E-Paper
Advertisement

ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‌పై.. స్లో కుకింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి!

ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‌పై.. స్లో కుకింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి!
Advertisement

Infrared Cooktop: గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రస్తుతం చాలా మంది ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్‌లు కొనుగోలు చేసి వాటి మీదనే వంట చేస్తున్నారు. అయితే సాంప్రదాయ స్టవ్‌లతో పోలిస్తే.. ఇన్ ఫ్రారెడ్ కుక్ టాప్స్ చాలా భిన్నంగా పనిచేస్తాయి. వీటిలో వేడి.. గ్లాస్ ప్యానెల్ ద్వారా పాత్రకు అందుతుంది. కాబట్టి ఈ కుక్ టాప్ పై స్లో కుకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. స్లో కుకింగ్ లో బెస్ట్ రిజల్ట్స్ పొందేందుకు కొన్ని చిట్కాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. అవేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

మందపాటి పాత్రలు..

స్లోకింగ్ కోసం అడుగు భాగం మందంగా ఉండే స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలను ఎంచుకోండి. ఇవి గిన్నెలోని ఆహారపదార్థాలకు సమానంగా వేడిని పంపిణీ చేస్తాయి. పాత్ర అడుగు భాగం మందంగా ఉండటం వల్ల అడుగు అంటే సమస్య ఉండదు.

హీట్ సెట్టింగ్స్

Advertisement

వంట ప్రారంభంలో మీడియం హీట్ వాడి మసాలాలు, కూరగాయలు బాగా వేగనివ్వాలి. ఇందుకోసం హీట్ సెట్టింగ్‌ను Lowకి తగ్గించండి. ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‌లు వేడిని స్థిరంగా ఉంచుతాయి కాబట్టి తక్కువ మంట మీద వంట రుచిగా ఉంటుంది.

గరిటతో కలపడం

ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‌లు గ్యాస్ స్టవ్‌ల మాదిరిగానే పనిచేస్తాయి. కాబట్టి మధ్యమధ్యలో వంటకాన్ని కలుపుతూ ఉండాలి. దీనివల్ల వేడి అన్ని వైపులా సమానంగా అంది వంట చాలా రుచిగా వస్తుంది.

మూత వాడటం

Advertisement

స్లో కుకింగ్ చేసేటప్పుడు గట్టిగా మూత పెట్టడం చాలా ముఖ్యం. ఇది తేమను లోపలే ఉంచి కూరగాయలు, మాంసం మెత్తగా ఉడకడానికి సహాయపడుతుంది.

స్లో కుకింగ్ వంటకాలు

దాల్ మఖానీ

నానబెట్టిన పప్పును ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్‌పై low హీట్ మీద 1-2 గంటల పాటు ఉడకనివ్వండి. మందపాటి పాత్ర వాడటం వల్ల పప్పు అడుగు అంటకుండా వెన్నలా మెత్తగా ఉడుకుతుంది.

Also Read: ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్.. డిటాచబుల్ స్పీకర్లతో వచ్చిన.. పవర్‌ఫుల్ ప్రొజెక్టర్!

చికెన్ లేదా మటన్ కర్రీ

మాంసాన్ని తక్కువ మంట మీద (Low Heat) ఎక్కువ సేపు ఉడికించడం వల్ల మసాలాలు లోపలి వరకు వెళ్లి ముక్కలు జ్యుసీగా ఎంతో రుచిగా ఉంటాయి.

ముఖ్య గమనిక: ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్‌లు ఆరిపోయిన తర్వాత కూడా గ్లాస్ ప్యానెల్ చాలా సేపు వేడిగా ఉంటుంది. కాబట్టి వంట పూర్తయ్యాక స్విచ్ ఆఫ్ చేసినా ఆ మిగిలిన వేడితో వంట కాసేపు ఉడుకుతుంది.

Also Read: యాపిల్ బంపరాఫర్.. iPhone 17 Pro Maxపై.. ఏకంగా రూ.47,000 తగ్గింపు!

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×