E-Paper
Advertisement

ఓటీటీ విధానం పై గుణశేఖర్  కామెంట్స్ .. సినిమాను బ్రతికించండంటూ!

ఓటీటీ విధానం పై గుణశేఖర్  కామెంట్స్ .. సినిమాను బ్రతికించండంటూ!
Advertisement

Gunasekhar:  టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో గుణశేఖర్(Gunasekhar) ఒకరు. ఒకానొక సమయంలో ఈయన దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇటీవల కాలంలో గుణశేఖర్ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీకి కొంత విరామం ఇచ్చిన గుణశేఖర్ చాలా రోజుల తర్వాత యుఫోరియా(Euphoria) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మార్చి ఆరో తేదీ విడుదల అయినప్పటికీ కమర్షియల్ గా అనుకున్న స్థాయిలో అందుకోలేకపోయింది. ఈ సినిమా కారణంగా నిర్మాతలకు నష్టాలు మిగిలిన చెప్పాలి.

గుణశేఖర్ యుఫోరియా..

సమాజంలో అమ్మాయిల పట్ల జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోవడంతో డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతుంది. ఈ సినిమా ఏప్రిల్ రెండవ తేదీ నుంచి ఈటీవీ విన్(Etv win) ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ గుణశేఖర్ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఈయన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించకపోవడం గురించి కాస్త అసహనం వ్యక్తం చేశారు. అలాగే ఓటీటీ విధానంపై కూడా గుణశేఖర్ మండిపడ్డారు.

నెల రోజులకే ఓటీటీలోకి సినిమాలు..

Advertisement

ప్రేక్షకులు థియేటర్లకు రానందుకు మనం వారిని తప్పు పట్టాల్సిన పనిలేదు. కరోనా సమయంలో సినిమాల షూటింగులు ఆగిపోవడంతో ఈ సందర్భాన్ని ఓటీటీ బాగా అనుకూలంగా మార్చుకున్నని తెలిపారు. చిన్న హీరోల నుంచి మొదలుకొని పెద్ద హీరోల వరకు సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే కేవలం నెల రోజులకే తిరిగి ఓటీటీలోకి వస్తున్నాయి అలాంటప్పుడు ప్రేక్షకులు కూడా నెల రోజుల తర్వాత ఫ్రీగా సినిమాని అందరం చూడొచ్చు అలాంటిది థియేటర్ కు ఎందుకు వెళ్లాలి అనే ఆలోచనలో ఉన్నారని ఈయన తెలిపారు. కేవలం పెద్ద హీరోలు సినిమాలు అది కూడా మంచి టాక్ వస్తేనే థియేటర్లకు వెళ్తున్నారని గుణశేఖర్ తెలిపారు.

మూడు నెలల తరువాతనే ఓటీటీలోకి..

Advertisement

ఇలా ఓటీటీ సంస్థలు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తూ నెల రోజులకి డీల్ కుదుర్చుకోవడంతో ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారని ఆవేదన చెందారు. అందుకే ఒక సినిమా థియేటర్లో విడుదలైంది అంటే దాదాపు మూడు నెలల వరకు ఆ సినిమా ఓటీటీలోకి రాకుండా ఉండాలని అప్పుడే సినిమా బ్రతుకుతుంది అంటూ ఈయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఓటీటీ డీల్ కారణంగా ఎన్నో సినిమాలు నష్టపోయిన సంగతి తెలిసిందే. ఇక తన సినిమా ఎంతో మంచి కంటెంట్ ఉన్న సినిమా అని కానీ ప్రేక్షకులు మాత్రం సినిమాని ఆదరించలేకపోయారు అంటూ గుణశేఖర్ ఎమోషనల్ అయ్యారు.

Also Read: విజయ్ రణబాలి యాక్షన్ వీడియో లీక్..ఒక్కో డైలాగ్ ఒక్కో డైమండ్…ఈ సారి హిట్టు గ్యారంటీ!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×