Oppo A7 Pro: మనలో చాలా మందికి రోజంతా ఆఫీస్ వర్క్ లేదా సోషల్ మీడియా స్క్రోల్ చేయడం వలన మన ఫోన్‌లో త్వరగా బ్యాటరీ డెడ్ అయిపోతుంటుంది. ఏదైనా పనిమీద బయటికి వెళ్లినప్పుడు ప్రతిసారీ పవర్ బ్యాంక్ మోయలేక నానా తంటాలు పడుతుంటాం. అయితే ఈ టెన్షన్ అంతటికీ ఫుల్‌స్టాప్ పెట్టేలా ఒప్పో కంపెనీ చైనాలో ఒక క్రేజీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. అదే Oppo A7 Pro. సాధారణ ఫోన్లలా కాకుండా.. భారీ బ్యాటరీ, ఎక్స్‌ట్రీమ్ ప్రొటెక్షన్‌తో వస్తున్న ఈ మొబైల్ గురించే ఇప్పుడు టెక్ ప్రపంచంలో టాక్ నడుస్తోంది.
ఈ ఫోన్‌లో అసలు హైలైట్ ఏంటో తెలుసా? ఏకంగా 8000mAh కెపాసిటీ గల భారీ బ్యాటరీ. అంటే రోజంతా ఎంత ఎక్కువగా ఫోన్ వాడినా బ్యాటరీ అయిపోతుందనే టెన్షనే ఉండదు. తరచూ ఛార్జింగ్ పెట్టలేక చిరాకు పడేవారికి ఇదొక సూపర్ గుడ్ న్యూస్. ఇక ఈ పెద్ద బ్యాటరీని త్వరగా ఛార్జ్ చేసుకోవడానికి 45W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు.
Also Read: ఇక ఏ భాషలోనైనా మాట్లాడొచ్చు.. లైవ్ ట్రాన్స్‌లేషన్, 50% ఎక్కువ ఏఎన్‌సీతో Apple AirPods 5 లాంచ్!
కేవలం బ్యాటరీనే కాదు.. మిగతా ఫీచర్లు కూడా అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో 6.57 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది కాబట్టి.. రీల్స్ చూసినా, స్క్రీన్ స్క్రోల్ చేసినా స్మూత్‌గా పనిచేస్తుంది. ఇక లోపల మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మాక్స్ ప్రాసెసర్‌ను జోడించారు. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ఓఎస్ 16 పై రన్ అవుతుంది.
ఇక ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇది మన రోజువారీ ఫొటోలను చాలా అందంగా క్యాప్చర్ చేస్తుంది. సెల్ఫీల కోసం ముందు 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. వీటన్నింటికంటే అసలైన సర్ప్రైజ్ ఏమిటంటే.. ఈ ఫోన్‌కు IP69K రేటింగ్ ఉంది. అంటే నీళ్లలో పడినా, వర్షంలో తడిచినా, తీవ్రమైన దుమ్ము దూళి తగిలినా ఫోన్‌కు ఎలాంటి డ్యామేజ్ కాదు.
ప్రస్తుతం ఈ ఫోన్ చైనా మార్కెట్లో మాత్రమే లాంచ్ అయింది. అక్కడ దీని ధర వేరియంట్లను బట్టి చూస్తే.. 6GB/256GB మోడల్ రూ.31,000 ఉండగా, 8GB/256GB మోడల్ రూ.35,000 వరకు ఉంది. ఇది డెసర్ట్ బ్రౌన్, ఎవ్రీ స్టెప్ బ్లాసమ్, రైడింగ్ ది వేవ్స్ కలర్స్‌లో వస్తోంది. అయితే, భారత్‌లో లాంచ్‌పై మాత్రం కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Also Read: వాట్సప్‌లో చలాన్ మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేశారో.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!