E-Paper
Advertisement

Shoaib Akhtar: విరాట్ కోహ్లీ పీకింది ఏం లేదు..ర‌జ‌త్ వ‌ల్లే RCB స‌క్సెస్ !

Shoaib Akhtar:  విరాట్ కోహ్లీ పీకింది ఏం లేదు..ర‌జ‌త్ వ‌ల్లే RCB స‌క్సెస్ !
Advertisement

Shoaib Akhtar:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ( RCB) ఫైనల్స్ కు చేరిన సంగతి తెలిసిందే. క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans) జట్టును చిత్తు చేసి మరి.. ఫైనల్స్ లోకి దూసుకు వచ్చింది బెంగళూరు. నిన్నటి మ్యాచ్ లో 93 పరుగులతో అద్భుతంగా రాణించాడు బెంగుళూరు కెప్టెన్ రజత్ పాటిదార్. ఈ క్రమంలోనే సులభంగా బెంగళూరు గెలిచి, ఫైనల్ కు వెళ్లగలిగింది. అయితే బెంగళూరు ఫైనల్స్ కు వెళ్లడం పట్ల పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు విజయపతంలో దూసుకు వెళ్తుంది అంటే దానికి ముఖ్య కారణం రజత్ పాటిదార్ (Rajat Patidar) మాత్రమేనని పేర్కొన్నారు. అనవసరంగా బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ ( Virat Kohli) ఉన్నాడని.. అతడి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని బాంబు పేల్చారు.

Also Read: Vaibhav-Parag: వైభ‌వ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బ‌య‌ట‌పెట్టిన‌ రియాన్ ప‌రాగ్, ఇదిగో షాకింగ్ వీడియో 

విరాట్ కోహ్లీ పీకింది ఏం లేదు..ర‌జ‌త్ వ‌ల్లే RCB స‌క్సెస్ !

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సక్సెస్ కావడం వెనక రజత్ పాటిదార్ ఉన్నాడని వ్యాఖ్యానించారు. అతని వల్లే 2025 ఐపీఎల్ సందర్భంగా టైటిల్ కూడా గెలుచుకుందని ప్రశంసించారు. జట్టును ముందుండి నడిపించడంలో రజత్ పాటిదార్ ప్రతిభ అద్భుతం అన్నారు. అందుకే 18 సంవత్సరాలుగా గెలవని బెంగుళూరును.. ఛాంపియన్ చేసినట్లు షోయబ్ అక్తర్ హాట్ కామెంట్స్ చేశారు. కానీ విరాట్ కోహ్లీ వల్ల టైటిల్ వచ్చిందని అతని అభిమానులు విష ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అంతా జట్టును కానీ నడిపించినట్లు బిల్డప్ ఇస్తాడని విరాట్ కోహ్లీ పరుగు తీశారు. ఇక విరాట్ కోహ్లీ జోలికి వెళ్తే అతని అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

మొన్న హెడ్ విషయంలో కూడా కోహ్లీ అభిమానులు లిమిట్స్ క్రాస్ చేసి ప్రవర్తించారని ఆగ్రహించారు. హెడ్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పటికి కూడా బలుపు చూపించిన విరాట్ కోహ్లీ.. అతన్ని అవమానించాడని మండిపడ్డారు. ఆ తర్వాత హెడ్ భార్య జెస్సికాను వేధింపులకు గురి చేశారని కోహ్లీ అభిమానులపై షోయబ్ అక్తర్ మండిపడ్డారు. క్రికెట్ లో ఇలాంటి సంఘటనలు జరగడం దారుణం అన్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ లో విదేశీ క్రికెటర్లకు ఏ మాత్రం భద్రత లేదని వ్యాఖ్యానించారు. బెంగళూరు జట్టులో కోహ్లీ ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని సెటైర్లు పేల్చారు. రజత్ పాటిదార్ ( Rajat) తన కెప్టెన్సీలో మరో ఐదు టైటిల్స్ తీసుకువచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు షోయబ్ అక్తర్ (Shoaib Akhtar).

Advertisement

 

Also Read:  Abdul Razzaq: PSL అల్లా కంటే ప‌విత్ర‌మైన‌ది..ఐపీఎల్ అతిపెద్ద‌ ఫిక్సింగ్ హబ్ Abdul Razzaq: PSL

 

 

 

 

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×