E-Paper
Advertisement

Karregutta: టెన్షన్ టెన్షన్.. కర్రెగుట్టల్లో భారీగా బయటపడుతున్న IED బాంబులు

Karregutta: టెన్షన్ టెన్షన్.. కర్రెగుట్టల్లో భారీగా బయటపడుతున్న IED బాంబులు
Advertisement

Karregutta: కర్రెగుట్టల్లో భారీగా IED బాంబులు కలకలం. పామునూరు శివారులోని కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు భారీగా అమర్చిన ఐఈడీ (IED) బాంబులను భద్రతా బలగాలు గుర్తించాయి. రోడ్డు నిర్మాణ పనుల భద్రతను పర్యవేక్షిస్తున్న RSCO బృందాలు అధునాతన పరికరాలతో తనిఖీలు చేపట్టగా, భూమిలో పాతిపెట్టిన మందుపాతరలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

పామునూరు శివారులో ఇప్పటివరకు సుమారు 100కు పైగా ఐఈడీలను సాయుధ బలగాలు వెలికితీశాయి. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ కర్రెగుట్టల పరిసర ప్రాంతాల్లో సుమారు వెయ్యికి పైగా బాంబులు భూగర్భంలో ఉండే అవకాశం ఉందని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. రహదారి నిర్మాణాన్ని అడ్డుకోవడానికి, బలగాల కదలికలను నిలువరించడానికి గతంలోనే వీటిని అత్యంత వ్యూహాత్మకంగా అమర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతమంతా ఒక “మైన్ ఫీల్డ్”ను తలపిస్తోంది.

Advertisement

అక్కడి ప్రాంతంలో మొత్తం ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, సాయుధ బలగాల పర్యవేక్షణలో రహదారి పనులు ఏమాత్రం ఆగకుండా సాగుతున్నాయి. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సాయంతో ఎప్పటికప్పుడు బయటపడుతున్న ఐఈడీలను క్షేత్రస్థాయిలోనే నిర్వీర్యం (Defuse) చేస్తున్నారు. మొర్మూరు బేస్ క్యాంప్ నుండి ఉన్నతాధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తూ, కూలీలకు, యంత్రాలకు ఎటువంటి ప్రాణహాని కలగకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

Also Read: హైదరాబాద్‌లో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌పై పోలీసుల మెరుపు దాడి!

Advertisement

కొండలు, గుట్టల మధ్య ఉన్న ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యం కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న చోట అడ్డంకులు ఎదురైనా, జవాన్ల పహారాలో పనులు కొనసాగించడం విశేషం. భూమిలో దాగి ఉన్న మృత్యుపాశాలను తొలగిస్తూ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేస్తున్న భద్రతా బలగాల సాహసాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×