E-Paper
Advertisement

iPhone 16 Plus Discount: ఐఫోన్ 16 ప్లస్ పై రూ.25,000 భారీ డిస్కౌంట్.. ఎక్కడ కొనుగోలు చేయాలంటే..

iPhone 16 Plus Discount: ఐఫోన్ 16 ప్లస్ పై రూ.25,000 భారీ డిస్కౌంట్.. ఎక్కడ కొనుగోలు చేయాలంటే..

iPhone 16 Plus Discount| మంచి ఐఫోన్ కొనాలని ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. ఐఫోన్ 16 ప్లస్ ధర భారీగా తగ్గింది. కొత్త ఆఫర్ లో దాదాపు రూ.25,000 వరకు ఈ ప్రీమియం ఫోన్ కొనుగోలుపై తగ్గింపు పొందవచ్చు. ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆఫర్. ఈ ఆఫర్ తో ఐఫోన్ 16 ప్లస్ చాలా తక్కువ ధరకు దొరుకుతోంది. ఈ ఆఫర్, ఈ ఐఫోన్ ఫీచర్ల వివరాలు ఒకసారి చూద్దాం.

iPhone 16 Plus ముఖ్య ఫీచర్లు

ఆపిల్ కంపెనీ గత సంవత్సరం సెప్టెంబర్ లో ఐఫోన్ 16 ప్లస్‌ని లాంచ్ చేసింది. ఇందులో పెద్ద 6.7 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్ ప్లే ఉంది. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఫోన్ లో పవర్ ఫుల్ Apple A18 చిప్ సెట్ ఉంది. ఈ చిప్ వల్ల ఆపిల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త ఫీచర్లు, మల్టీటాస్కింగ్ అన్నీ స్మూత్ గా జరుగుతాయి. ఫోన్ బాడీ అల్యూమినియం ఫ్రేమ్ తో చాలా బలంగా ఉంటుంది. IP68 రేటింగ్ తో నీరు, దుమ్ము నుంచి రక్షణ కూడా ఉంది.

కెమెరా విషయానికి వస్తే.. వెనకవైపు 48MP ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ముందు సెల్ఫీ కెమెరా 12 మెగాపిక్సల్. ఫోటోలు, వీడియోలు సూపర్బ్ గా వస్తాయి. బ్యాటరీ చాలా బాగుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ఇస్తుంది. మొత్తంగా ఈ ఫోన్ ప్రీమియం ఫీల్ ఇచ్చే డిజైన్, స్పీడ్, కెమెరా, బ్యాటరీ.. అన్నీ టాప్ క్లాస్!

రిలయన్స్ డిజిటల్ అద్భుతమైన ఆఫర్

ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.89,900 ఉండేది. కానీ ఇప్పుడు రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో కేవలం రూ.68,990 కే లభిస్తోంది. అంటే నేరుగా రూ.21,000 డిస్కౌంట్! ఇంకా తక్కువ ధరకు పొందే అవకాశం కూడా ఉంది. IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో EMI పద్ధతిలో కొనుగోలు చేస్తే అదనంగా రూ.4,000 డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు ఫైనల్ ధర కేవలం రూ.64,990కే వచ్చేస్తుంది. అంటే మొత్తం మీద రూ.25,000 వరకూ భారీ డిస్కౌంట్. ఇంత తక్కువ ధరకు ఒక ప్రీమియం ఐఫోన్ ఎప్పుడూ దొరకదు!

పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసి ఇంకా తగ్గించుకోండి

మీ దగ్గర పాత స్మార్ట్ ఫోన్ ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసి మరింత డిస్కౌంట్ పొందవచ్చు. పాత ఫోన్ కండీషన్ బట్టి ఎక్స్చేంజ్ వాల్యూ మారుతుంది. ఇలా చేస్తే ధర ఇంకా తగ్గుతుంది.

ఈ ఆఫర్ త్వరగా వినియోగించుకోండి

ఐఫోన్ పై ఇంత భారీ డిస్కౌంట్ ఉండడం ఇదే తొలిసారి. ఇలాంటి ఆఫర్లు సాధారణంగా కొద్ది రోజులే ఉంటాయి. ప్రీమియం ఐఫోన్‌ని ఇంత చవకగా కొనే అవకాశం మళ్లీ రాదు. త్వరగా రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్ కు వెళ్లి వెంటనే ఆఫర్ చేజిక్కించుకోండి.

Also Read: ముందు ఉపయోగించండి ఆ తరువాతే కొనండి.. ఇండియన్ స్మార్‌ఫోన్ కంపెనీ వింత ఆఫర్

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×