E-Paper
Advertisement

Elinati Shani: పన్నెండు రాశుల్లో ఏ రాశిపై ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు పూర్తవుతుందో తెలుసా..?

Elinati Shani: పన్నెండు రాశుల్లో ఏ రాశిపై ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు పూర్తవుతుందో తెలుసా..?
Advertisement

Elinati Shani: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడానికి సుమారు రెండున్నర ఏళ్ల సమయం పడుతుంది. ఈ క్రమంలో రాశి చక్రంలోని 12 రాశుల వారికి వేర్వేరు సమయాల్లో ఏలినాటి శని, అర్ధాష్టమ మరియు అష్టమ శని ప్రభావాలు ఉంటాయట.

ఏలినాటి శని (Sade Sati): శని గ్రహం మీ జన్మ రాశికి ముందు రాశిలో, మీ రాశిలో, మరియు మీ రాశి తర్వాత రాశిలో సంచరించే కాలాన్ని  ఏలినాటి శని అంటారు. ఇది మొత్తం ఏడున్నర ఏళ్ల పాటు ఉంటుందట. ఇందులో మొదటి దశ శని మీ రాశికి 12వ ఇంట్లో ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది. ఇది మొదటి రెండున్నరేళ్ల కాలం అంటారట.  రెండవ దశ శని మీ  రాశిలోనే ఉన్నప్పుడు రెండవ దశ అంటారట. ఇది అత్యంత ప్రభావవంతమైన కాలమని ఇది కూడా రెండున్నరేళ్లు ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఇక మూడవ దశ శని మీ రాశి నుండి 2వ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చేదే మూడవ దశ, చివరి దశ అని చెప్తున్నారు. ఇది కూడా రెండున్నరేళ్లు ఉంటుందట. అయితే ప్రతి ముప్పై ఏళ్లకు ఒకసారి ఏలినాటి శని వస్తుందట.

Advertisement

అర్ధాష్టమ శని (Ardhastama Shani): శని గ్రహం మీ జన్మ రాశి నుండి 4వ ఇంట్లో సంచరిస్తున్నప్పుడు దానిని అర్ధాష్టమ శని అంటారట. ఇది రెండున్నరేళ్లు ఉంటుందట. అయితే ఈ  అర్ధాష్టమ శని సమయంలో గృహ సంబంధిత ఇబ్బందులు, మానసిక అశాంతి లేదా కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంటుందట.

అష్టమ శని (Ashtama Shani): శని గ్రహం మీ జన్మ రాశి నుండి 8వ ఇంట్లో సంచరిస్తున్నప్పుడు దానిని అష్టమ శని అంటారట. ఇది రెండున్నరేళ్లు ఉంటుందట. జ్యోతిష్య రీత్యా ఏలినాటి శని కంటే అష్టమ శని కష్టతరమైనదిగా పండితులు చెప్తున్నారు. ఆరోగ్య సమస్యలు, ధన నష్టం లేదా పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుందట.

Advertisement

ప్రస్తుత ఏలినాటి శని ఎవరికి నడుస్తుందిన: ప్రస్తుతం శని గ్రహం కుంభ రాశి నుండి మీన రాశి లోకి మారుతుందట దీంతో ఇప్పుడు కుంభం, మీనం, మేష రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుందట. ఇక అష్టమ శని ప్రభావం  సింహ రాశి వారికి (మీనంలో శని ఉన్నప్పుడు) ఉండే అవకాశం ఉంటుందట. అలాగే అర్ధాష్టమ శని ప్రభావం ధనుస్సు రాశి వారికి ఉంటుందని పండితులు సూచించారు.

మేష రాశి వారికి ఏలినాటి శని 29-03-2025 నుంచి 31-05-2032 వరకు

వృషభ రాశి వారికి ఏలినాటి శని 23-02-2028 నుంచి 13-07-2034 వరకు

మిథున రాశి వారికి ఏలినాటి శని 17-04-2030 నుంచి 27-08-2036 వరకు

కర్కాటక రాశి వారికి ఏలినాటి శని 31-05-2032 నుంచి 22-10-2038 వరకు

సింహ రాశి వారికి ఏలినాటి శని 13-07-2034 నుంచి 28-01-2041 వరకు

కన్యారాశి వారికి ఏలినాటి శని 27-08-2036 నుంచి 11-12-2043 వరకు

తులారాశి వారికి ఏలినాటి శని 22-10-2038 నుంచి 08-12-2046 వరకు

వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని 28-01-2041 నుంచి 06-03-2049 వరకు

ధనస్సు రాశి వారికి ఏలినాటి శని 11-12-2043 నుంచి 25-02-2052 వరకు

మకర రాశి వారికి ఏలినాటి శని 08-12-2046 నుంచి 14-05-2054 వరకు

కుంభ రాశి వారికి ఏలినాటి శని 24-01-2020 నుంచి 23-02-2028 వరకు

మీన రాశి వారికి ఏలినాటి శని 17-01-2023 నుంచి 17-04- 2030 వరకు

ఈ తేదీలలో పన్నెండు రాశులకు ఏలినాటి వస్తుందని పండితులు చెప్తున్నారు. శని ప్రభావం వల్ల కలిగే ఇబ్బందులు తగ్గడానికి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం.. శనివారం రోజు శివాలయం లేదా శని దేవుని దర్శనం చేసుకోవాలట. అలాగే పేదలకు, వికలాంగులకు తోచిన సహాయం చేయాలట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: మీకున్న అప్పులు తీర్చి, ధనయోగాన్ని ఇచ్చే  ఆలయం ఎక్కడుందో తెలుసా..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×