iPhone 17 Price Drop: గతేడాది విడుదలైన iPhone 17 కొనాలని చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారా? అయితే మీకొక గుడ్ న్యూస్. మామూలుగా యాపిల్ లేటెస్ట్ మోడల్ అంటే రూ.లక్షకు పైనే ఉంటుంది కదా అని వెనకడుగు వేస్తుంటాం. కానీ ఇప్పుడు క్రోమా సేల్‌లో iPhone 17 పై ఊహించని ఆఫర్లు నడుస్తున్నాయి. అన్ని రకాల బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు కలుపుకుంటే ఈ ప్రీమియం ఫోన్ కేవలం రూ.44,768కే వచ్చేస్తోంది. ఇంత తక్కువ ధరకు ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఎలా వస్తుంది? ఆ లెక్కలేంటో ఒకసారి చూద్దాం.
క్రోమాలో ఐఫోన్ 17 బేస్ వేరియంట్ (256GB) అసలు ధర రూ.82,900గా ఉంది. దీని మీద నేరుగా రూ.1,658 కూపన్ డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీరు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే, దాని కండిషన్ బాగుంటే సుమారు రూ.23,500 వరకు వాల్యూ పొందొచ్చు. దీనికి తోడు క్రోమా అదనంగా మరో రూ.8,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా ఇస్తోంది.
ఇవి కాకుండా టాటా నియో కాయిన్స్ రూపంలో ఇంకో రూ.4,974 వరకు బెనిఫిట్ ఉంటుంది. ఇవన్నీ తీసేస్తే ఫోన్ ధర రూ.45వేల లోపుకు పడిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆండ్రాయిడ్ ఫోన్ల ధరకే లేటెస్ట్ ఐఫోన్ వచ్చేస్తోంది.
Also Read: ఐఫోన్ లవర్స్ ఎగిరి గంతేసే డిస్కౌంట్.. Apple Airపై ఏకంగా రూ.30,000 ధర తగ్గింపు!
ఐఫోన్ 17లో యాపిల్ కొన్ని క్రేజీ ఫీచర్లు ఇచ్చింది. ముఖ్యంగా బేస్ మోడల్‌లో కూడా మొదటిసారిగా 120Hz రిఫ్రెష్ రేట్‌ను తీసుకొచ్చింది. 6.3 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో ఫోన్ చూడటానికి చాలా రిచ్‌గా ఉంటుంది.
ఇక ఆ ప్రొమోషన్ టెక్నాలజీ వల్ల స్క్రీన్ మీద టచ్ చాలా స్మూత్‌గా, ఫాస్ట్‌గా అనిపిస్తుంది. మండుటెండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను దీనిలో సెట్ చేశారు. దీనివల్ల వీడియోలు చూసినా, గేమ్స్ ఆడినా నెక్స్ట్ లెవల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది.
యాపిల్ తన పవర్‌ఫుల్ A19 చిప్‌సెట్‌ను ఈ ఫోన్‌లో వాడింది. ఇది ఫోన్ స్పీడ్‌ను పెంచడమే కాదు.. బ్యాటరీ లైఫ్‌ను కూడా సేవ్ చేస్తుంది. ఫోన్ ఎంత వాడినా హ్యాంగ్ అవ్వకుండా, ఇంటెలిజెన్స్ ఫీచర్లను ఈజీగా రన్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు రెండు 48MP కెమెరాలు ఉన్నాయి. దీంతో ఫొటోలు ప్రొఫెషనల్ కెమెరా రేంజ్‌లో వస్తాయి. ఇక సెల్ఫీల కోసం 18MP కెమెరాను ఇచ్చారు. అలాగే స్టోరేజ్ కూడా ఈసారి 256GB నుంచి అందుబాటులో ఉండటం మంచి విషయం. తక్కువ ధరలో అది కూడా ఐఫోన్ 17 రావడం అనేది నిజంగా గొప్ప విషయమే.
Also Read: బాబోయ్.. ఇంత పెద్ద టీవీనా? LG 115 అంగుళాల స్మార్ట్ టీవీ లాంచ్.. గేమర్లకు ఇక పండగే!