E-Paper
Advertisement

ఇన్‌స్టా యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఒక్క ట్యాప్‌తో పని ఖతమ్!

ఇన్‌స్టా యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఒక్క ట్యాప్‌తో పని ఖతమ్!

Instagram Reels: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మీరి అతిగా చూస్తుంటారా? మధ్యలో ఏదైనా వీడియో నచ్చినప్పుడు అందులోని క్యాప్షన్ చదవడానికో లేక ఆ సీన్‌ను చూడటానికి ఆపడానికి ట్రై చేస్తే మీకు చుక్కలు కనిపించడం,యూట్యూబ్‌లో లాగా ట్యాప్ చేస్తే వీడియో ఆగిపోకుండా టక్కున మ్యూట్ అయిపోయి చిరాకు కలిగించడం గుర్తు ఉండే ఉంటుంది.అయితే మనందరి కష్టాలు తీర్చడానికి మెటా బాస్ మార్క్ జుకర్‌బర్గ్ ఒక అదిరిపోయే అప్‌డేట్ తీసుకొచ్చారండోయ్..అది ఎంటంటారా.

కొత్తగా ‘ట్యాప్-టు-పాజ్’ (Tap-to-Pause) ఆప్షన్‌..

 మనం ఇన్‌స్టా రీల్స్ ను పాజ్ (Pause) చేయాలంటే స్క్రీన్‌పై వేలితో అలా నొక్కి పట్టుకోవాల్సి వచ్చేది.వేలు తీస్తే చాలు వీడియో మళ్ళీ పరిగెత్తేది.కానీ ఇక ఆ తిప్పలు తప్పనున్నాయ్. అవును …ఇపుడు ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా ట్యాప్-టు-పాజ్‘ (Tap-to-Pause) ఆప్షన్‌ను తీసుకొచ్చింది. అంటే ఇతర వీడియో ప్లాట్‌ఫామ్‌ల లాగే సింపుల్‌గా స్క్రీన్‌ మీద ఒక్కసారి ట్యాప్ చేస్తే చాలు.. వీడియో అక్కడికక్కడే ఆగిపోతుందన్న మాట.అంటే మనం ఏదైనా చదవాలన్నా, ఫోకస్డ్ గా చూడాలన్నా మళ్ళీ మళ్ళీ వీడియో ని రిపీడ్ మోడ్ లో చూడక్కర్లేదిక.

also read:హరీష్ శంకర్ పనైపోయినట్టేనా.. టైర్-2 హీరోలు కూడా ?

వీడియో ఆపాలా లేక ఆడియో ఆపాలా..

 ఇక జనరల్ గా మనం వీడియో ఆపడానికి ట్యాప్ చేస్తే అది మ్యూట్ అయ్యేది.కానీ ఈ కొత్త అప్‌డేట్‌లో వీడియో పాజ్ అయినప్పుడు స్క్రీన్‌పైనే మీకు ప్రత్యేకంగా మ్యూట్ఆప్షన్ కూడా కనిపించడం విశేషం.దీనివల్ల వీడియో ఆపాలా లేక ఆడియో ఆపాలా అన్న కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా కంట్రోల్ చేయొచ్చన్న మాట.ఇకపై ఏదైనా క్రేజీ రెసిపీ నోట్ చేసుకోవాలన్నా లేదా రీల్‌లో ఏదైనా డీటెయిల్డ్ గా చూడాలన్నా ఇకపై ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా పాజ్ చేసి చూసేయొచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌ను ఒకసారి అప్‌డేట్..

 అయితే మొదటగా ఈ సూపర్ ఫీచర్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ (iOS) వినియోగదారులకు దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. ఒకవేళ మీకు గనుక ఇంకా ఈ ఆప్షన్ రాకపోతే మాత్రం వెంటనే మీ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌కి వెళ్లి ఇన్‌స్టాగ్రామ్‌ను ఒకసారి అప్‌డేట్ చేయాల్సిందే. మొత్తానికి స్క్రీన్‌ను నొక్కి పట్టుకుని వేళ్లు నొప్పులు పుట్టించే కాలానికి ఇక ఎండ్ కార్డ్ వేసి సింపుల్‌గా ట్యాప్ చేసి ఇన్‌స్టా రీల్స్ ప్రపంచాన్ని చుట్టేయోచ్చు.

ప్లేబ్యాక్ స్పీడ్ కంట్రోల్

ఇక యూట్యూబ్ లో లాగే దీంట్లో కూడా మీ ఇష్టానికి తగ్గట్టుగా రీల్స్ వేగాన్ని మార్చుకునే ప్లేబ్యాక్ స్పీడ్ కంట్రోల్ ఆప్షన్‌ను రంగంలోకి దింపెసింది ఇన్‌స్టా. అంటే ఇప్పటివరకు మనం ఏదైనా రీల్ వేగంగా చూడాలంటే స్క్రీన్‌ను గట్టిగా నొక్కి పట్టుకోవాల్సి వచ్చేది. కానీ అది అంత కంఫర్టబుల్‌గా లేదన్న ఫీడ్ బ్యాక్ రావడంతో ఇపుడు ఇన్‌స్టా టీమ్ రూటు మార్చింది. ఇకపై రీల్స్ చూసేటప్పుడు మీకు కావాల్సిన వేగాన్ని మీరే సెట్ చేసుకోవచ్చు. స్లో మోషన్‌లో వీడియోను ఎంజాయ్ చేయడానికి0.5xలో నార్మల్ స్పీడ్ లో చూడాలంటే 1xలో లెంత్ ఎక్కువగా ఉండే లేదా బోర్ కొట్టించే వీడియోలను చకా చకా  ఫినిష్ చేయడానికి2x & 3x అంటూ  మొత్తం నాలుగు ఆప్షన్లు అందుబాటులో తీసుకురావడం విశేషం..

also read:ఎర్రటి మిరపకాయలు ఏడాది కాలం రంగు, రుచి మారకూడదా?

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×