E-Paper
Advertisement

iPhone 16 Discount: బెస్ట్ సెల్లింగ్ ఐఫోన్‌ రూ.50000కే.. బంపర్ ఆఫర్ ఎక్కడంటే

iPhone 16 Discount: బెస్ట్ సెల్లింగ్ ఐఫోన్‌ రూ.50000కే.. బంపర్ ఆఫర్ ఎక్కడంటే
Advertisement

iPhone 16 Discount| ఆపిల్ కంపెనీ తయారు చేసే ఐఫోన్స్‌లో అత్యధికంగా అమ్ముడుపోయే ఐపోన్ 16 ధర ఇప్పుడు భారతీయ మార్కెట్లో భారీగా తగ్గింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న మొబైల్ మహోత్సవ్ సేల్‌లో ఈ ఫోన్‌పై సుమారు రూ. 20,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ రూ. 79,900 ధర వచ్చిన ఈ ఫోన్, ఇప్పుడు చాలా మందికి అందుబాటు ధరలో ఉంది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ప్రస్తుత ధర ఎంత?

ఆపిల్ 2024లో ఐఫోన్ 16ను లాంచ్ చేసింది. అప్పుడు బేస్ వేరియంట్ ధర రూ. 79,900గా ఉంది. ఐఫోన్ 17 లాంచ్ అయిన తర్వాత ఐఫోన్ 16 ధర రూ.10,000 తగ్గింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్ కేవలం రూ. 60,900కే లిస్ట్ అయింది. అంటే లాంచ్ ధరతో పోలిస్తే ఇప్పటివరకు అతి తక్కువ ధర ఇదే. ఇలా మొత్తం రూ. 19,000 వరకు తగ్గింది.

అదనపు ఆఫర్లతో మరింత సేవింగ్స్

Advertisement

కేవలం ధర తగ్గింపుతోనే సరిపోదు. ఫ్లిప్‌కార్ట్‌లో పాత ఫోన్ ఇచ్చి కొత్త ఐఫోన్ 16 కొంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది. మీ పాత ఫోన్ కండిషన్ బట్టి ఎక్స్ఛేంజ్ వాల్యూ దొరుకుతుంది. దీంతో ఫోన్ ధర దాదాపు రూ. 50,000 వరకు తగ్గే అవకాశం ఉంది. అలాగే కొన్ని బ్యాంకుల కార్డులతో చెల్లిస్తే అదనపు డిస్కౌంట్ కూడా దక్కుతుంది.

ఐఫోన్ 17పై కూడా డిస్కౌంట్

ఐఫోన్ 16తో పాటు కొత్తగా వచ్చిన ఐఫోన్ 17 కూడా తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ లేటెస్ట్ మోడల్‌పై రూ. 7,000 డిస్కౌంట్ ఇస్తోంది. దీనిపై కూడా బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వర్తిస్తాయి. దాంతో కొనుగోలుదారులకు రెండు మంచి ఆప్షన్లు లభిస్తున్నాయి.

డిస్ప్లే, డిజైన్ ఎలా ఉన్నాయి?

Advertisement

ఐఫోన్ 16లో 6.1-అంగుళాల OLED సూపర్ XDR డిస్ప్లే ఉంది. ఇది చాలా బ్రైట్‌గా, క్లియర్‌గా ఉంటుంది. డైనమిక్ ఐలాండ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఇది నోటిఫికేషన్లు, మల్టీటాస్కింగ్‌ను సులభతరం చేస్తుంది. సినిమాటిక్ వీడియో రికార్డింగ్ సౌకర్యం కూడా ఉంది.

పర్‌ఫామెన్స్, కెమెరా ఎలా ఉన్నాయి?

ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ A18 బయోనిక్ చిప్‸సెట్ ఉంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ సమయంలో ఈ ప్రాసెసర్ స్మూత్ పర్‌ఫామెన్స్ అందిస్తుంది. వెనకవైపు 48MP ప్రైమరీ, 12MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. iOS 18తో పనిచేసే ఈ ఫోన్‌లో AI ఫీచర్లు కూడా ఉన్నాయి.

రూ. 60,900 ధరతో ఐఫోన్ 16 ప్రస్తుతం మంచి డిమాండ్‌లో ఉంది. ప్రీమియం ఫోన్ కావాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

ముఖ్య గమనిక: ఈ కథనంలో మీకు తెలిసిన ఐఫోన్ 16 ధరలు.. ఆపిల్ కంపెనీ ఇచ్చే ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. మీరు ఐఫోన్స్ కొనుగోలు చేసేసమయంలో చెక్ చేసుకొని కొనాలని సూచన. మీరు కొనుగోలు చేసే సమయానికి పైన పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. అందుకోసం ‘బిగ్ టీవీ’ ఈ విషయాలకు బాధ్యత వహించదు. ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×