E-Paper
Advertisement

బాబోయ్ తెలీకుండా ఇన్స్టంట్స్ లో ఫోటో పోస్ట్ అయ్యిందా ? ఈ చిట్కా ట్రై చేయండి

బాబోయ్ తెలీకుండా ఇన్స్టంట్స్ లో ఫోటో పోస్ట్ అయ్యిందా ? ఈ చిట్కా ట్రై చేయండి
Advertisement

Instagram Instants : ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టంట్స్ అనే కొత్త ఫీచర్ వచ్చిందని విషయం అందరికీ తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా ఫోటో తీసిన వెంటనే షేర్ చేయొచ్చు. కానీ ఒకవేళ పొరపాటున చేయకూడని ఫోటోని షేర్ చేస్తే దాన్ని వెంటనే ఎలా అన్ డూ చేయాలన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. మరి ఈ ఒక్క సెట్టింగ్ తో ఆ పని ఎలా చేయొచ్చు అనేది తెలుసుకుందాం పదండి.

ఇన్స్టంట్స్ అంటే ఏంటి?

జెన్ జెడ్ లేదా మిలీనియల్స్, బూమర్స్ అని తేడా లేకుండా అన్ని వయసుల వారు ఇన్స్టాలో ఫోటో షేరింగ్, చూసిన వెంటనే మెసేజ్ లు డిలీట్ అవ్వడం అనే ఆప్షన్ బాగా ఆదరణ పొందుతుంది. ఈ ట్రెండ్ ను పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి తెచ్చిన తొలి ప్లాట్ఫామ్ స్నాప్ చాట్. కానీ ఇప్పుడు ఇంస్టాగ్రామ్ తన కొత్త ఫీచర్ ఇన్స్టంట్స్ తో దానికి పోటీ ఇవ్వడానికి గట్టిగా ట్రై చేస్తుంది. ఈ ఫీచర్ వల్ల వినియోగదారులు వాళ్ళ ఇన్ బాక్స్ నుంచే నేరుగా, క్లిక్ చేసిన వెంటనే స్నేహితులతో ఫోటోలను పంచుకోవచ్చు. అయితే ఇన్స్టంట్స్ ద్వారా సాధారణంగా ఇంస్టాగ్రామ్ పోస్టులు లేదా స్టోరీస్ లాగా కాకుండా… ఇన్స్టంట్స్ ద్వారా ఫోటోలను పంపించే ముందు వాటిని ప్రివ్యూ చేయడానికి లేదా ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఫోటోను క్లిక్ చేసిన వెంటనే అది షేర్ అవుతుంది. అయితే దీనివల్ల ప్రైవసీ విషయం వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. పొరపాటున ఏవైనా ఫోటోలు పంపితే కంగారు పడకండి. ఎందుకంటే ఈ ఆర్టికల్ లో ఇంస్టాగ్రామ్ ఇన్స్టంట్స్ ద్వారా షేర్ చేసిన ఫోటోలను ఎలా అన్ సెండ్ చేయాలో మనం తెలుసుకుందాం.

ఈ ఒక్క పని చేయండి చాలు

Advertisement

ఇన్స్టంట్స్ అనేది ఇంస్టాగ్రామ్ డైరక్ట్ మెసేజ్ లో కనిపించే ఒక ఫోటో షేరింగ్ ఫీచర్. ఇన్ బాక్స్ లో కనిపించే చిన్న ఫొటో స్టాక్ ఐకాన్ ను ట్యాప్ చేస్తే ఇది ఆన్ అవుతుంది. ఆ తర్వాత ఈ ఫీచర్ వల్ల నేరుగా కెమెరా ఓపెన్ అయ్యి, స్నేహితులకు లేదా సన్నిహితులకు లైవ్ ఫోటోలు పంపించవచ్చు. షేరింగ్ సహజంగా ఎడిట్ చేయకుండా ఉండేలా చేయడమే ఈ ఫీచర్ ఉద్దేశం. ఇక ఒక్కసారి చూడగానే ఆ ఫోటోలు వాటంతట అవే డిలీట్ అవుతాయి. అంతేకాకుండా రియాక్షన్లు కూడా ప్రైవేట్ గానే ఉంటాయి అని ఇంస్టాగ్రామ్ చెబుతోంది. అయితే ఇన్స్టంట్స్ ను ఎలా డిలీట్ చేయాలనే విషయాన్ని తెలుసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం బెటర్.

ఇంస్టాగ్రామ్ డిఫాల్ట్ గా ఆడియన్స్ సెట్టింగ్స్ లో ఫ్రెండ్స్ అని సెట్ చేసి ఉంటుంది. షట్టర్ బటన్ నొక్కిన వెంటనే ఫోటో సెండ్ అవుతుంది. ఇక వినియోగదారులు ఫోటోలను పంపే ముందు వాటిని ఎడిట్ చేయలేరు అలాగే ప్రివ్యూ కూడా చూడలేరు.
గ్యాలరీ నుంచి పాత ఫోటోలను అప్లోడ్ చేయలేరు. పంపిన ఇంస్టాగ్రామ్ ఇన్స్టంట్స్ ను డిలీట్ చేయడానికి చాలా తక్కువ టైం ఉంటుంది.

Advertisement

Also Read : ప్రైమ్ వీడియోలో ఉన్న బెస్ట్ సినిమాలు ఇవే… వీకెండ్ కు ఎంటర్టైన్మెంట్ డబుల్

ఇన్స్టంట్స్ ను అన్ సెండ్ చేయడం ఎలా ?

పొరపాటున షేర్ చేసిన ఇన్స్టంట్స్ ను డిలీట్ చేయడానికి ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. ఇన్స్టంట్ ను షేర్ చేసిన వెంటనే షట్టర్ బటన్ కింద ఉండే అన్ డూ బటన్ ను త్వరగా నొక్కండి. ఫోటోను పంపాక ఈ ఆప్షన్ చాలా తక్కువ టైం మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత ఫాస్ట్ గా ఉండాలి. ఇన్స్టంట్స్ లోని కెమెరా స్క్రీన్ లోని 4 గడుల ఐకాన్ ను ఉపయోగించి, ఆర్కైవ్ అనే ఫోల్డర్ ను ఓపెన్ చేసి డిలీట్ చేయొచ్చు. ఒకవేళ ఫోటోను అప్పటికే చూసి ఉంటే డిలీట్ చేయడం సాధ్యం కాదు. అనుకోకుండా లేదా అనాలోచితంగా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టంట్స్ ను షేర్ చేసినప్పుడు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది.

Tags

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×