో నటించారు. అమెరికాలో ఈ సినిమా HBO Maxలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలో Amazon Prime Videoలో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం తెలుగు ఆడియో అందుబాటులో లేదు. ఇంగ్లీష్‌లోనే చూడాలి. హీస్ట్ సినిమాలతో పాటు యాక్షన్, క్రైమ్, సస్పెన్స్ కలిసిన కథలను చూడాలి అనుకునే వారికి ఈ సినిమా మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే అవకాశం ఉంది.

Read Also: ఒంటరి మనుషులే టార్గెట్… సైకో వదిలిన క్లూస్‌తో ఊపిరి బిగపట్టే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలుగులో

Related News

ప్రాణ స్నేహితుల మధ్య అగ్నిపర్వతంలా బద్దలయ్యే ఆవేశం… మనుషుల నైజానికి అద్దం పట్టే మైండ్ బెండింగ్ డ్రామా

చీకటి కోనలో చిత్రమైన రాక్షసి… క్షణం క్షణం వణికించే హర్రర్ మిస్టరీ

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..ఎక్కడ ?ఎప్పుడంటే?

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×