E-Paper
Advertisement

Instagram Reels Control: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కంట్రోల్ చేసేందుకు కొత్త ఫీచర్.. కేవలం ఒక్క ట్యాప్ చేస్తే చాలు

Instagram Reels Control: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కంట్రోల్ చేసేందుకు కొత్త ఫీచర్.. కేవలం ఒక్క ట్యాప్ చేస్తే చాలు
Advertisement

Instagram Reels Control| ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ కోసం మరింత మెరుగైన ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి మెటా కంపెనీ నిరంతరం అప్‌డేట్లు తెస్తోంది. తాజాగా రీల్స్ వీడియోలకు కొత్త ట్యాప్-టు-పాజ్ ఫీచర్ వచ్చింది. ఈ ఫీచర్‌తో వీడియోలను సులభంగా నియంత్రించవచ్చు. గతంలో ఉన్న ప్రెస్-అండ్-హోల్డ్ విధానాన్ని ఇది భర్తీ చేస్తుంది. ఈ మార్పు వీడియో చూడటాన్ని మరింత సౌకర్యవంతంగా, సులభంగా చేస్తుంది.

ట్యాప్-టు-పాజ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

Advertisement

రీల్ చూస్తుంటే ఒకసారి స్క్రీన్‌పై ట్యాప్ చేస్తే వీడియో పాజ్ అవుతుంది. మళ్లీ ఒకసారి ట్యాప్ చేస్తే వెంటనే ప్లే అవుతుంది. గతంలో స్క్రీన్‌ను నొక్కి పట్టుకోవాల్సి ఉండేది. ఆ విధానం ఎక్కువ సేపు చూసేటప్పుడు ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఈ కొత్త ఫీచర్‌తో వేగంగా, ఈజీగా వీడియోలను యూజర్ కంట్రోల్ చేయొచ్చు. ఇతర వీడియో యాప్‌లలో ఉన్న కంట్రోల్స్‌తో ఇది సమానంగా ఉంటుంది.

ఈ ఫీచర్ ఎందుకు ముఖ్యమైనది?

పాత ప్రెస్-అండ్-హోల్డ్ విధానంతో చాలా మంది వినియోగదారులకు ఇబ్బంది ఎదురైంది. క్యాప్షన్లు చదవడం, రీల్స్ డీటెయిల్స్ చూడడం కష్టమవుతుంది. కీలకమైన మూమెంట్లు మిస్ అవుతున్నాయి. ఇప్పుడు ట్యాప్ చేసి సులభంగా పాజ్ చేసి, కావాల్సిన భాగాన్ని తీరికగా చూడవచ్చు. ఈ ఫీచర్ మొత్తం వీడియో చూసే ఎక్స్‌పీరియన్స్‌ని చాలా మెరుగుపరుస్తుంది.

ఫీచర్ అధికారిక ప్రకటన, రోల్‌అవుట్

Advertisement

ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్లకు సంబంధించిన ఛానెల్స్ ద్వారా ప్రకటించింది. థ్రెడ్స్ ప్లాట్‌ఫామ్‌లో కూడా షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ హెడ్ అడమ్ మోసెరి ఒక పోస్ట్‌లో దీన్ని నిర్ధారించారు. ఈ ఫీచర్ యూజర్లకు ఎక్కువ కంట్రోల్, మెరుగైన ఎంగేజ్‌మెంట్ ఇస్తుందని వివరించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ రోల్ అవుతోంది. ప్రాంతం, ఖాతా ఆధారంగా కొంత వ్యత్యాసం ఉండవచ్చు. కొంత మంది యూజర్లు టెస్టింగ్ దశలోనే దీన్ని ఉపయోగించారు.

Also Read: ఐఫోన్ నీళ్లలో పడిపోయిందా? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా క్లీన్ చేయండి

క్రియేటర్లకు అదనపు ఫీచర్లు

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు AI ఆధారిత వాయిస్ ఎఫెక్ట్స్ తెచ్చింది. చిప్‌మంక్, రోబోట్, ఏలియన్, డెమన్ వంటి వాయిస్ ఫిల్టర్లు అందుబాటులో ఉన్నాయి. అండర్‌వాటర్, స్టేడియం, వాబుల్, ఫిష్‌బౌల్ వంటి ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇవి వీడియోలను మరింత ఆకర్షణీయంగా, క్రియేటివ్‌ లుక్స్ ఇస్తాయి.

మెరుగైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్

రీల్ పాజ్ అయినప్పుడు మ్యూట్ చేసే ఆప్షన్ వంటివి కనిపిస్తాయి. ఆడియోను సులభంగా నియంత్రించవచ్చు. ఇది వినియోగదారులకు మరింత కంట్రోల్ ఇస్తుంది. ముఖ్యమైన భాగాలు మిస్ కాకుండా చూడవచ్చు.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×