E-Paper
Advertisement

Shahid Afridi: నా అల్లుడు బంగారం..బాల్ ట్యాంపరింగ్ చేసింది ఆ దొంగ‌లే

Shahid Afridi: నా అల్లుడు బంగారం..బాల్ ట్యాంపరింగ్ చేసింది ఆ దొంగ‌లే
Advertisement

Shahid Afridi:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( PSL 2026) నేపథ్యంలో బాల్ టాంపరింగ్ ( Ball Tampering) వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన లో లాహోర్ జట్టుకు సంబంధించిన కెప్టెన్ షాహీన్ అఫ్రిదీ, ఫఖ‌ర్ జమాన్ అలాగే హ‌రిస్ ర‌వూఫ్‌ ఇరుక్కున్నారు. బంతిని తీసుకొని ఆకారం మార్చేందుకు ముందుగా ఫఖ‌ర్ జమాన్ ప్రయత్నించాడు. దీంతో ఈ ముగ్గురిపై చర్యలు ఉంటాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో బాల్ టాంపరింగ్ వ్యవహారంపై షాహిద్ అఫ్రిదీ స్పందించారు. తన అల్లుడు బంగారం అని.. ఈ బాల్ టాంపరింగ్ కు షాహీన్ అఫ్రిదీకి ఎలాంటి సంబంధం లేదని బాంబు పేల్చారు షాహిద్ అఫ్రిదీ. దీంతో షాహిద్ అఫ్రిదీ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Also Read: PSL 2026: PSLను అత‌లాకుత‌లం చేసిన తుఫాన్‌..గాల్లో ఎగిరిప‌డ్డ గ్రౌండ్ మెన్లు

నా అల్లుడు బంగారం.. చేసిందంతా వాళ్లే

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బాల్ టాంపరింగ్ వ్యవహారంలో షాహీన్ అఫ్రిదీపై కూడా బ్యాన్ విధిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాల్ టాంపరింగ్ వ్యవహారం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ఇందులో షాహీన్ అఫ్రిదీ ప్రమేయం లేదని.. తన అల్లుడు బంగారం అంటూ వ్యాఖ్యానించారు. హరిస్ ర‌వూఫ్‌ అలాగే ఫఖ‌ర్ జమాన్ ఇద్దరు కలిసి ఈ బాల్ టాంపరింగ్ వ్యవహారంలో పాల్గొన్నారని తెలిపారు. కావాలనే తన అల్లుడిపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. తన అల్లుడిపై చర్యలు తీసుకుంటే న్యాయపోరాటం చేస్తానని కూడా ప్రకటించారు షాహిద్ అఫ్రిది.

బాల్ టాంపరింగ్ సంఘటన ఎప్పుడు జరిగిందంటే ?

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్  ( PSL 2026)  సందర్భంగా బాల్ టాంపరింగ్ ( ball tampering in PSL ) వ్యవహారం జరిగింది. మొన్నటి ఆదివారం రోజున లాహోర్ ఖ‌లింద‌ర్స్‌ వర్సెస్ కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో లాహోర్ చేసిన తప్పిదానికి కరాచీ కింగ్స్ అవలీలగా విజయం సాధించింది. చివరి ఓవర్ లో 14 బంతులు కావాల్సి ఉన్న నేపథ్యంలో లాహూర్ జట్టుకు సంబంధించిన ఫఖ‌ర్ జమాన్ బాల్ టాంపరింగ్ చేశాడు. కెప్టెన్ షాహీన్ అఫ్రిదీ, ఫఖ‌ర్ జమాన్ అలాగే హ‌రిస్ ర‌వూఫ్… ఈ ముగ్గురు ఒకే దగ్గర ఉన్నప్పుడు బాల్ టాంపరింగ్ జరిగినట్లు అంపైర్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఐదు పరుగుల పెనాల్టీ కూడా విధించారు. ఇక త్వరలోనే ఈ ముగ్గురి పైన‌ కూడా యాక్ష‌న్ తీసుకునే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అయితే తన అల్లుడికి ఇలాంటి సంబంధం లేదని తాజాగా షాహిద్ అఫ్రిదీ వెల్లడించారు. ఇక అటు ఈ పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ 2026 టోర్న‌మెంట్ లో న‌సీమ్ షా వివాదం కూడా కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

 

 

Also Read: Shahid Afridi: నాకు ఛాన్స్ ఇవ్వండి..టీమిండియాకు 100 మంది బుమ్రాల‌ను త‌యారు చేస్తా

 

https://www.facebook.com/photo/?fbid=122176316114797381&set=a.122094037550797381

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×