E-Paper
Advertisement

iPhone Water Eject: ఐఫోన్ నీళ్లలో పడిపోయిందా? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా క్లీన్ చేయండి

iPhone Water Eject: ఐఫోన్ నీళ్లలో పడిపోయిందా? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా క్లీన్ చేయండి
Advertisement

iPhone Water Eject| ఆండ్రాయిడ్ ఫోన్స్ కంటే ఆపిల్ కంపెనీ తయారు చేసే ఐఫోన్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇందులో యూజర్ డేటా సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో మిగతా ఫోన్ల కంటే క్వాలిటీ ఫీచర్స్ ఉంటాయి.ఈ కారణంగా ఐఫోన్ చాలా ఖరీదు. అలాంటి ఐఫోన్ అనుకోకుండా నీళ్లలో పడిపోతే యూజర్లు ఆందోళన చెందుతారు.

ఫోన్ నీటిలో పడిపోతే స్పీకర్ గ్రిల్స్‌లోకి నీళ్లు చేరి సౌండ్ క్వాలిటీపై ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు లోపలి భాగాలు డ్యామేజ్ అయిపోయి ప్రమాదం కూడా ఉంది. ఆపిల్ వాచ్‌లో వాటర్ లాక్ ఫీచర్ ఉంటుంది కానీ ఐఫోన్‌లో అలాంటి సౌలభ్యం లేదు. అయితే ఓ సింపుల్ ట్రిక్‌తో ఐఫోన్ లోపల ఉన్న నీళ్లను తొలగించుకోవచ్చు. ఈ ట్రిక్ పేరు వాటర్ ఎజెక్ట్ హ్యాక్.

వాటర్ ఎజెక్ట్ హ్యాక్ అంటే ఏంటి?

Advertisement

వాటర్ ఎజెక్ట్ హ్యాక్ సౌండ్ వైబ్రేషన్ సహాయంతో ఫోన్‌లో ఉన్న నీటిని బయటకు పంపిస్తుంది. స్పీకర్ల ద్వారా లో-ఫ్రీక్వెన్సీ ఆడియో ప్లే అవుతుంది. ఈ సౌండ్ వేవ్స్ వల్ల కంపనాలు ఏర్పడి నీరు క్రమంగా బయటకు వస్తాయి. ఇది చాలా సింపుల్ ప్రక్రియ. ఐఫోన్‌లో షార్ట్‌కట్ టూల్ డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది.

ఈ ట్రిక్ ఎలా పనిచేస్తుంది?

లో-ఫ్రీక్వెన్సీ సౌండ్స్ స్పీకర్ సిస్టమ్‌లో బలమైన కంపనాలు సృష్టిస్తాయి. ఈ కంపనాలు గ్రిల్స్‌లో చిక్కుకున్న నీటిని బయటకు పుష్ చేస్తాయి. ఫోన్‌ నిలువగా సరైన పొజిషన్‌లో పెడితే గ్రావిటీ కూడా సహాయపడుతుంది. నీటిలో పడిన వెంటనే త్వరగా ఈ ట్రిక్ ప్రయోగిస్తే లాంగ్ టర్మ్ డ్యామేజ్ నివారించవచ్చు. ఖరీదైన రిపేర్‌ల నుంచి తప్పించుకోవచ్చు.

స్టెప్ 1: వాటర్ ఎజెక్ట్ షార్ట్‌కట్ డౌన్‌లోడ్ చేయండి

Advertisement

ముందుగా ఐఫోన్‌లో సఫారీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. “వాటర్ ఎజెక్ట్ షార్ట్‌కట్” అని సెర్చ్ చేయండి. అధికారిక లింక్ నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది నేరుగా షార్ట్‌కట్స్ యాప్‌లో యాడ్ అవుతుంది. ఈ టూల్ ప్రత్యేకంగా వాటర్ రిమూవల్ కోసం డిజైన్ చేయబడింది.

స్టెప్ 2: వాటర్ ఎజెక్ట్ టూల్ రన్ చేయండి

ఇప్పుడు షార్ట్‌కట్స్ యాప్ ఓపెన్ చేసి.. వాటర్ ఎజెక్ట్ షార్ట్‌కట్ సెలెక్ట్ చేయండి. బెటర్ రిజల్ట్స్ కోసం ‘హైయెస్ట్ ఇంటెన్సిటీ లెవల్’ ఎంచుకోండి. ఈ టూల్ లో-ఫ్రీక్వెన్సీ సౌండ్ ప్లే చేయడం మొదలుపెడుతుంది. స్పీకర్ల నుంచి నీటి బిందువులు బయటకు రావడం మీరు గమనించవచ్చు. ప్రాసెస్ పూర్తయ్యేవరకు ఇంటరప్ట్ చేయకండి.

స్టెప్ 3: ఐఫోన్‌ను సరైన పొజిషన్‌లో పెట్టండి

స్పీకర్ భాగం కిందికి వచ్చేలా ఫోన్‌ను పెట్టండి. ఇలా చేయడం వల్ల గ్రావిటీ నీటిని బయటకు లాగడానికి సహాయపడుతుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేవరకు ఫోన్‌ను స్టెడీగా పట్టుకోండి. పూర్తయిన తర్వాత మెత్తటి మైక్రోఫైబర్ క్లాత్ తీసుకోండి. ఫోన్ ఉపరితలం, అంచులను జాగ్రత్తగా తుడవండి. స్క్రీన్, కెమెరా లెన్స్‌లను క్లీన్ చేయండి. ఫోన్‌పై ఎక్కువ ఒత్తిడి చేయకండి.

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్ ఫీచర్.. వాయిస్ మార్చి మెసేజ్ పంపవచ్చు.. ఎలాగంటే?

ఇలా చేయెద్దు

హెయిర్ డ్రైయర్ వంటి హీట్ సోర్సెస్ వాడొద్దు. ఎక్కువ వేడి ఫోన్ లోపలి భాగాలను డ్యామేజ్ చేస్తుంది. స్పీకర్ గ్రిల్స్‌లోకి ఎటువంటి వస్తువులూ దూర్చొద్దు.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×