E-Paper
Advertisement

Infinix Note 60 Ultra: 200MP కెమెరా, శాటిలైట్ లేకున్నా కాలింగ్, 7000mAh బ్యాటరీ.. ఇన్‌ఫినిక్స్ సూపర్ ఫోన్ లాంచ్

Infinix Note 60 Ultra: 200MP కెమెరా, శాటిలైట్ లేకున్నా కాలింగ్, 7000mAh బ్యాటరీ.. ఇన్‌ఫినిక్స్ సూపర్ ఫోన్ లాంచ్
Advertisement

Infinix Note 60 Ultra: ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ తన పాపులర్ నోట్ సిరీస్‌లో కొత్త ఫ్లాగ్‌షిప్ ఇన్‌ఫినిక్స్ నోట్ 60 అల్ట్రాని లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌ ఫోన్స్‌లో ఉండే అనేక అద్భుత ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా 200MP కెమెరా, పెద్ద 7000mAh బ్యాటరీ, శాటిలైట్ కాలింగ్ ఫీచర్స్ ఈ ఫోన్ లో ప్రధాన ఆకర్షణ.

ప్రీమియం డిజైన్, కలర్ వేరియంట్స్

ఈ ఫోన్ చాలా స్టైలిష్‌గా, ప్రీమియం లుక్‌తో డిజైన్ చేశారు. ఇటాలియన్ డిజైన్ కంపెనీ ఇనిన్‌ఫరీనాతో (Pininfarina) కలిసి ఇన్‌ఫినిక్స్ ఈ ఫోన్ డిజైన్ చేసింది. అల్యూమినియం యూనిబాడీతో బలంగా, మంచి ఫీల్ ఇస్తుంది. వెనక భాగంలో ఫ్లాట్ కెమెరా మాడ్యూల్ ఉంది. గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో స్క్రాచ్‌ల నుంచి రక్షణ ఇస్తుంది. వెనక భాగంలో ఉన్న చిన్న డిస్‌ప్లే, నోటిఫికేషన్ లైట్ ఉన్నాయి. ఇవి మెయిన్ స్క్రీన్ ఓపెన్ చేయకుండానే అలర్ట్స్ చూపిస్తాయి. నోట్ 60 అల్ట్రా నాలుగు కలర్ వేరియంట్స్‌లో.. (టోరినో బ్లాక్, మోంజా రెడ్, అమాల్ఫీ బ్లూ, రోమా సిల్వర్) వస్తుంది.

కెమెరా సిస్టమ్, ఫోటోగ్రఫీ ఫీచర్లు

Advertisement

ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 200MP శాంసంగ్ ISOCELL HPE సెన్సార్‌తో వస్తుంది. ఇది చాలా షార్ప్, డీటెయిల్డ్ ఫోటోలు తీస్తుంది. 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంది, 3.5x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. అల్ట్రా-వైడ్ కెమెరా 112 డిగ్రీ వ్యూ ఇస్తుంది. XDR ఇమేజ్ ఇంజిన్, అల్ట్రా HDRతో మంచి కలర్స్, బ్రైట్‌నెస్ వస్తాయి. సెల్ఫీలకు హై-రెసల్యూషన్ ఫ్రంట్ కెమెరా ఉంది.

డిస్‌ప్లే, పెర్ఫామెన్స్

నోట్ 60 అల్ట్రాలో 6.78 ఇంచ్ AMOLED డిస్‌ప్లే ఉంది. 1.5K రెసల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్‌గా స్క్రోలింగ్, గేమింగ్ జరుగుతాయి. పీక్ బ్రైట్‌నెస్ 4500 నిట్స్ వరకు ఉంది, బయట ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉన్నాయి.

బ్యాటరీ, ఛార్జింగ్, సాఫ్ట్‌వేర్

Advertisement

ఈ కొత్త ఫ్లాగ్‌షిప్‌లో 7000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని ఉపయోగించారు. ఎక్కువ సమయం ఉపయోగించవచ్చు. 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 48 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుందని కంపెనీ చెప్పింది. ఆండ్రాయిడ్ 16 బేస్డ్ XOS 16 సాఫ్ట్‌వేర్ ఉంది. ఇందులోని AI ఫీచర్లు ఫైల్స్ మేనేజ్‌మెంట్, హెల్త్ మానిటరింగ్‌కు బాగా సాయపడతాయి.

Also Read: వాట్సాప్‌లో యాడ్స్‌తొ విసిగిపోతున్నారా? ఇలా బ్లాక్ చేయండి

శాటిలైట్ కనెక్టివిటీ, ఆడియో

ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో డ్యూయల్-వే శాటిలైట్ కమ్యూనికేషన్ ఉంది. మొబైల్ నెట్‌వర్క్ లేని చోట్ల మెసేజ్‌లు పంపవచ్చు, లొకేషన్ షేర్ చేయవచ్చు. గ్రామీణ, నిర్మానుష ప్రాంతాల్లో భద్రత కోసం ఉపయోగపడుతుంది. JBL ట్యూన్డ్ స్టీరియో స్పీకర్లు మంచి సౌండ్ ఇస్తాయి.

ధర, లభ్యత

మలేషియాలో ముందుగా ఈ ఫోన్ లాంచ్ అయింది. అక్కడ ధర 3000 MYR (భారత కరెన్సీలో దాదాపు రూ.70,000). త్వరలో ఇతర దేశాల్లో కూడా వస్తుంది.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×