E-Paper
Advertisement

ఏసీ వేసినా ఇల్లు వేడెక్కుతోందా? కూలింగ్‌ను దోచేస్తున్న.. ఆరుగురు దొంగలు వీళ్లే!

ఏసీ వేసినా ఇల్లు వేడెక్కుతోందా? కూలింగ్‌ను దోచేస్తున్న.. ఆరుగురు దొంగలు వీళ్లే!
Advertisement

AC Cooling Leakage: పగటి ఉష్ణోగ్రత కాస్త పెరిగిందంటే చాలు.. ఇళ్లలో ఏసీలు, కూలర్లు నాన్‌స్టాప్‌గా తిరుగుతూనే ఉంటాయి. అయినా సరే కొంతసేపటికే ఇల్లు మళ్లీ వేడెక్కిపోతుంటుంది. ఫలితంగా ‘ఇంతలా ఏసీ వేసినా రూమ్ ఎందుకు చల్లబడటం లేదు? కరెంట్ బిల్లు మాత్రం కొండలా వస్తోంది’ అని చాలామంది బాధపడుతుంటారు. అయితే ఏసీ లేదా కూలర్ చల్లదనం త్వరగా వెళ్లిపోవడానికి.. కూలింగ్ లీకేజే కారణమని నిపుణులు అంటున్నారు. ఇంట్లోని చల్లదనాన్ని దొంగిలిస్తున్న ఆ 7 రోజువారీ ప్రదేశాలు, వాటిని అరికట్టే స్మార్ట్ చిట్కాలు ఏంటో ఈ కథనం లో చూద్దాం.

తలుపుల కింద గ్యాప్స్

ఏసీ గది తలుపులు మూసినప్పటికీ.. వాటి కింద ఉండే చిన్నపాటి సందుల గుండా కూలింగ్ చాలా తేలిగ్గా బయటకు వెళ్ళిపోతుంది. అదే సమయంలో వేడి గాలి సైతం లోపలికి వచ్చేస్తుంది. అయితే దీనికి మార్కెట్లో దొరికే ‘డోర్ డ్రాఫ్ట్ ఎక్స్‌క్లూడర్స్’ లేదా ఫోమ్ స్ట్రిప్స్‌ను ద్వారా చెక్ పెట్టవచ్చు. తలుపుల కింద గ్యాప్స్ వద్ద వీటిని సెట్ చేయడం ద్వారా కూలింగ్ లీకేజీని అడ్డుకోవచ్చు. ఒకవేళ ఆ ఖర్చు వద్దు అనుకుంటే ఒక పాత టవల్ ను చుట్టి తలుపు కింద అడ్డుగా పెట్టొచ్చు.

కిటికీల సందులు

Advertisement

పాత కిటికీలు లేదా సరిగ్గా ఫిట్ అవ్వని స్లైడింగ్ విండోస్ చల్లదనాన్ని బయటకు పంపేస్తుంటాయి. అలాగే గాజు కిటికీల ఫ్రేముల మధ్య ఉండే చిన్న చిన్న ఖాళీల వల్ల కూడా కూల్ ఎయిర్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కిటికీల అంచుల వెంట ‘వెదర్ స్ట్రిప్పింగ్’ (Weather Stripping) టేప్ అంటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. లేదంటే సిలికాన్ జెల్ సహాయంతో చిన్న చిన్న రంధ్రాలను క్లోజ్ చేయవచ్చు.

కిటికీ అద్దాలు, తెరలు

సూర్యరశ్మి నేరుగా కిటికీ అద్దాలపై పడినప్పుడు ఆ అద్దాలు వేడెక్కి గదిలోకి వేడిని పంపుతాయి. దీనివల్ల ఏసీ ఎంత తిరిగినా గది చల్లబడటానికి చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో పల్చటి తెరలకు బదులు ‘బ్లాకౌట్ కర్టెన్లు’ (Blackout Curtains) వాడితే బెస్ట్ అని నిపుణులు అంటున్నారు. ఇవి వేడిని, సూర్యకాంతిని లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. కిటికీ అద్దాలకు హీట్ రిఫ్లెక్టింగ్ ఫిల్మ్స్ అంటిస్తే ఇంకాస్త మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఎగ్జాస్ట్ ఫ్యాన్లు

Advertisement

వంటగదిలో, బాత్రూమ్‌లలో ఉండే ఎగ్జాస్ట్ ఫ్యాన్లు సాధారణంగా లోపలి వేడిని బయటకు పంపడానికి ఉపయోగపడతాయి. అయితే అవి ఆన్ లో లేనప్పుడు.. ఆ ఓపెన్ హోల్స్ ద్వారా రూమ్ లోని చల్లని గాలి బయటకు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎగ్జాస్ట్ ఫ్యాన్లను వాడనప్పుడు వాటికి అవుట్‌డోర్ కవర్లు లేదా షట్టర్లు ఉండేలా చూసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఎలక్ట్రికల్ అవుట్‌లెట్లు, స్విచ్ బోర్డులు

గోడలకు ఉండే స్విచ్ బోర్డుల లోపల ఖాళీ స్థలం ఉంటుంది. ఈ బోర్డుల సందుల గుండా కూడా చల్లని గాలి బయటకు లీక్ అవుతూ ఉంటుంది. అయితే దీనికి మార్కెట్లో లభించే ‘ఫోమ్ గాస్కెట్స్’ (Foam Gaskets) చెక్ పెట్టొచ్చు. వీటిని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా కూలింగ్ లీకేజీని అడ్డుకోవచ్చు.

Also Read: మ‌రో వివాదంలో అశ్విన్‌…పాకిస్తాన్ ప్లేయ‌ర్ ప‌క్క‌న కూర్చోని ఫోటోలు

ఫ్లోరింగ్‌పై కార్పెట్లు ఏర్పాటు

మార్బుల్ లేదా టైల్స్ ఉన్న నేలలు త్వరగా హీటెక్కడంతో పాటు అంతే స్థాయిలో చల్లదనాన్ని పీల్చేసుకుంటాయి. కాబట్టి వీలైతే రూమ్స్ లో కార్పెట్లు లేదా రగ్గులు (Rugs) పరిస్తే మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి చల్లదనం బయటకు పోకుండా కింద ఉన్న వేడి పైకి రాకుండా ఒక ఇన్సులేటర్‌లా పనిచేస్తాయని పేర్కొంటున్నారు.

Also Read: సమంతకు మెగాస్టార్ స్పెషల్ గిఫ్ట్.. ‘మా ఇంటి బంగారం’ మెగా సెలబ్రేషన్స్!

Related News

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

ఏఐ మోసాలకు చెక్ పెట్టే టెక్నాలజీ..గూగుల్,ఆపిల్ ఫోన్లలోని అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు!

Big Stories

Advertisement
×