Apple iOS 27 Update: ఎట్టకేలకు యాపిల్ సంస్థ తమ కొత్త ఐఓఎస్ 27 అప్‌డేట్ అధికారిక విడుదల తేదీని ప్రకటించేసింది. ఐఫోన్ 18 ప్రో లాంచ్ ఈవెంట్ సందర్భంగా.. ఈ సెప్టెంబర్ 14వ తేదీన ఈ కొత్త సాఫ్ట్‌వేర్ అందరికీ అందుబాటులోకి వస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఐఫోన్ 11 నుంచి ఆపై మోడల్స్ వాడే వారందరూ దీన్ని అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఇది కేవలం కొత్త ఫీచర్ల కోసమే కాదు.. ఐఫోన్ పనితీరును మరింత వేగవంతం చేయడానికి యాపిల్ ఈ అప్‌డేట్‌ను తెస్తోంది. ఐఫోన్ 15 లేదా అంతకంటే పాత మోడల్స్ వాడేవారికి ఫోన్ స్పీడ్ పెరగడం, బగ్స్ క్లియర్ అవ్వడం, బ్యాటరీ లైఫ్ మెరుగవడం లాంటి లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఫొటోలు త్వరగా ఓపెన్ అవ్వడం, ఏర్‌డ్రాప్ మరింత సజావుగా పనిచేయడం లాంటి చిన్న చిన్న మార్పులు ఫోన్ వాడకాన్ని చాలా సులభం చేస్తాయి.
Also Read: భారీ బ్యాటరీ, వాటర్ ప్రూఫ్ ఫీచర్‌తో Oppo A7 Pro లాంచ్.. ధర ఎంతంటే?
ఐఫోన్ 15 ప్రో లేదా ఆ తర్వాతి లేటెస్ట్ మోడల్స్ వాడేవారికి మాత్రం ఈసారి పెద్ద సర్ప్రైజే ఉంది. యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉన్న ఈ ఫోన్లలో సరికొత్త సిరి ఏఐ ఫీచర్‌ను బీటా రూపంలో అందిస్తున్నారు. అయితే దీనిని వాడేందుకు కొంత వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఈ కొత్త సిరి మన మాటల వెనక ఉన్న అర్థాన్ని ఇన్‌స్టంట్‌గా గ్రహిస్తుంది. మెసేజ్‌లు, ఈ-మెయిళ్లు, ఫొటోల్లో ఏముందో వెతికి పట్టుకోవడం దీనికి చాలా సులువు. అలాగే స్క్రీన్ మీద ఏముందో అర్థం చేసుకుని సహాయం చేస్తుంది.
ప్రస్తుతానికి ఇంగ్లీష్‌లో అందుబాటులోకి వస్తున్న ఈ సిరి ఏఐ ఫీచర్‌ను.. అక్టోబర్ నెలలో వచ్చే మరో చిన్న అప్‌డేట్ ద్వారా ఫ్రెంచ్, జపనీస్, కొరియన్, పోర్చుగీస్, స్పానిష్ లాంటి మరికొన్ని భాషలకు కూడా విస్తరించనున్నారు. భవిష్యత్తులో యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేసే అన్ని భాషల్లోనూ ఈ వాయిస్ అసిస్టెంట్ అందుబాటులో ఉండేలా ఆపిల్ ప్లాన్ చేస్తోంది.
ఈ అప్‌డేట్‌తో కేవలం సిరి మాత్రమే కాదు.. ఇమేజ్ ప్లేగ్రౌండ్, రైటింగ్ టూల్స్, జెన్‌మోజి వంటి ఫీచర్లు కూడా మరింత వేగంగా పనిచేస్తాయి. ఫొటోస్ యాప్‌లో క్లీన్ అప్ టూల్ మరింత పవర్‌ఫుల్‌గా మారడంతో పాటు స్పాట్‌లైట్ సెర్చ్ కూడా సిరి ఏఐతో కలిసిపోయింది. కాబట్టి.. సెప్టెంబర్ 14న మీ ఐఫోన్‌కి ఈ అప్‌డేట్ రాగానే తప్పకుండా ట్రై చేయండి.
Also Read: వాట్సప్‌లో చలాన్ మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేశారో.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!