E-Paper
Advertisement

DC Vs MIE : పొలార్డ్ విధ్వంసం.. ఒకే ఓవ‌ర్ లో 6, 4, 2, 6, 6, 6

DC Vs MIE : పొలార్డ్ విధ్వంసం.. ఒకే ఓవ‌ర్ లో 6, 4, 2, 6, 6, 6
Advertisement

DCP Vs MIE :  సాధార‌ణంగా క్రికెట్ ఎప్పుడూ ఏ ఆట‌గాడు ఫామ్ లో కొన‌సాగుతాడో చెప్ప‌లేము. మంచి ఆట‌గాళ్లు అద‌రూ మంచి ఫామ్ లో ఉంటార‌ని కొన్ని ఫ్రాంచైజీల య‌జ‌మానులు ఏరికోరి జ‌ట్లను కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేస్తుంటారు. మ‌రికొంద‌రూ మాత్రం త‌క్కువ ధ‌ర‌కే మెరుగైన ఆట‌గాడిని కొనుగోలు చేస్తుంటారు. అధిక ధ‌ర పెట్టిన ఆట‌గాళ్లు విఫ‌లం చెందితే.. నామ‌మాత్ర‌పు ధ‌ర‌కు కొనుగోలు చేసిన ఆట‌గాళ్లు మాత్రం విధ్వంసం చేస్తుంటారు. ఇది మ‌నం ప్ర‌తీ లీగ్ లో కూడా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇంట‌ర్నేష‌న‌ల్ లీగ్ టీ 20 లో దుబాయ్ క్యాపిట‌ల్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో MI ఎమిరేట్స్ కెప్టెన్ పోలార్డ్(44) నాటౌట్ గా నిలిచి విధ్వంసం సృష్టించాడు. ముఖ్యంగా వకార్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవ‌ర్ లో ఏకంగా 30 ప‌రుగులు చేశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఆరు బంతుల్లో 6, 4, 2, 6, 6, 6 ర‌న్స్ చేశారు.

Also Read : Vijay Hazare Trophy : విరాట్ నే దాటేశారు.. విజ‌య్ హ‌జారే ట్రోఫీలో టాప్-5 బ్యాట‌ర్లు వీరే..!

సునాయ‌సంగా విజ‌యం సాధించిన MI ఎమిరేట్స్

Advertisement

పొలార్డ్ దూకుడుతో ముంబై ఎమిరేట్స్ 16.4 ఓవ‌ర్ల‌లోనే 126 2 విజ‌యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిట‌ల్స్ 20 ఓవ‌ర్ల‌లో 122 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఈ విజ‌యం తో ముంబై క్వాలిఫ‌ర‌య్ 1 కి చేరింది. పొలార్డ్ తన పవర్ హిట్టింగ్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. ఇది ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేయడమే కాకుండా, ప్రత్యర్థి జట్టు ముఖ్య బౌలర్‌ను లక్ష్యంగా చేసుకోవడం విశేషం.ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిట‌ల్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 122 ప‌రుగులు చేసింది. సాదిక్వుల్లా అట‌ల్ 7, వికెట్ కీప‌ర్ శాయ‌న్ జ‌హంగీర్ 17, జోర్డాన్ 13, లూయిస్ డూ ప్లే 3, రోమ‌న్ పావెల్ 8, న‌బీ 22, జెమ్స్ నీష‌మ్ 21, విల్లీ 2, స్కాట్ క‌ర్రీ 15, హైద‌ర్ అలీ 3 ప‌రుగులు చేశారు. ఫ‌జ‌ల్లా ఫ‌రూఖీ 4 ఓవ‌ర్లు వేసి 23 ప‌రుగులు చేసి 1 వికెట్ తీసుకున్నాడు. గ‌జేంద‌ర్ 4 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు తీసుకున్నాడు. 28 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ష‌కీబ్ 1, మౌస్లే 1, అరాబ్ గుల్ మోమండ్ 1 చొప్పున వికెట్లు తీసుకున్నారు. MI ఎమిరేట్స్ 123 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగింది. 16.4 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ల‌క్ష్యాన్ని సున‌యాసంగా ఛేదించింది.

పొలార్డ్ విధ్వంసం..

Advertisement

MI ఎమిరేట్స్ ఓపెన‌ర్ ముహ‌మ్మ‌ద్ వాసీమ్ 19 బంతుల్లో 27 ప‌రుగులు చేశాడు. ఆండ్రె ఫ్లెచ‌ర్ 30 బంతుల్లో 21 ప‌రుగులు చేశాడు. టామ్ బాంట‌న్ 20 బంతుల్లో 28 ప‌రుగులు చేశాడు. కీర‌న్ పొలార్డ్ 31 బంతుల్లో 44 ప‌రుగులు చేశాడు. ముఖ్యంగా ఒకే ఓవ‌ర్ లో 6, 4, 2, 6, 6, 6 30 ప‌రుగులు చేయ‌డం ఓ రికార్డు అనే చెప్పాలి. దుబాయ్ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ల‌లో డేవిడ్ విల్లీ 2 ఓవ‌ర్లు వేసి 32 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. హైద‌ర్ ఒక్క‌డే 1 వికెట్ తీసుకున్నాడు. వాక‌ర్ స‌లాంఖెలీ 4 ఓవ‌ర్లలో 43 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. అయితే 3 ఓవ‌ర్లు బాగానే వేసిన‌ప్ప‌టికీ.. 4 ఓవ‌ర్ మాత్రం 30 ప‌రుగులు స‌మ‌ర్పించుకోవ‌డం విశేషం. ఇదే ఊపు కొన‌సాగిస్తే మ‌రోసారి MI ఎమిరేట్స్ ట్రోఫీ గెలుచుకునే అవ‌కాశం ఉంది.

Also Read : INDW Vs SLW : నేడు భార‌త్-శ్రీలంక మ‌ధ్య నాలుగో టీ20.. ఈ మ్యాచ్ ని ఎక్క‌డ చూడాలంటే..?

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×