iPhone 15 Offers: సాధారణంగా యాపిల్ ప్రొడక్ట్స్ ధరలు ఎప్పుడూ కాస్త ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా ఐఫోన్ ప్రియులు అయితే మార్కెట్లోకి వచ్చిన కొత్త సిరీస్‌లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని చూస్తుంటారు. అయితే ఎంత ఇష్టమున్నా.. ఐఫోన్ ధర ఎక్కువని ఆండ్రాయిడ్ ఫోన్లతోనే సర్దుకుపోతుంటారు. ఇప్పుడు ఎంతోమంది డ్రీమ్ iPhone 15ను ఒక మిడ్‌రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్ ధరకే కొనే ఛాన్స్ వచ్చేసింది. ప్రముఖ రిటైలర్ విజయ్ సేల్స్ నిర్వహిస్తున్న ‘Apple Days Sale’లో ఈ ఫోన్‌పై కనీవినీ ఎరుగని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
మార్కెట్లో ప్రస్తుతం ఐఫోన్ 15 (128GB) ధర రూ.59,900 వరకు ఉంది. కానీ, విజయ్ సేల్స్ సేల్‌లో భాగంగా నేరుగా రూ.2,000 తగ్గించి రూ.56,900కే ఇస్తున్నారు. అంతేకాదు.. SBI, ICICI, Axis బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే.. మరో రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ వాడకపోయినా ఐఫోన్ 15రూ.54,900కే వచ్చేస్తుందన్నమాట.
Also Read: రూ.4,000 లోపు బెస్ట్ BLDC ఫ్యాన్లు.. 60 శాతం వరకు కరెంటును ఆదా చేసుకోవచ్చు!
ఇప్పటికే మీరు వాడుతున్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. విజయ్ సేల్స్ అదనంగా రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తోంది. ఉదాహరణకు.. మీ పాత ఫోన్‌కు మార్కెట్ ధర రూ.10,000 అనుకుందాం.. దానికి ఈ బోనస్ రూ.10,000 కలిపితే మొత్తం రూ.20,000 తగ్గిపోతుంది. దీంతో అన్నీ కలిపి చూసుకుంటే ఐఫోన్ 15 కేవలం రూ.34,900కే మీ సొంతం అవుతుంది. అయితే.. మీ పాత ఫోన్ కండిషన్ ఎంత బాగుంటే అంత ఎక్కువ విలువ వస్తుందని గుర్తుంచుకోండి.
ఈ iPhone ఐఫోన్ 15 విడుదలై చాలా రోజులు అయినప్పటికీ.. ఫీచర్లు మాత్రం ఇప్పటికీ టాప్ క్లాస్‌లో ఉన్నాయి. కొత్త మోడల్స్‌లో ఉండే డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఇందులో కూడా ఉంది. అలాగే మనం ఎప్పటి నుంచో కోరుకుంటున్న టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ కూడా దీనికి ఉంది. ఇక డిస్‌ప్లే పరంగా ఇది 1600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీంతో ఎండలో ఫోన్ చూసినా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
దీనిలో ఉన్న A16 బయోనిక్ చిప్ వల్ల ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. ఇక కెమెరా గురించి చెప్పక్కర్లేదు.. 48MP మెయిన్ కెమెరాతో తీసే ఫొటోలు, వీడియోలు ప్రొఫెషనల్ రేంజ్‌లో ఉంటాయి. iPhone 16తో పోల్చినా సాధారణ యూజర్లకు పెద్దగా తేడాలు ఏమీ అనిపించవు. తక్కువ బడ్జెట్‌లో ఐఫోన్ సొంతం చేసుకోవాలంటే ఇంతకంటే మంచి సమయం రాదు. ఏప్రిల్ 16 వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది కాబట్టి.. కొనే ఆలోచన ఉంటే వెంటనే ఆర్డర్ చేసేయండి.
Also Read: ఇదెక్కడి వింత.. గ్యాస్ లేకున్నా బ్లూ కలర్ మంట! ఈ ప్లాస్మా పొయ్యి ధర, కథా కమామిషు మీ కోసం..
ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.