BigTV English
Advertisement

iPhone 14 @ Rs 1849 Only: రూ.1849కే ఐఫోన్ 14.. ఏకంగా రూ.56 వేలకు పైగా డిస్కౌంట్..!

iPhone 14 @ Rs 1849 Only: రూ.1849కే ఐఫోన్ 14.. ఏకంగా రూ.56 వేలకు పైగా డిస్కౌంట్..!

Buy iPhone 14 @ Rs 1849 Only: ప్రస్తుతం మార్కెట్‌లోకి రకరకాల స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రముఖ మొబైల్ కంపెనీలు అప్డేటెడ్ వెర్షన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కొత్త కొత్త పవర్ ఫుల్ ఫోన్లు మార్కెట్‌లోకి దర్శనమిస్తున్నాయి. అయితే ఎన్ని మోడల్స్, ఎన్ని వెర్షన్‌లు వచ్చినా.. ఐఫోన్‌కు మాత్రం ప్రత్యేక క్రేజ్ ఉంది.


యాపిల్ ఐఫోన్ అంటేనే మొబైల్ ప్రియులు పడిచచ్చిపోతుంటారు. అంత క్రేజ్ ఐఫోన్‌కి. ఫస్ట్ మోడల్ నుంచి ప్రస్తుత మోడల్ వరకూ ఈ ఫోన్‌కి భారీ ఆదరణ ఉంది. మార్కెట్‌లోకి ఐఫోన్ నుంచి కొత్త మోడల్ వస్తుందంటే.. బొలోమని క్యూ కడుతుంటారు. ఇక ఈ ఫోన్ ధర ఏ రేంజ్‌లో ఉన్నా.. కొనేందుకు వెనకడుగు వేయరు. అయితే ఐఫోన్ కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టలేని వారు మాత్రం కాస్త ఆలోచిస్తుంటారు.

డిస్కౌంట్ లేదా ఇతర ఫెస్టివల్ ఆఫర్స్ సేల్ వస్తే అప్పుడు కొనుక్కుందాం అని ప్లాన్ చేసుకుంటుంటారు. అలా ప్లాన్ చేసుకుంటున్న వారికోసం ఓ గుడ్ న్యూస్. ఐఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో కనీ వినీ ఎరుగని రీతిలో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇటీవల ఐఫోన్ 15 సిరీస్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. దాని ముందు మోడల్స్ ధరలు బాగా తగ్గిపోయాయి.


READ MORE: iPhone 15 : ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్ మళ్లీ రాదు..!

ఈ తరుణంలో ఐఫోన్ 12, 13, 14 మోడళ్లు లాంచ్ సమయం ధర కంటే తక్కువ ధరకే లభిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ మోడళ్లలో ఐఫోన్ 14పై ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. తాజా ఆఫర్లలో దీనిని భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. అందువల్ల వాలెంటైన్స్ డేకి తమ ప్రేయసి లేదా ప్రేమికుడికి గిఫ్ట్‌గా ఈ ఫోన్ ఇవ్వాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం అనే చెప్పాలి.

ఐఫోన్ 14 సిరీస్ 2022లో లాంచ్ అయింది. అయితే లాంచ్ సమయంలో ఈ ఫోన్ రూ.79,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఆ తర్వాత ఐఫోన్ 15 సిరీస్ ఎప్పుడైతే లాంచ్ అయిందో.. అప్పుడు ఐఫోన్ 14 ధర రూ.10,000 తగ్గింది. దీంతో అప్పటినుంచి రూ.69,900కే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు తాజా డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ధర రూ.69,900 గా ఉండగా.. 17 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.57,999లకే సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ ఫోన్‌పై ఏకంగా రూ.11,901 డిస్కౌంట్ లభిస్తుందన్న మాట. దీంతో పాటు పలు బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. కస్టమర్లు బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డుల EMI ట్రాన్షక్షన్లపై రూ.1250 తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ ధర రూ.56,749కి అందుబాటులోకి వచ్చింది.

READ MORE: IPHONE: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. 14 సిరీస్‌పై భారీగా డిస్కౌంట్

అయితే ఇవి కాకుండా ఐఫోన్ 14పై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఏకంగా రూ.54,900 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. ఒకవేళ ఇంత మొత్తంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందగలిగితే ఐఫోన్ 14ను కేవలం రూ.1849కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఎక్స్ఛేంజ్ మొత్తం ధర పొందాలంటే పాత ఫోన్ మంచి వర్కింగ్ కండీషన్‌తో పనిచేయాలి. అప్పుడు మాత్రమే ఈ ఫోన్ ఇంత తక్కువ ధరకు పొందగలుగుతారు.

Related News

Samsung Galaxy S26 Ultra: ప్రతి బ్రాండ్‌కి సవాల్ విసిరిన సామ్‌సంగ్.. 220ఎంపి గెలాక్సీ ఎస్26 అల్ట్రా గ్రాండ్ ఎంట్రీ

Oppo Camera Phone: ఓప్పో సూపర్ కెమెరా ఫోన్‌పై రూ.13,000 ఫ్లాట్ డిస్కౌంట్.. ఎక్కడ కొనాలంటే?

Ulefone Tablet Projector: 24,200mAh బ్యాటరీ, ప్రొజెక్టర్‌తో ప్రపంచంలోనే మొదటి టాబ్లెట్‌.. యులెఫోన్ ప్యాడ్ 5 అల్ట్రా లాంచ్

Chrome Running Slow: గూగుల్ క్రోమ్ స్లోగా పనిచేస్తోందా? వెంటనే స్పీడ్ పెంచడానికి ఇలా చేయండి

Amazon iPhone Offers: రూ.50వేల లోపే ఐఫోన్ 16, ఐఫోన్ 15.. ఈ ఒక్క రోజే ఛాన్స్, వెంటనే కొనేయండి

Jio Phone 3 5G: స్మార్ట్‌ఫోన్ ఫీచర్లతో జియో ఫోన్ 3 5జి లాంచ్.. ప్రత్యేకతలు తెలుసుకోండి

Motorola Razr ultra 5G: ఒక ఫోల్డ్‌తో ఫ్యూచర్‌ని చూపించిన మోటరోలా.. రేజర్ అల్ట్రా 5జి వివరాలు

Smartphones Under Rs 10000: తక్కువ ధరలో టాప్ ఫీచర్లు.. రూ.10వేల లోపు బెస్ట్ ఫోన్లు ఇవే..

Big Stories

×