iPhone 18 Pro: యాపిల్ నుంచి వచ్చే కొత్త ఐఫోన్‌లో కలర్ ఎంపికలు కూడా ఫోన్ ఫీచర్లంతే ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ప్రో మోడళ్లలో బ్లాక్ కలర్ కోసం ఎదురుచూస్తున్న వారికి తాజా లీక్ కాస్త నిరాశ కలిగించేలా ఉంది. iPhone 18 Pro, Pro Maxలో బ్లాక్ ఫినిష్ ఉండకపోవచ్చని మరోసారి వార్తలు వస్తున్నాయి. తాజాగా బయటకు వచ్చిన కొన్ని పార్ట్స్ ఈ అంచనాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
ప్రముఖ లీకర్ షేర్ చేసిన చిత్రాల్లో iPhone 18 Proకు సంబంధించిన సిమ్ కార్డ్ ట్రేలు కనిపించాయి. వీటిలో సిల్వర్, డార్క్ చెర్రీ, స్కై బ్లూ రంగులు కనిపిస్తున్నాయి. ఈ మూడు రంగుల్లో బ్లాక్ మాత్రం కనిపించలేదు. సిల్వర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే.. గతంలో ఈ రంగును యాపిల్ రద్దు చేసిందనే సమాచారం వచ్చింది.
Also Read: కొత్త టీవీని గోడకు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ 5 విషయాలు ముందే తెలుసుకోండి!
ఇంతకుముందు లీకర్ షేర్ చేసిన iPhone 18 Pro డమ్మీ యూనిట్లలో బ్లాక్ మోడల్ కూడా కనిపించింది. అయితే దీనిపై ఆయన ఇచ్చిన వివరణతో పరిస్థితి మారింది. యాపిల్ ప్రతి ఏడాది టెస్టింగ్ కోసం బ్లాక్ డమ్మీ యూనిట్లను తయారు చేస్తుందని ఆయన తెలిపారు. కాబట్టి.. డమ్మీలో బ్లాక్ కనిపించడం, అదే రంగులో ఫోన్ అమ్మకానికి వస్తుందని అర్థం కాదు.
గత కొన్ని నెలల్లో చూసిన రంగులు ఇవే మూడు అని లీకర్ చెప్పడం బ్లాక్‌పై సందేహాలను పెంచింది. అయినా ఇది తుది నిర్ణయం కాదు. యాపిల్ అధికారికంగా ప్రకటించే వరకు రంగుల జాబితా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా iPhone 18 Pro లాంచ్‌కు ముందు మరిన్ని లీక్‌లు వచ్చే అవకాశం ఉంది.
iPhone 17 Pro సిరీస్‌లో యాపిల్ తొలిసారి బ్లాక్, డార్క్ గ్రే ఫినిష్‌లను పక్కన పెట్టి కాస్మిక్ ఆరెంజ్, సిల్వర్, డీప్ బ్లూ రంగులను తీసుకొచ్చింది. అదే విధానం iPhone 18 Proలోనూ కొనసాగితే.. బ్లాక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి నిరాశ తప్పదు. అయితే కంపెనీ తుది నిర్ణయం త్వరలోనే స్పష్టమవుతుంది.
కొత్త రంగుల్లో డార్క్ చెర్రీ ప్రత్యేకంగా కనిపించే అవకాశం ఉంది. స్కై బ్లూ కూడా Pro సిరీస్‌కు కొంచెం కొత్త లుక్ తీసుకురావచ్చు. అయితే రంగుల కంటే బ్లాక్ తిరిగి వస్తుందా లేదా అన్నదే ఇప్పుడు ఎక్కువ మంది యాపిల్ ప్రియులు ఆసక్తిగా గమనిస్తున్న విషయం.
Also Read: కేబుల్ కదిలిస్తేనే ఛార్జింగ్ ఎక్కుతుందా? మీ ఫోన్‌లో అసలు సమస్య ఇదే కావచ్చు!