E-Paper
Advertisement

భర్తను కాదని నచ్చిన వాడితో ఉండొచ్చు… కోర్టు సంచ‌ల‌న తీర్పు

భర్తను కాదని నచ్చిన వాడితో ఉండొచ్చు…  కోర్టు సంచ‌ల‌న తీర్పు
Advertisement

High Court Supports Womans Choice: వ్యక్తిగత స్వేచ్ఛ.. మహిళా సాధికారతకు సంబంధించి ఒక సంచలన తీర్పును మధ్యప్రదేశ్ హైకోర్టు వెలువరించింది. వివాహం జరిగినప్పటికీ, తనకంటే రెట్టింపు వయసున్న భర్తతో ఉండలేనని, తనకు నచ్చిన వ్యక్తితో స్వతంత్రంగా జీవిస్తానని స్పష్టం చేసిన 19 ఏళ్ల వివాహిత నిర్ణయానికి న్యాయస్థానం చట్టబద్ధత కల్పించింది. జస్టిస్ ఆనంద్ పాఠక్, జస్టిస్ పుష్పేంద్ర యాదవ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఏప్రిల్ 2న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

తన భార్యను ఒక యువకుడు బంధించాడంటూ ఆమె భర్త దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, కోర్టులో తన భర్త, తల్లిదండ్రుల సమక్షంలోనే సదరు మహిళ ధైర్యంగా వాంగ్మూలం ఇచ్చింది. తన 40 ఏళ్ల భర్త తనను వేధిస్తున్నాడని, తన క్షేమాన్ని కోరుకోని తల్లిదండ్రుల వద్దకు కూడా వెళ్లడం ఇష్టం లేదని ఆమె తేల్చి చెప్పింది. ప్రస్తుతం తాను ఉంటున్న వ్యక్తి తనకు కావాల్సిన స్వేచ్ఛను ఇస్తున్నాడని, అతనితోనే కలిసి ఉంటానని స్పష్టం చేసింది.

Advertisement

కోర్టు నియమించిన ప్రభుత్వ న్యాయవాది అంజలి జ్ఞానాని ఆమెకు ప్రైవేటుగా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ సమయంలోనూ సదరు మహిళ తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు. సామరస్యం లేని వివాహ బంధం నుండి బయటకు రావడమే తన లక్ష్యమని ఆమె పేర్కొంది. ఆమెతో కలిసి ఉంటున్న యువకుడు కూడా ఆమెను వివాహం చేసుకుంటానని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని కోర్టుకు హామీ ఇచ్చారు. అయితే, ఆమె భద్రతను దృష్టిలో ఉంచుకుని కోర్టు “శౌర్య దీది” విధానాన్ని అమలు చేయాలని ఆదేశించింది.

2024లో ‘హరచంద్ గుర్జర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ’ కేసులో గ్వాలియర్ బెంచ్ ఈ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఒక మహిళా పోలీసు అధికారి లేదా అర్హత కలిగిన వ్యక్తిని బాధితురాలికి మెంటార్‌గా (మార్గదర్శిగా) నియమిస్తారు. ఆ మహిళకు ఆరు నెలల పాటు రక్షణ.. మద్దతు అందించడం వీరి బాధ్యత. లైంగిక నేరాలకు గురైన వారు లేదా రక్షణ అవసరమైన మహిళలకు ఈ విధానం అండగా నిలుస్తుంది. ఈ కేసులో న్యాయవాది అంజలి.. కానిస్టేబుల్ భావనను ఆమెకు శౌర్య దీదీలుగా నియమించి, నిరంతరం పర్యవేక్షించాలని కోర్టు ఆదేశించింది.

Advertisement

భారత రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తి తన ఇష్టప్రకారం ఎక్కడ ఉండాలో, ఎవరితో ఉండాలో నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛ కలిగి ఉంటారని జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. వివాహం జరిగినంత మాత్రాన ఒక మహిళను ఆమె ఇష్టానికి విరుద్ధంగా భర్త వద్దే ఉండాలని బలవంతం చేయలేమని కోర్టు తేల్చి చెప్పింది. మేజర్ అయిన వ్యక్తి తన ఇష్టప్రకారం జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని, ఒక మహిళ తన నిర్ణయాన్ని స్వచ్ఛందంగా తీసుకున్నప్పుడు ఆమెను బలవంతం చేయలేమని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.

Read Also: రికార్డు స్థాయిలో సిలిండర్ల డెలివరీ.. నిల్వలు పుష్కలం, ఎల్పీజీ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×