Plasma Electric Stove: అక్కడెక్కడో పశ్చిమాసియాలో వార్ జరుగుతుంటే మన దేశంలో గ్యాస్ కొరత, సిలిండర్ ధరల పెంపు వంటి సమస్యలు సామాన్యులను వేధిస్తున్నాయి. అమాంతం పెరిగిపోతున్న రేట్లు ఒకవైపు.. సిలిండర్ అయిపోతే బుక్ చేసుకోవడం, అది వచ్చేదాకా ఎదురుచూడటం ఇంకోవైపు. వీటన్నింటికీ చెక్ పెడుతూ సరికొత్తగా ‘ప్లాస్మా ఎలక్ట్రిక్ స్టవ్’ మార్కెట్లోకి వస్తోంది. కరెంట్‌తోనే గ్యాస్ పొయ్యి లాంటి మంటను పుట్టించడం దీని ప్రత్యేకత.
మామూలుగా కరెంట్ పొయ్యి అంటే మనకు ఇండక్షన్ స్టవ్ గుర్తొస్తుంది. దాని మీద మంట రాదు.. కేవలం ప్లేట్ వేడెక్కుతుంది. కానీ ఈ ప్లాస్మా స్టవ్ అలా కాదు. ఇది కరెంట్‌ను వాడుకుని గాలిని వేడి చేసి, అసలైన మంటను సృష్టిస్తుంది. దీంతో గ్యాస్ లేకపోయినా మనకు పొయ్యి వెలిగించినట్టే మంట వస్తుందన్నమాట. ఎలాంటి ఇంధనం అవసరం లేకుండానే కేవలం విద్యుత్తుతోనే ఇంతటి వేడిని పుట్టించడం ఈ టెక్నాలజీ గొప్పతనం.
Also Read: రూ.4,000 లోపు బెస్ట్ BLDC ఫ్యాన్లు.. 60 శాతం వరకు కరెంటును ఆదా చేసుకోవచ్చు!
మనం ఇంట్లో వాడే గ్యాస్ పొయ్యి కంటే ఇది చాలా పవర్‌ఫుల్ అని చెప్పొచ్చు. గ్యాస్ స్టవ్ ఇచ్చే వేడి కంటే ఇది చాలా ఎక్కువ వేడిని ఇస్తుంది. దీనివల్ల వంట చాలా త్వరగా అయిపోతుంది. ఇండక్షన్ స్టవ్‌లపై అన్ని రకాల గిన్నెలు పెట్టలేం. కానీ ఈ ప్లాస్మా పొయ్యి మీద మాత్రం మన పాత పద్ధతిలో ఇనుప బాండీలు, స్టీలు గిన్నెలు, అల్యూమినియం పాత్రలు.. ఇలా ఏదైనా వాడుకోవచ్చు. చపాతీలు కాల్చాలన్నా, తాలింపు వేయాలన్నా గ్యాస్ పొయ్యి మీద చేసినట్టే హాయిగా చేసుకోవచ్చు.
ప్రస్తుతం దీని ధర దాదాపు రూ.35వేల వరకు ఉంది. మొదట్లో కొంచెం ఖరీదు అనిపించినా.. లాంగ్ రన్‌లోకి వచ్చేసరికి గ్యాస్ ఖర్చులతో పోలిస్తే ఇది చాలా లాభదాయకం. ముఖ్యంగా ఇంట్లో సోలార్ పవర్ ఉన్నవాళ్లకైతే అసలు వంట ఖర్చే ఉండదు. గ్యాస్ లీకవుతుందనే భయం లేదు, మసి పట్టదు, గది కూడా వేడెక్కదు. రాబోయే రోజుల్లో ఈ ప్లాస్మా స్టవ్ ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుందనడంలో సందేహం లేదు. సిలిండర్ బుక్ చేసే కష్టాల నుంచి మన ఆడవాళ్లకు ఇది పెద్ద ఉపశమనం కానుంది.
Also Read: ఐఫోన్ యూజర్లకు షాక్.. యాపిల్ నుంచి ఊహించని నిర్ణయం, ఇంతకీ ఏమైందంటే?
ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. సోషల్ మీడియాలో వచ్చే లింకులను క్లిక్ చేసి.. అడ్వాన్సులు చెల్లించి మోసపోవద్దు. పొడక్ట్ మీ ఇంటికి చేరి.. పనిచేస్తుందో లేదో సరిచూసుకున్నాకే చెల్లింపులు చెయ్యండి.