E-Paper
Advertisement

iPhone Discount: రిలయన్స్ డిజిటల్‌ స్పెషల్ ఆఫర్.. అతి తక్కువ ధరలో ఐఫోన్స్.. రూ.34000 భారీ డిస్కౌంట్

iPhone Discount: రిలయన్స్ డిజిటల్‌ స్పెషల్ ఆఫర్.. అతి తక్కువ ధరలో ఐఫోన్స్.. రూ.34000 భారీ డిస్కౌంట్

iPhone Discount| ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. రూ.34000 భారీ ధర తగ్గింపుతో ఆపిల్ ఐఫోన్ 14 లభిస్తోంది. ఈ ఫోన్ పై ఇదే ఇప్పటివరకు అతి తక్కువ ధర. ఈ భారీ డిస్కౌంట్ ప్రీమియం ఐఫోన్‌ను చాలా అఫోర్డబుల్ చేస్తోంది. ఈ డీల్ ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్స్ ఇప్పుడు ఈ ధర ఆఫర్ చేయడం లేదు. ఐఫోన్ పై పెద్ద డిస్కౌంట్ కోసం ఎదురుచూస్తన్న బయర్లకు ఇది మంచి అవకాశం. రిలయన్స్ డిజిటల్ స్ట్రాంగ్ బ్యాంక్ డిస్కౌంట్స్, ఈఎంఐ ఆప్షన్స్ ఇస్తోంది. ఐఫోన్ 14పై ఇప్పటివరకు అతి పెద్ద సేవింగ్స్ ఈ డీల్ ఆఫర్ చేస్తోంది.

రిలయన్స్ డిజిటల్ ఐఫోన్ 14పై అతి పెద్ద ధర తగ్గింపు

రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ 14 భారీ ధర తగ్గింపుతో లిస్ట్ అయింది. ప్రస్తుతం రిలయన్స్ లో దీని ధర రూ.48,403. సెలెక్ట్ బ్యాంక్ కార్డ్స్ ఉపయోగించి ఇన్‌స్టంట్ డిస్కౌంట్ దక్కుతుంది. బ్యాంక్ ఆఫర్ గరిష్టంగా రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఆఫర్ యాప్లై చేస్తే ఎఫెక్టివ్ ధర మరింత తగ్గుతుంది. ఫైనల్ ధర సుమారు రూ.45,403 అవుతుంది. ఆపిల్ ఐఫోన్ 14ను రూ.79,900కు లాంచ్ చేసింది. అంటే ఇప్పుడు రూ.34,000కు పైగా సేవ్ చేసుకోవచ్చు. ఆపిల్ స్మార్ట్‌ఫోన్స్‌పై ఇలాంటి డిస్కౌంట్ అరుదు.

స్టోరేజ్ ఆప్షన్స్ ప్రీమియం డిజైన్

ఆపిల్ ఐఫోన్ 14 క్లాసిక్ నాచ్ డిజైన్‌తో వస్తుంది. ప్రీమియం బిల్డ్ క్వాలిటీని మెయింటైన్ చేస్తుంది. సాలిడ్ బాడీ ఇంకా మోడర్న్, డ్యూరబుల్ అనిపిస్తుంది. మూడు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 128GB, 256 GB, 512GB ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. క్యాజువల్, హెవీ యూజర్లకు ఇవి మంచి ఆప్షన్స్. స్లీక్ డిజైన్ ఐఫోన్ 14ను ఇంకా రెలెవెంట్‌గా ఉంచుతుంది.

డిస్‌ప్లే క్వాలిటీ, స్మూత్ పర్ఫామెన్స్

ఐఫోన్ 14లో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంది. వైబ్రంట్ కలర్స్, డీప్ బ్లాక్ లెవల్స్ ఇస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఆపిల్ ఏ15 బయోనిక్ చిప్‌సెట్‌ ఇందులో ఉంది.ఫాస్ట్, రిలయబుల్ పర్ఫామెన్స్ ఇస్తుంది. డైలీ టాస్క్‌లు స్మూత్, రెస్పాన్సివ్‌గా ఉంటాయి. గేమింగ్, మల్టీటాస్కింగ్ ల్యాగ్ లేకుండా పని చేస్తుంది. iOS 16తో ఇందులో యాప్స్ రన్ అవుతాయి. రాబోయే iOS 26 అప్‌డేట్స్ సపోర్ట్ చేస్తుంది.

కెమెరా పర్ఫామెన్స్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంది

ఆపిల్ ఐఫోన్ 14లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరా 12MP రిజల్యూషన్. వివిధ లైటింగ్ కండిషన్స్‌లో షార్ప్ ఫోటోలు తీస్తుంది. 12MP అల్ట్రావైడ్ లెన్స్ షూటింగ్ ఆప్షన్స్ పెంచుతుంది. పోర్ట్రెయిట్ మోడ్, డెప్త్ కంట్రోల్ ఫోటో క్వాలిటీ మెరుగుపరుస్తాయి. సెల్ఫీలకు 12MP ట్రూడెప్త్ కెమెరా ఉంది. క్లియర్ సెల్ఫీలు, వీడియో కాల్స్ ఇస్తుంది. వీడియో రికార్డింగ్ క్వాలిటీ ఇంకా ఇంప్రెసివ్.

Also Read: మీ స్మార్ట్‌ఫోన్‌లో టైప్ సి కేవలం ఛార్జింగ్ కోసం కాదు.. ఫోన్‌ని పవర్‌బ్యాంక్, పిసీగా మార్చే ట్రిక్స్

బ్యాటరీ, చార్జింగ్, సేఫ్టీ ఫీచర్లు

ఐఫోన్ 14 వైర్డ్, వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మ్యాగ్‌సేఫ్, క్యూఐ2 వైర్‌లెస్ చార్జింగ్ ఉంది. డైలీ యూసేజ్‌కు రిలయబుల్ బ్యాటరీ పర్ఫామెన్స్ ఇస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెంట్. ఫేస్ ఐడీ సెక్యూర్ అన్‌లాకింగ్ ఇస్తుంది. క్రాష్ డిటెక్షన్ ఎమర్జెన్సీల్లో ఎక్స్ట్రా సేఫ్టీ యాడ్ చేస్తుంది. డైలీ కన్వీనియన్స్, ప్రొటెక్షన్ మెరుగుపరుస్తాయి.

ఇప్పుడు ఐఫోన్ 14 కొనాలా?

ప్రస్తుత డీల్ ఐఫోన్ 14ను చాలా ఆకర్షణీయం చేస్తోంది. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు దక్కుతాయి. ఆపిల్ ఫ్యాన్స్ అప్‌గ్రేడ్ చేయడానికి ఇది సరైన సమయం.

Related News

ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఈ 5 కారణాలే కావచ్చు!

గూగుల్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇంటర్నెట్ లేకున్నా లోకల్ PCలో ఏఐ ఫీచర్లు.. ఎలాగో తెలుసా?

ఇల్లంతా చల్లగా ఉండాలా.. సెంట్రలైజ్డ్ ఏసీ బెస్ట్ భయ్యా.. కాకపోతే!

అబ్బా ఏం ఆఫర్..శాంసంగ్ లేటెస్ట్ 5G ఫోన్ ధర భారీగా తగ్గింది.. ఇక మీదే ఆలస్యం!

సైలెంట్‌గా మొబైల్ మార్కెట్‌లో దిగిన Honor X7e.. ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కుయండి!

కదిలే ఏసీ కావాలా? 2026లో టాప్ ఇవే.. ఎక్కడకెళ్లినా మీ వెంటే!

యాడ్స్, బ్లోట్‌వేర్ లేని బెస్ట్ 5G ఫోన్.. రూ.12 వేల లోపే లాంచ్ చేసిన లావా!

Window vs Split vs Studio AC: రూమ్ చిన్నదా.. బడ్జెట్ తక్కువనా.. సామాన్యులకు వీటిలో ఏది పర్ఫెక్ట్ ఏసీ?

Big Stories

×